Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 21896 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Friday, August 29, 2014 - 6:05 am: | |
Naaistam:
సాక్షి: ఎలాంటి ఆహారం తీసుకుంటారు? నాగ్: ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్‌కి వీలైనంత దూరంగా ఉంటాను. మసాలాలు ఎక్కువగా వాడను. ముఖ్యంగా గరమ్ మసాలా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. సాక్షి: గరమ్ మసాలాతో ఏంటి సమస్య? నాగ్: ఆ మసాలాని ఎక్కువగా మాడ్చేస్తే కేన్సర్ సోకే ప్రమాదం ఉంది. ఎక్కువగా ఫ్రై చేస్తే.. దాదాపు విషం అనే చెప్పాలి. నేను అప్పుడప్పుడూ వంట చేస్తుంటాను. అప్పుడు గరమ్ మసాలాని చాలా స్లయిట్గా వేయించుతా. నేను వండే వంటకాల్లో తాలింపు ఉంటుంది కానీ, మసాలాలు చాలా తక్కువ. సాక్షి: కారం తక్కువగా తింటారా? నాగ్: అలా ఏం లేదు. విపరీతంగా తింటా. పచ్చిమిరపకాయలు నూరి, రోటి పచ్చళ్లు చేస్తారే... అవంటే చాలా ఇష్టం. బీరకాయ, వంకాయ, బీట్రూట్ పచ్చళ్లు బాగా తింటాను. బీరకాయ తొక్కులతో చేస్తారు కదా.. ఆ పచ్చడి కూడా చేయించుకుంటాను. ఆ తొక్కల్లో చాలా విటమిన్స్ ఉంటాయి. వేడి వేడి అన్నంలో పచ్చడేసుకుని, రెండు స్పూన్లు నెయ్యేసుకుని తింటే ఉంటుందీ... సాక్షి: ఊరగాయ పచ్చళ్లు తింటారా? నాగ్: పచ్చళ్లు చేసిన తర్వాత ఒకటి, రెండు నెలల వరకు తింటాను. ఆ తర్వాత నిలవ పచ్చళ్ల జోలికి వెళ్లను. |