Ramu
Yavvanam Kaatesina Bewarse Username: Ramu
Post Number: 6547 Registered: 03-2004 Posted From: 199.244.214.109
Rating: Votes: 4 | Posted on Thursday, April 03, 2014 - 5:09 pm: | |
pakka DB lO evarO FB lO oka ammAyi post chEsina matter ni cut and paste chEsAru. nEnu ikkaDa chEstunnAnu... ee DB lO andarU rAsindi oka ett aitE, ee ammAyi rAsindi oka ettu... ONCE I STEP IN,, HISTORY WILL REPEAT (నిజం,, ఇది నిజం) -------------------------------------------------------------------------------- ఒక అగ్ని పర్వతం,, ఒక నిప్పుల వాన,, ఒక ఉప్పెన, ఒక ప్రచండం,, ఒక సునామి,, ఒక పెళ పెళ మెరుపు,, ఒక విశ్వరూపం,, ఒక మహా గర్జన ఆయన నటన...... ఒక ఆవేశం,, ఒక ఆగ్రహం,, ఒక మొండితనం, ఒక ఊగ్రం, ఒక ఉద్రుతం, ఒక విస్పొఠనం, ఒక తీవ్రమైన శక్తి,, ఒక పొగరు, ఒక పిడుగు కలిస్తే ఆయన..... అసలు ఏంటీ ఆ ఎనర్జీ,, ఈ వయసులో ఇంత ప్రభంజనమా... సింహా ని మించి గర్జించారు,,, సమర సింహా రెడ్డి ని మించి విజ్రుభించారు,, నరసింహనాయుడు ని మించి శాసించాడు..... నిజంగా నేను ఇంత Expect చేయనే లేదు.... మామూలు నటన కాదు,, తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు..... డాన్స్ కూడ అధరగొట్టేసారు...... NTR తర్వాత ఎవరూ లేరు అనుకునేదాన్ని,, కాని ఈ సినిమా నా ఫీలింగ్ మార్చేసింది.... ఇక సినిమాకి వస్తే సుహాసినీ గారితో పాటు వున్న చిన్నప్పుడు బాలక్రిష్ణ గారిలా మొక్షజ్ఞ చేసుంటే ఎంత బాగుండేదో అనిపించింది..... సుహాసినీ గారు వుంది ఒక్క 10 నిముషాలే అయినా తన సహజమైన నటనతో సూపర్ అనిపించారు,, జగపతిబాబు నాన్నతో మీకు తలరాతలు మార్చటమే వ్చ్హేమో వాళ్ళు తలకాయలే తీసేస్తారండీ అని చెప్పే తీరు సింప్లీ సూపెర్బ్... చాలా కూల్ గా నీ బొంద వాళ్ళని నువ్వేం పీకలేవురా అన్నట్లు చెప్పారు.... ఇక జగ్గు దాద,, జగపతి బాబు ఇంత ఎక్ష్ట్రార్డనరీ గా చేస్తాడని అనుకోలేదు.. ఆయన ఇంతకు ముందు హీరోగా చేసారూ అన్న సంగతీ ఏ ఒక్కా సీన్ లో కూడా జనాలకి గుర్తే రాదు,, అంత బాగా చేసారు..... ప్రతీ సీన్లో బలక్రిష్ణ గారికి పోటాపోటి గా చేసారు,, రైల్వే ట్రాక్ మీద హీరోయిన్ ని చంపే సీన్ లో అనుకోకుండా ట్రైన్ దిగిన బాలక్రిష్ణని చూసి ఒక నిస్సహాయమైన నవ్వు నవ్వుతూ వీడ్ని నేనెక్కడ ఢీ కొట్టగలనూ అని ఒక ఎక్ష్ప్రెష ఇస్తారు వాహ్ అది నిజంగా భలే వుంది..... ఇంక నేను షాక్ అయిపోయి అలాగే చూస్తుండిపోయిన సీన్ ఏంటంటే ''లెజండ్'' ఇంట్రడక్ష,, అసలు ఒక వెయ్యి ఉప్పెనలు కలిసి వస్తే ఎలా వుంటుందో అంత అద్భుతంగా తీసాడు బోయపాటి... ఈ రేంజ్ సీన్ ఈ దసాబ్దంలో ఏ సినిమాలో రాలా... ఒక ''POWERFULL POWER'' ని చూపించినట్లు చూపించారు మా మమ్మీ కూడా స్టన్ అయిపోయి అలాగే చూస్తుండిపోయింది.... ఇక అక్కడ నుండి వచ్చే సినిమా అంతా ఒక్కో సీన్ ఒక్కో రౌధ్ర రసమే..... చలపతిరావ్ చెన్న కేశవ రెడ్డి లో బలక్రిష్ణ తో పొందూరు కద్దర్ అన్నా యెయ్ అంతాడు..... ఆయనకి ప్రతీ సినిమాలో ఒక పంచ్ డైలాగ్ వున్నట్లే ఈ సినిమాలో కూడా ఒక డైలాగ్ వుంది గుండెల మీద చేతులేసుకుని తీసుకెళ్ళండీ, ఇక మీ మీద ఈగ కూడా వాలదు అని.... అది క్యారెక్టర్ ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళి నిలబెడుతుంది..... బాలక్రిష్ణ నాయనమ్మ కి వేసినావిడ కూడా చాలా బాగ చేసారు... ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేసారు.... ఇంక నాకు నచ్చిన ఇంకో సీన్ ఏంటీ అంటే,, ఆడవాళ్ళ గొప్పతనం గురించి చెప్తూ చెప్పే సీన్ ఎవ్వడు ఇలాంటి సీన్ ఇలాంటి డైలాగ్స్ పెట్టలేదు... వావ్ అనిపించింది.... హీరోయిన్స్ లో నాకు లెగెండ్ పక్కన చేసిన అమ్మాయ్ బాగుంది అనిపించింది,, వేరే హీరోయిన్ బక్క నక్కలా వుంది... బాలక్రిష్ణ గారు కూడ ఫస్ట్ గెటప్ లో కంటే లెజెండ్ గెటప్ లోనే బాగున్నారు.... ఆయనకి ఆ విగ్ సూట్ అయ్యింది..... ఓవర్ ఆల్ గా సినిమా ఒక హిస్టరీ,, ఇలాంటి సినిమా రావాలంటే ఇంకెన్నేళ్ళు పడుతుందో.... నేను ఈ రేంజ్ లో వుంటుందని అస్సలు అనుకోనే లేదు ఆ ఏముందిలే నరుక్కోటాలేగా అనుకుని వెళ్ళా.... నాకు నచ్చిన డైలాగ్ ''నీకు తిక్క రేగాలేమో,, నాకు ఆల్వేస్ ఆన్ లోనే వుంటుందీ' అనే డైలాగ్.... ''నాకొక బాడ్ హాబిట్ వుంది కొన్ని వినాలనుకోను చూడాలనుకోను పొరపాటున అవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్దీ'' ఈ 2 డైలాగ్స్ నాకు బాగా నచ్చాయ్. Last లో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఆ పెద్దాయన మాటలతో ఎండ్ చేయటం చాలా బాగ నచ్చింది ఒక్కటే మాట ఈ సినిమా బాలక్రిష్ణ గారు తప్ప ఎవ్వడూ చేయలేడూ,, వేరే వాళ్ళు చేసినా బాగోదు,, ఊహించుకోలేం కూడా.... ప్రతీ సీన్ డూప్ లేకుండా చేసేంత సాహసం మన తెలుగు ఇండుస్ట్రీ లో బాలక్రిష్ణ గారికి తప్ప ఏ హీరోకీ లేదు... ఎవర్ని బాధించినా ఇది నిజం...... సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, క్రిష్ణుడు విష్ణువు శక్తి సముద్రుడు కలిసాడంటే వీడు అనే సాంగ్ వినీ అబ్బా మరీ రాస్తారు అనుకున్నా,, కానీ ఆ ఎనర్జీ చూసి సూట్ అయ్యింది ఆ సాంగ్ అనిపించింది.... HATSSSOFFFFFFFFFF......... ..... rAmu(Du) manci bAluDu cinnappaTinuncI intE
|