Esperanza
Celebrity Bewarse Username: Esperanza
Post Number: 25607 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 | Posted on Thursday, January 09, 2014 - 8:47 am: | |
నల్లధనాన్ని రూపుమాపే నూతన ప్రతిపాదనలపై చర్చ ఈనాడు – హైదరాబాద్ నల్లధనం, అవినీతి దేశ ఆర్థిక వ్యవస్థను దారి తప్పించి ప్రజలకు అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. ఈ రెండూ ఒకదానితో ఒకటి సహజీవనం చేస్తూ సమాజానికి పెనుభూతంలా తయారయ్యాయి. అభివృద్ధిని అట్టడుగుస్థాయికి దిగజార్చుతూ దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. ఓ వైపు ప్రభుత్వాలు పన్నుల మీద పన్నులు వేయడం వల్ల ప్రజలపై భారం పెరిగిపోతోంది. ఇలాంటి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా చీకటి నుంచి వెలుతురులోకి నడిపించే ఆయుధంగా వచ్చిన ప్రతిపాదనే ‘అర్థక్రాంతి’. నల్లధనం, అవినీతి రెండుతలల భూతాన్ని ఎదుర్కొనే ఆశయంతో మహారాష్ట్రకు చెందిన అనిల్ బోకిల్ ప్రతిపాదించిన అర్థ క్రాంతిపై శనివారం సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో సదస్సు నిర్వహించనున్నారు. ఈసదస్సు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు ప్రారంభోత్సవ ఉపన్యాసం చేస్తారు. జస్టిస్ వెంకటాచలయ్య సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. సదస్సులో ప్రస్తుత పన్నుల వ్యవస్థ స్థానంలో బ్యాంక్ లావాదేవీల పన్నును ప్రవేశపెట్టేందుకు రూపొందించిన అర్థక్రాంతి భావన స్వరూపాన్ని, దాని కీలక అంశాలను అనిల్ బోకిల్ వివరిస్తారు. సదస్సుకు హాజరైన ప్రముఖుల సందేహాలపై సమాధానాలు ఇస్తారు. అనంతరం రంజన కుమార్, ఆచార్య పి.ఎం.భార్గవ, ఆచార్య ఎస్.కె.రావు, జస్టిస్ వెంకటాచలయ్య మాట్లాడుతారు. ఈ సదస్సులో దీపక్ కరన్‌జికర్, రాజీవ్ జల్నపుర్కర్, పలువురు మేధావులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారు. కారుచీకటిలో కాంతిపుంజం ‘అర్థక్రాంతి’ హరిత విప్లవం.. క్షీర విప్లవం.. దేశ చరిత్రను మలుపు తిప్పిన గొప్ప మైలురాళ్లివి. తెల్లదొరలను పారదోలి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని పరిపూర్ణం చేసుకోవటంలో.. నిజమైన స్వావలంబన సాధించటంలో.. మన ఇంటిని మనం నిలబెట్టుకోటంలో గొప్ప ముందడుగులివి! ఫలితం మనం కోలుకున్నాం. మన కాళ్ల మీద మనం నిలబడ్డాం. కానీ ఎక్కడ నిలబడ్డవాళ్లం అక్కడే ఉండిపోతున్నాం. ప్రపంచీకరణ, సరళీకరణల వంటి పెద్దపెద్ద మంత్రాలు వల్లిస్తున్నా.. తలసరి ఆదాయాలు పెరుగుతున్నా.. దేశం ఆర్థికంగా ఎక్కడున్నది అక్కడే ఉండిపోతోంది. ఇప్పుడు అడుగు ముందుకు పడాలంటే మరో విప్లవం అనివార్యం. మన ప్రతి అడుగుకూ పేదరికం, నల్లధనం, అవినీతి వంటి జాడ్యాలు అడ్డుపడుతున్నాయి. వీటి నుంచి విముక్తి లభించాలంటే మన వ్యవస్థలో ఒక పెను మార్పు.. మరో మౌలిక విప్లవం అనివార్యం. ఇటువంటి మార్పుకు బీజం వేస్తున్నదే ‘అర్థక్రాంతి’. దేశ ఆర్థిక రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసే ఈ వినూత్న ఆలోచన మహారాష్ట్రకు చెందిన అనిల్ బోకిల్‌ది. వృత్తిరీత్యా ఇంజినీరు అయిన ఆయన ఈ విప్లవం కోసం కొంతకాలంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఆర్థిక రంగానికి తూట్లు పొడుస్తున్న నల్లధనం, పన్ను ఎగవేత వంటి నానా వంకర ధోరణులనూ, వక్రమార్గాలనూ సరిచేస్తూ.. ఖజానాను పరిపుష్ఠం చేసేందుకు ఈ వినూత్న విధానాన్ని ముందుకు తెచ్చారు. దీన్ని రాష్ట్రపతి, ప్రధాని, చట్టసభల సభ్యుల నుంచి రాజకీయ నాయకులు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగ ప్రముఖులందరి ముందూ ఉంచుతున్నారు. ఈ మౌలిక విప్లవానికి ప్రజల మద్దతు కూడగట్టటంలో భాగంగా నేడు ‘రామోజీ ఫిల్మ్ సిటీ’లో భిన్నరంగాలకు చెందిన ప్రముఖులందరితోనూ ప్రత్యేకంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ఆర్థిక రంగాన్ని పట్టిపీడిస్తున్న గ్రహచారాలన్నీ వదిలిపోయి.. దేశ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి ఇటువంటి మౌలికమైన మార్పు దోహదం చేస్తుందని బలంగా విశ్వసిస్తున్నారు. దేనికోసం ఈ అర్థక్రాంతి? దేశం సమస్యల గొలుసులో చిక్కుకుపోయింది. దేశాన్ని పీడిస్తున్న నిరక్షరాస్యత, బాలకార్మిక వ్యవస్థ వంటి వాటిని నిర్మూలించాలని ప్రయత్నిస్తుంటే పేదరికం మన కాళ్లకు అడ్డం పడుతుంటుంది. పేదరికాన్ని నిర్మూలించే పని చేద్దామంటే అవినీతి, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవటం అడ్డుతగులుతుంటాయి. వీటిపై పోరాడదామంటే పరిపాలనా లోపాలు, నల్లధనం వంటివి ప్రతిబంధకాలుగా మారుతుంటాయి. ఇదో విషవలయం. ఇవన్నీ ఒకదానితో ఒకటి గాఢంగా పెనవేసుకుపోయిన సామాజిక, ఆర్థిక సమస్యలు! ప్రధాన ఆర్థిక రంగంతో పాటు చీకటి సామ్రాజ్యంగా వేళ్లూనుకుపోయిన సమాంతర ఆర్థిక వ్యవస్థ ఈ జాడ్యాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అందుకే నల్లధనానికి ఆస్కారమివ్వని తీరులో.. పన్ను విధానాన్ని విప్లవపథంలో నడిపించాలని ప్రతిపాదిస్తోంది అర్థ్‌క్రాంతి. నిజం చెప్పాలంటే ఇదో చిన్న సాంకేతికమైన దిద్దుబాటు. కానీ ఈ చిన్నదిద్దుబాటే చీకటి ద్వారాలను ఛేదిస్తూ పెను మార్పునకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. space for lease
|