Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 26469 Registered: 08-2004 Posted From: 91.152.108.221
Rating: N/A Votes: 0 | Posted on Monday, July 07, 2014 - 9:11 am: | |
Balayya chesi chupinchadu Posted 05 July 2014 - 02:19 PM విశ్వవిఖ్యాత నటసర్వాభౌముని తనయునిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలయ్య నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు , ఇప్పుడు రాజకీయాల్లో కూడా రంగప్రవేశం చేసి తన తండ్రికి కూడా సాద్యం కాని పని చేసి చూపించాడు, హిందూపురం mla గా గెలిచినప్పటినుండి నియోజకవర్గ ప్రజలను అంటిపెట్టుకుని ఉంటన్న బాలయ్య రాజకీయాలకు కొత్త అయినా తనేంటో నిరూపిస్తూ 27 సంవత్సరాల తర్వాత హిందూపురం పురపాలక సంఘాన్ని తెదేపా లోకి మరలించాడు. 38 వార్డులున్న హిందూపురం లో తెదేపాకు 19 వార్డులు వచ్చాయి కానీ అక్కడ గెలుపొందిన స్వతంత్ర,సిపిఐ అభ్యర్దులను కూడా తమ వైపు తిప్పుకొని హిందూపురం పురపాలకసంఘముపై తెదేపా జెండా రెపరెపలాడేలా చేసాడు.గతంలో తన తండ్రి ఎన్టీఆర్ ఇక్కడ నుండి mla గా గెలిచి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నా పురపాలకసంఘమును మాత్రం దక్కించుకోలేక పోయారు. బాలయ్య మాత్రం రాజకీయ ప్రవేశం చేసిన రెండు నెలల్లోనే ఆ రికార్డు ను సాదించి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు.. space for lease
|