Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 24277 Registered: 08-2008 Posted From: 119.56.127.240
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, September 30, 2015 - 7:42 am: | |
రాజస్థాన్, సెప్టెంబర్ 30: రాజస్థాన్లోని రాజసముంద్లో ఓ చిరుత పులి తల ఓ బిందెలో చిక్కుకుపోయింది. ఎండ ధాటికి తాళలేక నీటి కోసం అటవీ ప్రాంతానికి సమీపంలోని రాజసముంద్ గ్రామంలోకి వచ్చిన చిరుత అక్కడే ఉన్న స్టీల్ బిందెలో నీళ్ళు తాగేందుకు యత్నించింది. ఈ క్రమంలో దాని తల అందులో చిక్కుకుపోయింది. మూడు గంటల పాటు యత్నించినా తల బయటకు రాలేదు. ఆ సమయంలో గ్రామస్థులంతా తమ కెమెరాలతో చిరుత పులిని అతి సమీపం నుంచి వీడియో తీసుకున్నారు. కొందరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. తల చిక్కుకుపోయింది కానీ లేకపోతే దాని సమీపంలోకి కాదు కదా పేరు చెబితే కూడా పరుగులు తీసేవారు జనం. చివరకు అటవీ శాఖ అధికారులు బిందె నుంచి చిరుత తలను బయటకు తీశారు. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేశారు. https://youtu.be/jriJC--2rDQ |