Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 8174
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Monday, November 09, 2015 - 8:06 pm:   

ki mind dobbindi..

http://www.andhrajyothy.com/Artical?SID=171172

yee chestha lu enti...Raithula meeda case lu enti?

ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డుపై దాడి కేసుపై.
సర్కారు ‘పోలీసు చర్య’
9 మంది అన్నదాతల అరెస్టు..
రేపోమాపో మరో 50 మందికి బేడీలు!
పత్తికి మద్దతు ధర కోసం ఉద్యమించడమే నేరం
ఫుటేజీ ఆధారంగా ఖాకీల వేట
జోగు వ్యాఖ్యలపైనా వివాదం
ప్రతిపక్షాల ఆందోళన


(ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్‌)
మార్కెట్‌ కమిటీ కార్యాలయంపై దాడి చేశారన్న ఆరోపణలతో రైతులపై బనాయించిన కేసుల వ్యవహారం రోజు రోజుకూ ముదురుతోంది. రైతులు జీన్స్‌ ప్యాంట్లు టీషర్టులు వేసుకోరంటూ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. మద్దతు ధర రాని కారణంగా ఆవేదన చెంది మార్కెట్‌ కమిటీ కార్యాలయంపై దాడి చేసిన రైతులపై కేసులు నమోదు చేయవద్దంటూ విపక్షాలు కూడా ఆందోళనలు మొదలు పెట్టాయి. ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీపై ఈ నెల 2 న జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీల ఆధారంగా 60 మంది రైతులపై కేసులు నమోదు చేశారు. వీరిలో నుంచి తొమ్మిది మందిని మొదట అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. కేసుతో సంబంధం ఉన్న మరో 50 మంది కోసం నేడో...రేపో వేట మొదలు పెట్టబోనున్నట్లు సమాచారం. మరోవైపు మార్కెట్‌ యార్డుపై దాడిచేసినవారు రైతులు కారని, వారంతా మద్యం సేవించి దాడికి పాల్పడ్డారని, రైతులు టీషర్టులు, జీన్స్‌ ప్యాంట్లు
వేసుకోరని మంత్రి జోగు రామన్న వ్యాఖ్యానించారు. అంతేకాక దాడి చేసిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి పేర్కొనడం వివాదం మరింత ముదరడానికి కారణమైంది. అయితే కడుపు కాలిన రైతులు ఆగ్రహంతో మార్కెట్‌ కమిటీ కార్యాలయంపై దాడి చేశారే తప్ప ఇందులో ఎలాంటి కుట్ర లేదని పలు రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కేసులతో ప్రయేయం ఉన్న మిగతా రైతులు పోలీసులు తమను ఎప్పుడు అరెస్టు చేస్తారోనన్న ఆందోళనకు లోనవుతున్నారు. కాగా.. మంత్రి వ్యాఖ్యలను, పోలీసుల వైఖరిని మొదట నుంచి వివిధ ప్రజా సంఘాలు, టీడీపీ, బీజేపీ, సీపీఎం, రైతుకూలీ సంఘాలు విమర్శిస్తూ వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని అస్త్రంగా మలుచుకుని ప్రభుత్వ తీరును ఎండ గట్టాలన్న భావనతో ఆ పార్టీలన్నీ దీపావళి తర్వాత ఆందోళనలు చేయడానికి నడుం బిగించాయి. సోమవారం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట పత్తి రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ ఆందోళన చేపట్టారు.

రైతులపై నమోదు చేసిన కేసులు ఇవే...
పత్తిపంటకు మద్దతు ధరను కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంపై ఈ నెల 2న దాడి చేసిన రైతులపై పోలీసులు పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 147, 148, 353,448, 427, 506 తదితర సెక్షన్లతోపాటు సెక్షన్‌ (3)పీడీపీపీ, సెక్షన్‌ 7క్లాస్‌ (1), అలాగే ఆర్‌/డబ్ల్యు 149 ప్రకారం వివిధ రకాల కేసులు నమోదు చేశారు.

అరెస్ట్‌ అయిన రైతులు వీరే....
మార్కెట్‌ కమిటీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో అరెస్టయిన తొమ్మిది మందిలో మేడి గూడ గ్రామానికి చెందిన చిట్యాల భూమన్న, గిమ్మె గ్రామానికి చెందిన రంగినేని కిషన్‌రావు, జైనథ్‌ మండలం కౌట గ్రామానికి చెందిన కోరాట దయాకర్‌, ఆదిలాబాద్‌ మండలం చాందా(టి) గ్రామానికి చెందిన బుడ్డెరవి, తాంసి మండలం గిరిగాం గ్రామానికి చెందిన పోతంశెట్టి శంబులు, జైనథ్‌ మండలం పూసాయి గ్రామానికి చెందిన బుడ్డె రాజన్న, కనపమేడిగూడ గ్రామానికి చెందిన బోపతి రమణ, లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన ముస్కు లింగారెడ్డి, తలమడుగు గ్రామానికి చెందిన పేదల్‌వార్‌ సంతోశ్‌ ఉన్నారు.

రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలేదు. మార్కెట్‌ కమిటీ అధికారులు, ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కు కావడంతోనే పత్తి రైతుకు మద్దతు ధర లభించడం లేదు. తమకు మద్దతు ధర రావడంలేదన్న ఆక్రోశంతోనే రైతులు మార్కెట్‌ కమిటీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఎవరి కుట్ర లేదు. అమాయక రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి.
-రైతు ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ దారట్ల కిష్టు

వీడియో ఫుటేజీ ఆధారంగా అరెస్టులు
ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్ట్‌ చేశాం. వీడియో ఫుటేజీల ఆధారంగా దాడిలో పాల్గొన్న మిగిలిన వారిని కూడా రెస్టు చేస్తాం.
-ఆదిలాబాద్‌ డీఎస్పీ ఏ.లక్ష్మీ నారాయణ


కేసులుఎత్తివేయండి.. ఆర్డీవోకు టీడీపీ నేతల వినతి
రైతులకు మద్దతు ధర రూ.4100 చెల్లించాల్సి ఉండగా రూ.3800 చెల్లించడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టిన టీడీపీ, బీజేపీ నాయకులపై, మార్కెట్‌ కార్యాలయంపై దాడి చేసిన రైతులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని సోమవారం ఆదిలాబాద్‌ ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ముందుగా బీజేపీ, టీడీపీ నాయకులు కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా తీశారు. నాయకులపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని ఈ సందర్భంగా పలువురు నేతలు డిమాండ్‌ చేశారు.

మంత్రి రామన్న రైతులను అవమానించారు
రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో, జిల్లాలో పత్తి రైతులు బాధలో ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇటువంటి తరుణంలో ఆవేదనతో మార్కెట్‌ కార్యాలయంపై రైతులు దాడి చేశారే తప్పా దీనికి ఎవరి కుట్రలేదు. రైతులు జీన్‌ప్యాంట్స్‌, టీషర్టులు వేసుకోరంటూ మంత్రి జోగు రామన్న అనడం సరికాదు. అలా అనడం ద్వారా ఆయన రైతులను అవమానించారు. త్వరలో రాష్ట్రంలో మంత్రులను, టీఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యేలను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి.
- టీడీపీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు రాధోడ్‌ రమేశ్‌

కేసులను ఎత్తివేయకుంటే ద్యమిస్తాం
కడుపుకాలిన రైతులు మార్కెట్‌ కమిటీ కార్యాలయంపై దాడి చేస్తే వారిపై అక్రమంగా కేసులు బనాయించారు. కష్టాల్లో ఉన్న రైతును ఆదుకోవాలే తప్పా కేసులు పెట్టడం సరికాదు. పత్తి రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి, లేని పక్షంలో దశల వారీగా ఉద్యమాలు చేస్తాం.
- బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాయల్‌

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration