Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets   Hide Images

Rate this post by selecting a number. 1 is the worst and 5 is the best.

    (Worst)    1    2    3    4    5     (Best)

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Superman
Kurra Bewarse
Username: Superman

Post Number: 1539
Registered: 10-2005
Posted From: 75.73.208.143

Rating: N/A
Votes: 0

Posted on Friday, August 21, 2015 - 6:52 pm:   

తెలుగు తెరకు కొత్త ‘స్టెప్పులు’ నేర్పిన కథానాయకుడు! తెలుగు రాజకీయ చదరంగంలో తనదైన శైలిలో పావులు కదిపిన నాయకుడు! కొంత విరామం తర్వాత... మళ్లీ వెండితెరపై జిగేల్‌మంటూ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్న ‘అందరివాడు’... ఆయనే చిరంజీవి! షష్టిపూర్తి వయసులోనూ ‘కుర్ర హీరో’లతో పోటీ పడతానంటున్నారు. శనివారం చిరంజీవి 60వ పుట్టినరోజు నేపథ్యంలో ఆయనతో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూ...

ప్ర. మీ సినిమా ప్రస్థానాన్ని చూస్తే ఏమనిపిస్తోంది?
చాలా సంతృప్తిగా ఉంది. ఈ జన్మకు సార్థకత లభించినట్లే. ఏదో సాధించలేకపోయామన్న అసంతృప్తి లేదు. అయితే.. ఇక చాల్లే అని ఆగిపోవడం నా అభిమతం కాదు.

ప్ర. ఇంకా ఏం సాధించాలనిపిస్తోంది?
ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నా ఇక్కడ స్తబ్దత ఏర్పడింది. నేను సినిమా చేయాలని అత్యధిక ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ సమయాన్ని అందుకు వాడుకోవాలనుకుంటున్నా.

రాజకీయాల్లో ఎందుకు రాణించలేకపోయారు?
సినిమా ఓ పరిధిలో ఉంటుంది. టీమ్‌తో కలిసి సరిగా పనిచేయగలిగితే అందరినీ అలరించవచ్చు. రాజకీయాల్లో ఒక్కడివల్లా, టీం వల్లా ఏం కాదు. ఎదురు పోరాటాలు, దెబ్బలు, సహనానికి పరీక్ష, చెయ్యనిదానికి మాటలు పడే దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నెగ్గుకురావడం చాలా కష్టం. రాజకీయాలు నిరంతర పోరాటం.

ప్ర. పీఆర్పీని కాంగ్రెస్‌లో కలపకుంటే విభజన తర్వాత చిరంజీవికి మంచి అవకాశమొచ్చేదన్న వ్యాఖ్యలపై ఏమంటారు?
అటువంటి మాటలను నేను కూడా విన్నా. కానీ, ఆ నాటికి నేను తీసుకున్న నిర్ణయం సరైనదే. దాని గురించి బాధపడడంలేదు.

ప్ర. తెలంగాణలో నేతలంతా ఏకమై రాష్ట్రం సాధించుకున్నారు. కానీ, ఏపీలో సఖ్యత లేక ఏం కావాలో అడగలేదు కదా?
అడగలేదనొద్దు. అడిగాం. అందుకే బిల్లులో అన్నీ పొందుపరిచారు. వాటిని తర్వాతి ప్రభుత్వాలు నెరవేరిస్తే ఏపీకి నష్టమే ఉండదు. సీమాంధ్ర నేతలు ఏకతాటిపై నడవలేదన్నది నిజమే. రాష్ట్ర నేతలు ఒకలా, కేంద్రస్థాయిలో మరోలా మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి విభజన జరగదని చివరివరకూ ఏమార్చారు. అదే జనాల్లోకి వెళ్లిపోయింది. ఏం కావాలో అడగలేదు. శాశ్వత యూటీనా, తాత్కాలిక యూటీనా ఏదో ఒకటి సాధించుకుంటే నేడు సెక్షన్‌ 8 వివాదం తలెత్తేది కాదు.

ప్ర. ప్రత్యేక హోదాను కాంగ్రెస్‌ ఎజెండాగా పెట్టుకున్నారేం?
ఏపీకి కావాల్సింది ప్రత్యేకహోదా. ఎన్ని నిధులు, ప్యాకేజీలు ఇస్తామన్నా అది వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడినట్లే తప్ప హక్కుగా సాధించుకోలేం. అందుకే హోదాకోసం పట్టుబడుతున్నాం.

ప్ర. హోదాతో పరిశ్రమలకు రాయితీలు రావు. దానికి మళ్లీ ప్రత్యేకంగా నోటిఫై చేయాలి. సమైక్యమంటూ కిరణ్‌ ఏమార్చినట్లుకాక ఇప్పుడైనా రియలిస్టిక్‌గా వెళ్లొచ్చుకదా?
అలా ఎలా చెబుతారు? హోదా ఉంటేనే పరిశ్రమల కు రాయితీలు, ప్రోత్సాహకా లు వస్తాయి. ప్రత్యేక హోదా అంటే అంతర్లీనంగా పన్ను రాయితీ ఉండాలనే పట్టుబడుతున్నాం. హోదా లో ఏముంటాయో వెంకయ్యగారికి చెప్పక్కర్లేదు. అందుకే ఆ రోజు ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని పట్టుబట్టారు. పరిశ్రమలు పెట్టడానికే రెండేళ్లు పడుతుందన్నారు. మూడేళ్లలో ఏం అభివృద్ధి చెందుతాయనీ ప్రశ్నించారు. హోదా అంటే పరిశ్రమలకు రాయితీ కూడా అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

ప్ర. హోదాపై పోరు మొదలుపెట్టింది మీరు, మీ పార్టీ. ఇప్పుడు జగన్‌ రంగంలోకి దిగి బంద్‌లు చేస్తున్నారు. ఏమంటారు?
బంద్‌లు చేస్తే సరిపోదు. కేంద్రాన్ని నిలదీయాలి. ఆయన నిలదీయలేరు. మొన్న ఢిల్లీలో ఆయన ధర్నా చూశాం. అక్కడ వెంకయ్య పేరుగానీ, మోదీ పేరుగానీ ప్రస్తావించారా? రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తారని నిలదీయగలిగారా? ఆ దమ్ము, ధైర్యం ఆయనకు లేవు. ఆయనకున్న ఇబ్బందులేమిటో మనకు తెలియదు.

ప్ర. జగన్‌ కాంగ్రెస్‌తో కలుస్తారని జనంలో సందేహం ఉంది?
ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు. దీనిపై మా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. అటువంటి పరిస్థితే వస్తే ఆ రోజు నా రియాక్షన్‌ చూస్తారు.

ప్ర. హోదా అంశంతో కాంగ్రెస్‌ సేవ్‌ అయింది. బీజేపీ ఆత్మరక్షణలో పడింది. కానీ, మీ పార్టీకి వైసీపీ ముప్పు అలాగే ఉంది. బొత్సలాగే మరికొందరు వెళ్లిపోతారంటున్నారు?
కార్యకర్తల ఒత్తిడివల్ల, వ్యక్తిగత ఇబ్బందులతో బొత్స వైసీపీలోకి వెళ్లి ఉండవచ్చు. కానీ... ఆయన మనస్ఫూర్తిగా వెళ్లారని, వైసీపీ అద్భుతమైన పార్టీ కాబట్టి వెళ్లారని నేననుకోవడంలేదు.

కాంగ్రెస్‌ పుంజుకుంటుందని మీరు నమ్ముతున్నారా?
కచ్చితంగా.. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. గతంలో రెండు సీట్లున్న బీజేపీ.. నేడు అధికారంలోకి రావడం చూశాం. కాంగ్రెస్‌ కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం చూశాం. మళ్లీ పుంజుకోవడమూ చూశాం. రాహుల్‌ను ఎప్పుడూ విమర్శించే మీడియా కూడా ఆయన పరిణతి చెందారంటోంది. ఈ మధ్య నేనూ ఆయన తో సన్నిహితంగా ఉంటున్నా. పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నేను, రాహుల్‌ అక్కడికెళ్లాం. ఆయన విద్యార్థులతో మాట్లాడిన విధానం, మమేకమైన పద్ధతి చాలా బావుంది. ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అది మాకు హెల్ప్‌ అవుతోంది.

చరణ్‌ ఈ మధ్య వ్యాపారరంగంలో రాణిస్తున్నాడు కదా?
వాడికి బిజినెస్‌ అంటే ఇష్టం. కోడలు ఉపాసన కూడా కార్పొరేట్‌ కుటుంబం నుంచి వచ్చింది. అందుకని ఏదైనా బిజినెస్‌ ప్లాన్‌ ఉంటే వాళ్లు నాకు చెప్తారు. అంతా సమష్టి నిర్ణయం తీసుకుంటాం.

మీ కోడలు తెలంగాణ అమ్మాయి కదా!
తెలుగువాళ్లం కదా! అందరం ఒక్కటే. మా కోడలు బంగారం.

తమ్ముడుపై అన్నయ్య...
మీరెంతగానో ఇష్టపడే తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌ను బాగా విమర్శించారు. మీకేమనిపించింది?
పవన్‌ పూర్తి అవగాహనతో మాట్లాడలేదని అనిపించింది. నిజాలు తెలియక ప్రతిపక్షాల మాటల ప్రభావానికి లోనవడం వల్లే అలా మాట్లాడాడని అనిపించింది. ఈ విషయాన్ని అతనికి రాజకీయ వేదికలమీద నుంచే చెప్పాను. ఎక్కడ కలిసినా రాజకీయాల గురించి మాట్లాడుకోరాదన్నది మా ఒప్పందం. తన అభిరుచులు, అభిప్రాయాలు, ధ్యేయం నాకన్నా భిన్నం. వ్యక్తిగతంగా రామ్‌చరణ్‌ ఎంతో పవన్‌ కూడా అంతే. వాడూ నాబిడ్డే.

సీఎం కావాలని మీరు, పవన్‌ ప్రయత్నిస్తున్నట్లుంది?
మాకు పదవుల కాంక్ష లేదు. సేవా భావమే ఉంది. సేవ ఎలాగైనా చేయొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన చేయలేమని కాదు. నా విషయంలో మాత్రం పదవే పరమావధి కాదు. పవన్‌కు పదవీకాంక్ష ఉంటుందని నేననుకోను.

చరణ్‌, బన్నీలపై చిరు...
రమ్మనండి రఫ్ఫాడిస్తాను...
‘‘మామూలు పరిస్థితుల్లో అయితే ఈ పాటికే విన్న కథల్లో ఏదో ఒకటి ఓకే చేసేవాళ్లం. భారీ అంచనాలు, అసాధారణ పరిస్థితులు ఉన్నందువల్ల కథనెంచుకోవడం ఆషామాషీ కాదు. సినిమాలో నేనుంటే చాలని చాలామంది అంటుంటారు. నిజానికి మంచి కథనం ఉండాలి. ఎమోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉండాలి. దాంతోపాటు సమాజానికో సందేశం ఉండాలి. డైరెక్టర్‌గా ముందు పూరీ జగన్నాథ్‌ అనుకున్నాం. ఆయన కథ ఫస్ట్‌ హాఫ్‌ అందరికీ నచ్చింది. సెకండాఫ్‌ పూరీకీ నచ్చలేదు. ఒకవేళ మార్పు చేశాక మా ఇద్దరికీ నచ్చితే ఆయనే డైరెక్ట్‌ చేస్తాడు. ఇక ప్రేక్షకులు నా నుంచి కోరుకునేదే డ్యాన్స్‌. కాబట్టి డ్యాన్స్‌లు తప్పనిసరి. బన్నీ, రామ్‌చరణ్‌ డ్యాన్స్‌ల దూకుడు నిజమే. చాలెంజ్‌గా తీసుకుంటా. కమాన్‌ రమ్మనండి వాళ్లని.. రప్ఫాడిస్తా. నిజానికి నేను మళ్లీ వస్తుంటే వాళ్లే భయపడుతున్నారు. ఇక రాజమౌళి వండర్‌ బాయ్‌. అలాంటి డైరెక్టర్‌తో సినిమా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు! కానీ.. అదలా జరిగిపోవాలంతే!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration