Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 7941
Registered: 03-2004
Posted From: 68.109.27.99

Rating: N/A
Votes: 0

Posted on Wednesday, September 30, 2015 - 6:09 pm:   

Dorala Telangana..


ఇదిట్లా జరుగుతుందని తెలియదా? బాగా తెలుసు. ఎప్పుడో తెలుసు. చాలా ముందే తెలుసు. మళ్లీ ఓయూ ఎన్సీసీ గేట్‌ దగ్గర బారికేడ్లు లాఠీచార్జీలు జరుగుతాయని, హాస్టళ్లమీదికి దాడులు చేసి విద్యార్థుల్ని చితకబాది ఈడ్చుకుపోతారని తెలుసు. ఊరూరా జల్లెడపడతారని, చిన్నప్పుడెప్పుడో జెండాలు పట్టినవారిని కూడా తెచ్చి స్టేషన్లలో నిద్రలు చేయిస్తారని తెలుసు. ఎనభైఏడేళ్ల పెద్దమనిషిని కూడా గృహనిర్బంధం చేస్తారని ఊహించలేదు కానీ, ఇళ్లే జైళ్లవుతాయని తెలుసు. ఇటువంటివన్నీ ఆగిపోలేదని, ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ మొదలవుతాయని, అవి అట్లా జరగకుండా ఉండడం సాధ్యం కాదని కూడా తెలుసును.

నర రక్తమాంసాలు దట్టించిన సుఖశయ్యల మీద నిద్రించడం అలవాటు పడిన వ్యవస్థ, యథాస్థితికి పిసరంత ఎడంగా కూడా ఎక్కువకాలం మనలేదని, కల్తీకల్లుకు మరిగిన శరీరంలాగా కల్లోలపడి పాతస్థితికి చేరుకునేదాకా ఊరుకోదని మనకు కనీసం సైద్ధాంతికంగా తెలుసును.

కానీ, ఆశ పాడుది. అది మనిషికి అన్ని విచక్షణలను దూరం చేస్తుంది. నిజంగానే, నిజంగానే సాధుతత్వం, స్వాదుతత్వం జయిస్తాయా అన్న సంశయం కూడా రాకుండా మనసుకు రెక్కలు మొలిపిస్తుంది.. ఆదమరచి ఉన్నవేళ, గతించినదనుకున్న యాతన, గొడ్డలివేటులాగా తాకుతుంది. వాస్తవికత హృదయవిదారకంగా ఆవిష్కృతమవుతుంది.

ఇరవయ్యేళ్ల కిందట ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మరొకసారి మొలకెత్తినప్పుడు భూమి మీద పడిన పిల్లలు ఇప్పటికి రెండు పదుల వయస్సుకు చేరారు. వారిలో కొందరు సొంతంగా జెండాలు పట్టుకుని ఉద్యమాలతో నడిచి ఉంటారు. చాలా మంది తమ తండ్రులు, తల్లులు, అన్నలు, అక్కలు పోరాటాలతో ఆకాంక్షల ఆరాటాలతో సతమతమవుతుంటే ఆసక్తిగా ఉత్సాహంగా గమనిస్తూ ఉండి ఉంటారు. పదహారు నెలల కిందట తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు తమ కళ్ల ముందు విజయించిన ఒక సన్నివేశం వారిని పరవశుల్ని చేసి ఉంటుంది. ఉద్యమంలో నినదించి, ఆ నినాదాన్ని మరింత కొనసాగించడానికి దుర్గమసీమలకు వెళ్లిన వివేక్‌ అనే పిల్లవాడు, తమ ఈడువాడే, అకాల, అసహజ, అన్యాయ మరణం పాలయినప్పుడు, ఈ ఇరవయ్యేళ్ల తరం అంతా దిగ్ర్భాంతి చెంది ఉంటుంది. వారికేమీ అర్థమయి ఉండదు. ఈనెల పదిహేనో తేదీన శ్రుతి, సాగర్‌ అనే ఇద్దరు యువజనుల దారుణమరణాన్ని చూసిన తరువాత వారికి చాలా అర్థమయి ఉంటుంది. వాళ్ల కళ్లల్లోకి చూడడానికి వాళ్ల తల్లిదండ్రులకు, అన్నలకు, అక్కలకు ధైర్యం చాలి ఉండదు.ఏ బూడిదలో పోశాము కన్నీటినీ నెత్తుటినీ అని ఒక క్షణం సంశయం కలిగే ఉంటుంది. ఓడిపోవడం అవమానమేమీ కాదు కానీ, మోసపోవడం వారి తప్పేమీ కాదు కానీ, కఠోరవాస్తవంతో భేటీ కావడం ఏమంత ఆహ్లాదంగా ఉండదు. దాహం తీరుస్తామని పిలిచి, ఒక ఎండమావి ఎంత క్రూరంగా పరిహసించింది?

ఉద్యమకెరటాల మీద తేలి వచ్చి గద్దెనెక్కిన నాయకత్వమే ఎండమావి తప్ప తెలంగాణ కాదు అని కొత్త తరానికి చెప్పగలం. ఎందుకంటే, వైఫల్యాలను ద్రోహాలను చీదరించుకున్నా, పోరాటాలను ఈ నేల మహత్తర జ్ఞాపకాలుగా పదిలపరచుకున్నది. కాని, ఎడతెగని వెతలకు ఒక ముగింపు కాకపోయినా, కనీసం ఒక విశ్రాంతి దొరికిందని మురిసిపోయిన తెలంగాణ వృద్ధ తరాన్ని ఇప్పుడు ఏమని ఓదార్చగలం? డెబ్భై ఏళ్ల నెత్తుటి జీవనయానం వైకుంఠపాళిలో మళ్లీ మొదటికి వచ్చామని, పోరాడి తెచ్చుకున్న విజయఫలాన్ని గద్దలెత్తుకుపోయాయని, ఇప్పుడిక మళ్లీ మొదలుపెట్టాలని ఏమని చెప్పగలం? నిరంతరం పోరాటం- పోరాటం తప్ప విరామమే దొరకని నేల ఇది, ముత్తాతల నుంచి మునిమనవల దాకా గాయాలే కదా, తెలంగాణా? నీ బిడ్డల ఒంటి మీద??

అయినా గర్వించగలిగిన అద్భుతమేమిటంటే, తెలంగాణ సమాజం వేసట పడడం లేదు. అలసిపోయిందేమో కానీ విసిగిపోలేదు. చేదు ఎదురయినా ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. తిరిగి తనను తాను కూడగట్టుకుని కొత్త ప్రయాణం ఆరంభించగలనని చాటుకున్నది. టర్కిష్‌ బీచ్‌లో కొట్టుకుని వచ్చిన సిరియన్‌ బాలుడి ఫోటో ప్రపంచసమాజాన్ని మానవీయ వేదనతో, కొంత నేరభావనతో ఎంతగా కలవరపరచిందో, శ్రుతి, సాగర్‌ల మృతదేహాలు తెలంగాణ సమాజాన్ని అంతగా కలచివేశాయి ఒక దుర్మార్గాన్ని ఒడిసిపట్టిన ఛాయాచిత్రం, వేదనను, ఆగ్రహాన్ని మాత్రమే కాదు, సమీక్షకు కూడా కారణమయ్యింది. పౌరసమాజంలో సింహభాగం ఒకే ఛత్రం కింద సమీకృతమయింది. సెప్టెంబర్‌30, ఉద్యమప్రస్థానంలో సాగరహారం అల్లిన రోజున, నూతన తెలంగాణ ప్రభుత్వంపై తన అసమ్మతిని బాహాటంగా, ప్రస్ఫుటంగా ప్రకటించింది. దిగ్బంధం చేసి ఉండవచ్చును కాక, అడుగడుగున పహారాతో అడ్డుకుని ఉండవచ్చును కాక, తెలంగాణ ఉద్యమసమాజం తన కేకను తాను వినిపించింది. తనతో కలసి నడిచిన, తనను నడిపించిన ఉద్యమశక్తులతో హింసాత్మకంగా విడిపోదలచుకున్న అధికారపక్షానికి ప్రతిపక్షంగా తానేమి సమాధానం ఇవ్వగలదో ఇచ్చింది. తనది బలపడుతున్న వాయుగుండమని హెచ్చరిక కూడా చేసింది. సకల సామాజిక ఉద్యమశ్రేణులు అవసరమైతే ఒక్కతాటి మీద ఒక్కమాట మీద నిలవగలవని సూచన చేసింది. చనిపోయినవారు వృధాగా చనిపోలేదు, ప్రభుత్వాన్ని నిర్విచక్షణగా నెత్తికెత్తుకోవడమే కొత్త వరవడిగా మారుతున్న సమయంలో ఇదొక కొత్త ఆశ.
పోలీసు కాల్పుల్లో ఛిద్రమైన దేహాలే కాదు, హైదరాబాద్‌ టాంక్‌బండ్‌ నీడన వేలాడిన లింబయ్య దేహం కూడా తెలంగాణ సమాజాన్ని దీర్ఘకాలం వెంటాడే విషాదదృశ్యం. తెలంగాణ పల్లెపల్లె వల్లకాడుగా మారుతున్నది. ఆకుపచ్చని తెలంగాణ కావాలని, ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలని, మానవహక్కులకు భంగం లేని తెలంగాణ కావాలని, సకల సామాజిక వర్గాలకు న్యాయం దొరికే తెలంగాణ కావాలని - కోరుకున్న సమాజానికి ఇప్పటిదాకా ఆశాభంగమే ఎదురయింది.. రాషా్ట్రవతరణ తరువాత ఏర్పడిన ప్రభుత్వానికి ఇంత తొందరగా నైతికత లేకుండా పోతుందని ఎవరూ అనుకోలేదు. పోవాలని ఎవరూ ఆశించలేదు. కొంతకాలమైనా ఉద్యమాదర్శాలను గుర్తు తెచ్చుకుంటూ పాలన సాగుతుందని అంతా ఆశించారు. ఎవరు మాత్రం కోరుకుంటారు, ఘన విజయఫలం చేదెక్కాలని? కానీ, అదేమి చిత్రమో, గెలిచినప్పటి నుంచి, ఎప్పుడు ఉద్యమభారాన్ని వదిలించుకుందామా, మునుపటి పాలకుల వలె మారిపోదామా అన్న తహతహ నేతలలో కనిపించింది. పాత మిత్రులను విదిలించుకోవాలని, ఆకాంక్షలను నెరవేర్చి సాధించే సమ్మతితో కాక దాన, భేద, దండోపాయాలతో ప్రజలను లోబరచుకోవాలని ప్రభుత్వం చూస్తున్నది. జనాభిప్రాయాన్ని తెలుసుకొని మసలుకోవడం అటుంచి, సొంత పార్టీలోని, ప్రభుత్వంలోని సహచరులకు కూడా సొంత మనోగతాలకు గౌరవమున్నట్టు లేదు. అధికారపార్టీలోని ప్రజాప్రతినిధుల్లో, తరువాత చేరిన తాలూతప్పా పక్కన బెట్టినా, కొందరైనా తెలంగాణావాదులూ ఉద్యమకారులూ ఉన్నారు కదా, వారిని సంప్రదిస్తే కనుక, ఆత్మహత్యలపై సుదీర్ఘ మౌనాన్ని సమ్మతించేవారా? వరంగల్‌ ఎన్‌కౌంటర్‌కు ఓకే చెప్పేవారా? అంతెందుకు, తెలంగాణలోని సాధారణ శాంతిభద్రతల యంత్రాంగం మనసులో మాట తెలుసుకుని ఉన్నా, ఇప్పటికిప్పుడు కాల్పులపర్వాన్ని ఆహ్వానించేవారా? ఉద్యమం నుంచి పుట్టినపార్టీ ఏకవ్యక్తి కేంద్రితంగా మారితే, మంచి సలహాలు ఇచ్చేవారుండరు, ముప్పును హెచ్చరించే శ్రేయోభిలాషులూ ఉండరు. వ్యవసాయరంగంలో తీవ్రసంక్షోభం నెలకొని, వాగ్దానాలేవీ నెరవేర్చలేని స్థితిలో, వ్యతిరేకత ముసురుకుంటున్న తరుణంలో, ఎవరన్నా, జనం మనసు విరిగిపోయే చర్యలకు పాల్పడతారా?

ఎన్‌కౌంటర్లలోని అమానుషత్వం, ఆత్మహత్యలపై అలక్ష్యం- వీటి తీవ్రతల సంగతి అటుంచి, ప్రభుత్వం, ప్రభుత్వాధినేత తమ వైఖరి వల్ల తమకు తామే చేటు చేసుకున్నారు.

భ్రమలను తొందరలోనే తుంచి వేసి, ప్రజలకు మేలు చేశారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration