Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kingchoudary
Censor Bewarse
Username: Kingchoudary

Post Number: 98768
Registered: 03-2004
Posted From: 195.241.32.212

Rating: N/A
Votes: 0

Posted on Sunday, November 08, 2015 - 1:06 am:   

నా వయసు 20. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతని వయసు 22. మేం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. అయితే నాకో సందేహం. అతనికి పదమూడేళ్ల వయసప్పటి నుంచీ హస్తప్రయోగం అలవాటు ఉందట. ఇప్పటికీ చేస్తుంటాడట. ఇన్నేళ్లుగా అలా చేస్తున్నాడు కాబట్టి పెళ్లయ్యాక తనకి ఏమైనా సమస్యలు వస్తాయా? నేనతన్ని ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చా?
- శోభన, వరంగల్

హస్తప్రయోగం వల్ల నీరసించి పోతారు, పెళ్లయ్యాక భార్యను సుఖపెట్టలేరు అని చాలామంది మీలానే అనుకుంటూ ఉంటారు. అది కేవలం అపోహ మాత్రమే. హస్తప్రయోగం అనేది... తనలోని సెక్స్ కోరికలను తనకు తానుగా తీర్చుకునే పద్ధతి. దీనివల్ల పెళ్లయ్యాక ఎలాంటి సమస్యలూ రావు. మీరతన్ని ధైర్యంగా పెళ్లి చేసుకోవచ్చు.

నా వయసు 21. ఇంకా పెళ్లి కాలేదు. మెచ్యూర్ అయినప్పట్నుంచీ నాకు పీరియడ్స్ సరిగ్గా రావు. మొదట్లో రెండు నెలలకోసారి వచ్చేది. ఇప్పుడు ఐదు నెలలకోసారి వస్తోంది. డాక్టర్‌కి చూపిస్తే ఈ సమస్య చాలామందికి ఉండేదే, ఏం ఫర్వాలేదు అన్నారు. కానీ నెలసరి క్రమంగా రాకపోతే పెళ్లయ్యాక ఇబ్బందులు వస్తాయని, పిల్లలు పుట్టరని భయమేస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి?
- విజయలక్ష్మి, హైదరాబాద్

పీరియడ్స్ సక్రమంగా రావాలంటే... హార్మోన్లు, మెదడు, మనసు, శరీరం, గర్భాశయం, అండాశయాలు... అన్నిటి మధ్యా సమతౌల్యం ఉండాలి. అన్నీ సరిగ్గా పని చేయాలి. ఏ ఒక్కటి క్రమం తప్పినా పీరియడ్స్ రావు. రెండు నెలలకోసారి అంటే ఫర్వాలేదు కానీ, మరీ ఐదు నెలలకోసారి అంటే నిర్లక్ష్యం చేయ కూడదు. అన్ని పరీక్షలూ చేసి, సమస్య ఎక్కడుందో వీలైనంత త్వరగా తెలుసు కోవడం మంచిది. సమస్య ఏమిటో తెలిశాక చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే పెళ్లయ్యాక పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అవుతుంది. మీ బరువెంతో రాయలేదు. అధిక బరువు ఉండటం వల్ల హారోన్ల అసమతుల్యత ఏర్పడి, పీరియడ్స్ క్రమం తప్పుతాయి.

కాబట్టి బరువు ఎక్కువ ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి. థైరాయిడ్ సమస్య కానీ, హార్మోన్ల అసమతుల్యత కానీ ఉన్నాయేమో పరీక్ష చేయించుకుని, ఉంటే చికిత్స తీసుకోండి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించుకుంటే... గర్భాశయం చిన్నగా ఉందా, అండా శయాల్లో నీటి బుడగలు లేక సిస్టులు ఉన్నాయా వంటి పలు అంశాలు తెలుస్తాయి. ఏదైనా సమస్య ఉంటే దానికి కూడా చికిత్స తీసుకోవచ్చు. కాబట్టి మీరు భయపడకుండా గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లండి. చె ప్పిన పరీక్షలన్నీ చేయించుకుని, సూచించిన చికిత్స తీసుకోండి.

నా వయసు 32. నా భర్త సంవత్సరం క్రితం చనిపోయారు. పిల్లలు లేరు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని కూడా లేదు. కానీ నాకు కోరికలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏవైనా శృంగార సన్నివేశాలు టీవీలో చూసినా, అటువంటి ఆలోచనలు వచ్చినా కంట్రోల్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తోంది. కానీ అవి తీరే మార్గం లేదు కాబట్టి బలవంతంగా అణచుకుంటున్నాను. కానీ ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటోంది. పెళ్లి చేసుకోకుండా నన్ను నేను తృప్తి పరచుకునే మార్గం ఏదైనా ఉంటే చెబుతారా?
- సుగుణ, రంగారెడ్డి జిల్లా

ముప్ఫై రెండు సంవత్సరాలంటే చిన్న వయసే కదా! పిల్లలు కూడా లేరు కాబట్టి, మీకు తగిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదు. మీకింకా చాలా భవిష్యత్తు ఉంది. ఇలా కోరికలను అణచుకుని ఎంతకాలం ఉండగలరు! ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిని కొన్ని సార్లు బయటి వ్యక్తులు లోబరుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. లేదంటే ఒక్కోసారి మనసు అదుపుతప్పి మీరే తప్పటడుగు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని ఇక మీదట కొనసాగించకండి. ఎలాగూ మీకు జీవితంలో ఒక తోడు కూడా అవసరం కాబట్టి పెళ్లి గురించి ఆలోచించండి. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, జీవితంలోని మధురిమలను ఆస్వాదించండి. పెళ్లి చేసుకోకుండా తృప్తి పరచుకోవడం అంటే హస్తప్రయోగం ఒక్కటే మార్గం. కానీ ఎంతకాలం అలా ఉండగలుగుతారు!

నే ను, ఒకబ్బాయి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఎందుకో అతను ఉన్నట్టుండి మారిపోయాడు. పెళ్లి చేసుకోలేను అంటున్నాడు. మొదట్లో పెద్దవాళ్లు ఒప్పుకోవడం లేదనేవాడు. ఇప్పుడు తనకి సినిమా డెరైక్టర్ అవ్వాలనుంది, అందుకే చేసుకోను అంటున్నాడు. బతిమాలినా, బెదిరించినా కూడా ఒప్పుకోవడం లేదు. తనంటే నాకు చాలా ఇష్టం. తనతోనే కలిసి బతకాలనుంది. తను చాలా రొమాంటిక్ కూడా. సెక్స్ కోరికలు చాలా ఎక్కువ (కానీ మేం ఎప్పుడూ కలవలేదు). మరి పెళ్లంటే ఎందుకు ఇష్టం లేదంటున్నాడు?
- రేణుశ్రీ, మెయిల్

పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల ఇష్టం మీద జరిగితే బాగుంటుంది. లేకపోతే తర్వాత్తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీకు ఇష్టం ఉన్నా, ఏ కారణం చేతనో అతను వద్దంటున్నాడు. అలాంటప్పుడు తనని బలవంతపెట్టి ఏం లాభం? మరీ మీకంత ఇష్టంగా ఉంటే మెల్లగా తనని కన్విన్స్ చేయండి. తన మనసు మారేవరకూ ఇంకొన్ని రోజులు ఆగి చూడండి. అప్పుడు మీకు కూడా ఓపిక తగ్గి మీరే ఆ ప్రయత్నం మానుకుంటారు. ప్రేమ పెళ్లంటే ఇష్టం లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. పెద్దలంటే భయం, గౌరవం కావచ్చు. మీమీద ఇష్టం తగ్గి ఉండవచ్చు.

మీవల్ల తన జీవితం బాగుండదు అనిపించి ఉండొచ్చు. ఇంకెవరి మీదయినా మనసుపడి, వాళ్లను చేసుకుంటే తనకి లాభం కలుగుతుందని అనిపించి ఉండొచ్చు. కాబట్టి మీకు ఓపిక ఉంటే ఇంకొన్నాళ్లు ఆగి చూడండి. లేదంటే మీ మనసును మార్చుకోండి. మొదట్లో కష్టంగా అనిపించవచ్చు. వేరే పనుల మీద మనసు లగ్నం చేస్తే, మెల్లగా మీరూ తనని మర్చిపోతారు. అంతే తప్ప బలవంత పెట్టి చేసుకున్నా మీరు అతనితో సంతోషంగా మాత్రం జీవించలేరు.

నా వయసు 22. పెళ్లయ్యి సంవత్సరం అయ్యింది. మేమిద్దరం సెక్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంతవరకూ ఏ సమస్యా లేదు. అయితే పోయిన నెల పీరియడ్స్ వచ్చినప్పట్నుంచీ నాకు బ్లీడింగ్ ఆగడం లేదు. మామూలుగా అయితే మూడు నాలుగు రోజుల్లో తగ్గిపోవాలి కదా! ఇన్ని రోజులు ఎందుకు అవుతోంది?
- శిరీష, విజయవాడ

ఉన్నట్టుండి బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవ్వడానికి హార్మోన్ల అసమతుల్యత, ఆ నెలలో అండాశయాల్లో నీటి గడ్డలు ఏర్పడటం, మానసిక ఒత్తిడి వంటి ఎన్నో అంశాలు కారణం కావొచ్చు. కొంతమందిలో కొద్ది రోజులు పీరియడ్ ఆలస్యం అయ్యి, తెలియకుండా గర్భం వచ్చి, అబార్షన్ అయిపోవడం వల్ల కూడా ఎక్కువ రోజుల పాటు బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే గైనకాలజిస్టు దగ్గరకు వెళ్లండి. అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్ అవీ చేసి కారణాన్ని తెలుసుకుంటారు. తద్వారా వారు ఇచ్చే చికిత్స తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.

నా వయసు 25. పెళ్లై ఆరు నెలలు అవుతోంది. పిల్లల కోసం కొంతకాలం ఆగాలని అనుకుంటున్నాం. ఇప్పటి వరకూ ట్యాబ్లెట్లు వాడాను. కానీ వాటిని ఎక్కువ కాలం వాడటం మంచిది కాదు అంటున్నారు. నిజమేనా? మావారిని కండోమ్ వాడమంటే ఇష్టం లేదంటారు. నాకేమో లూప్ వేయించుకోవాలంటే భయం. అది సెట్ కాకపోతే సమస్యలు వస్తాయని ఎక్కడో చదివాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి.
- రంజిత, కాకినాడ

లూప్ లేదా కాపర్-టి ఒక కాన్పు తర్వాత వెయ్యించుకోవడం మంచిది. మొదట్లోనే వెయ్యించుకోవడం వల్ల కొందరిలో ఏదైనా ఇన్ఫెక్షన్ కనుక సోకితే, ట్యూబ్స్ మూసుకుపోయి గర్భం దాల్చడానికి ఇబ్బంది అవుతుంది. గర్భ నిరోధక మాత్రలు 2 నుంచి 3 సంవత్సరాల వరకు వాడవచ్చు. దానివల్ల ఇబ్బందులేవీ రావు. ఇప్పుడు వచ్చే తక్కువ డోస్ పిల్స్‌లో హార్మోన్ల మోతాదు చాలా తక్కువగా ఉంటోంది. వీటివల్ల దుష్ఫలితాలు అంతగా ఉండవు. కాకపోతే మూడో రోజు నుండి క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒకే సమయానికి వేసుకోవాలి. అలా ప్రతి నెలా 21 రోజుల పాటు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు వచ్చే మాత్రల్లో హార్మోన్ల మోతాదు కాస్త ఎక్కువగా ఉండేది. దాంతో వికారం, వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు ఎక్కువగా వచ్చేవి. మీరు ఓసారి గైనకాలజిస్టును సంప్రదిస్తే... మీ శరీర తత్వానికి సరిపోయే మాత్రలను సూచిస్తారు. అధిక బరువు ఉండేవాళ్లు, రక్తం గడ్డకట్టే గుణం ఉన్నవాళ్లు, లివర్ సమస్యలున్నవారు వీటిని వీలైనంత వరకూ వాడకపోవడమే మంచిది.

నాకు పెళ్లై సంవత్సరం అవుతోంది. కానీ ఇప్పటి వరకూ మేం కలవలేదు. కలయికకు ప్రయత్నించినప్పుడు వీర్యం సరిగ్గా బయటకు రాదు. అలా ఎందుకు అంటే... తనకు హస్తప్రయోగం అలవాటు ఉందని, బాగా చేసుకునేవాడినని, దాంతో అంగం చిన్నగా అయిపోయిందని, అందుకే వీర్యం రావడం లేదని అంటున్నారు. ఈ సమస్య ఎలా తీరుతుంది? మేం ఎలా దగ్గరవుతాం?
- జ్యోతి, నిజామాబాద్

హస్తప్రయోగం వల్ల అంగం చిన్నగా అయిపోవడం, వీర్యం రాకపోవడం అంటూ ఉండదు. వీర్యం సరిగ్గా రాకపోవడానికి మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత వంటి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఓసారి మీవారిని యూరాలజిస్టును సంప్రదించమనండి. అవసరమైన పరీక్షలు చేసి, కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు.

డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్
మోతీనగర్, హైదరాబాద్

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration