Dobbey
Mudiripoyina Bewarse Username: Dobbey
Post Number: 19421 Registered: 12-2009 Posted From: 12.52.129.43
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, February 11, 2014 - 12:56 pm: | |
కేవలం కొడుకును మాత్రమే తన వెంట తీసుకువెళ్లి సోనియాకు పాదాభివందనం చేసిన కేసీఆర్. ఓకే బాగానే ఉంది. నీ కుమారుడి రాజకీయ భవితవ్యాన్ని తను చూస్తానని సోనియా హామీ కూడా ఇచ్చింది. డబుల్ ఓకే. మరింకేంటి ట్విస్ట్..? ఇప్పుడు చూడండి అసలు మలుపులు.. వెంటనే ఆలస్యం చేయకుండా తెరాసాను కాంగ్రెస్ లో విలీనం చేయటానికి సమ్మతిస్తూ ఢిల్లీ వేదికగా మీడియాకు వెల్లడించాలని కేసీఆర్ కు సోనియాగాంధీ స్పష్టం చేసింది. మీరు ఇంతకాలం జాప్యం చేసి ఉండాల్సింది కాదు అని కొంచెం కఠినంగా కామెంట్ చేసిందట. సోనియా నివాసం నుంచి బయటకు వచ్చాకా దిగ్విజయ్ సింగ్ కు కేసీఆర్ ఫోన్ చేసి ఈ విధంగా మీరు నాపై ఒత్తిడి తేవడం బాగోలేదని చెప్పినట్టు సమాచారం. దానికి దిగ్విజయ్ కూడా అంతే తెలివిగా బదులిచ్చినట్టు తెలిసింది. మీ గురించి మేడమ్ వద్ద పూర్తి సమాచారం ఉంది. బిల్లు ఆమోదానికి ముందే మీ నుంచి విలీన ప్రకటన రానిపక్షంలో మీరు చేయిజారిపొతారని తెలంగాణ కాంగ్రెస్ కీలకనేత మేడమ్ కు ఒక నివేదిక ఇచ్చారు. ఎవరనేది నేను చెప్పను. కానీ ఆ నివేదిక ప్రకారం.... మీరు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం కల్ల, మోడీ ప్రధాని కావడం ఖాయం అని వ్యాఖ్యానించినట్టు అధినేత్రికి తెలిసింది. రేపు ఎన్డీఏకు మన అవసరం ఉంటుంది..కనీసం కేంద్రంలో 2 కీలక బెర్తులు వస్తాయి, రాష్ట్రంలోనూ మనది కీలకపాత్ర అవుతుందని మీరు సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు మీపట్ల సందేహాలను కలిగించాయి. రాష్ట్రం విడిపోయినా..ఉమ్మడిగా ఉన్నా తెరాసకు 70 అసెంబ్లీ, 10లోక్ సభ సీట్లు బరాబర్ వస్తాయని..అలాంటప్పుడు దేశవ్యాప్తంగా మునిగిపోయే స్థితిలో ఉన్న కాంగ్రెస్ కు మద్దతిచ్చి ఏం లాభం అని మీరు అన్నారా లేదా? చెప్పండని దిగ్విజయ్ అడిగాడని తెలిసింది. మిస్టర్ కేసీఆర్ మేమేమీ మీపై వత్తిడి తేవట్లేదు. మీరు గతంలో చేసిన ప్రమాణాన్నే పాటించమని మేడం అడిగారు. మీరు మరోలా భావించవద్దని డిగ్గీరాజా ఊరడించాడని విశ్వసనీయంగా తెలిసింది. మీరు ఇప్పటికైనా త్వరగా నిర్ణయం తీసుకోండి. అంతవరకు రాజ్యాసభకూ బిల్లు రాదు. మేడమ్ విలీనం విషయంలో ఫర్మ్ గా ఉన్నారు. మీరు ఇచ్చిన మాటను నమ్మి 13జిల్లాల్లో పార్టీ నష్టం పోయింది. జగన్ పరిస్థితే అక్కడ అగమ్యగోచరంగా ఉంది. దట్ గయ్ (జగన్ ను ఉద్దేశించి) ఫుల్లీ డిజప్పాయింటెడ్. కనీసం మనం తెలంగాణలో కూడా పట్టు సాధించాలి. మేడమ్ మీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అని దిగ్విజయ్ సింగ్ తెరాస అధినేతకు గీతోపదేశం చేశాడు. మీరు ప్రెస్ మీట్ పెట్టండి తర్వాత వ్యవహారం మేం చూసుకుంటాం..ఎవరు వ్యతిరేకించినా ఇంతదాకా తేగలిగిన మేము..ఆఫ్టరాల్ బిల్లు సభలో ప్లేస్ చేయలేమా? విలీనం అయితే మీ ప్రయోజనాలు పూర్తిగా కాపాడే బాధ్యత మాది. మీ కుమార్తె ను తప్పకుండా సాంస్క్రతికరంగం నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తాం. తెలంగాణ అభివ్రుద్ధి మండలి ఛైర్మన్ హోదాలో సీఎంతో సమాన హోదా కల్పిస్తాం. మీరు ఇచ్చే జాబితాకు అనుగుణంగా పార్టీ, ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఉంటుంది. మిమ్మల్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి తీసుకోవాల్సి ఉంటుందని గతంలో ఒకసారి మేడమ్ అన్నారు కూడా. ఛాయిస్ ఈజ్ యువర్స్..మీ స్పందనను బట్టి బిల్లు పార్లమెంటుకు వస్తుంది..ఇది దిగ్గీరాజా ఢిల్లీలో కేసీఆర్ కు చేసిన హితబోధ. దాని ఫలితమే రాజ్యసభకు బిల్లు రాకుండా పిల్లిమొగ్గలు.
|