Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 20375 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Thursday, April 10, 2014 - 3:48 am: | |
ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ కథనం ప్రచారంలో ఉంది. అదేమిటంటే... అల్లు అర్జున్ , కిక్ శ్యామ్ అన్నదమ్ములు. శ్యామ్ పోలీస్ అధికారి. కిక్ శ్యామ్ రూల్స్‌ను పాటించే స్క్రిక్ట్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే, ఎలాంటి రూల్స్‌ను లెక్కపెట్టకుండా లక్ష్యాన్ని సాధించే తమ్ముడిగా అల్లు అర్జున్ కనిపిస్తారు. వీళ్లిద్దరూ తరచూ కీచులాడుకుంటారు. అవి పెద్ద గొడవలు కాదు. కానీ వీరి తల్లికి మాత్రం వీరిద్దరిని రామలక్ష్మణుల్లా చూడాలని ఉంటుంది. ఇలా వీరిద్దరి గొడవలతో గడుస్తూండగా... శ్యామ్... ఓ అవినీతి మినిస్టర్ కి చెందిన క్రిమినల్ ఏక్టివిటీస్ పట్టుకుని అరెస్టు చేయటానికి రెడీ అవుతాడు. అయితే అతన్ని పట్టిచ్చే డాక్యుమెంట్స్ తన కారులో దాస్తాడు. అయితే ఆ కారుని అల్లు అర్జున్ వేసుకుని వెళ్లిపోతాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే... అల్లు అర్జున్ వద్ద నుంచి ఆ కారుని ఆ మినిస్టర్ కి చెందిన వారు దొంగిలిస్తారు. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి తన అన్నను ఆ మినిస్టర్ చంపాలనుకుంటున్నారు అని తెలుస్తుంది. అక్కడ నుంచి అతను తన అన్నను రక్షించటానికి, విలన్ దగ్గర చేరి, తన అన్నతో విరోధం ఉన్నట్లు చెప్పి,దగ్గర అవుతాడు. అక్కడ నుంచి అతని నాశనానికి అల్లు అర్జున్ ఏం చేసాడన్నది మిగతా కథ. |