Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 19754 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Tuesday, November 19, 2013 - 2:23 am: | |
candle holding exibhitionism batchey news: చికాగో: ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజంలో పురుషాధిక్యత అధికమైపోయిందని అనుకుంటున్నాం. ఈ తరుణంలో జంతువులు కూడా తమ మధ్య పురుషాధిక్యతను ప్రదర్శించుకుంటున్నాయి. నిజమేనా అంటే నిజమే అంటుంది, అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ జూ జరిగిన వాస్తవ సంఘటన. ఆ జూలో మగ సింహం ఆడ సింహాన్ని కొట్టి చంపింది. అనంతరం ఆడ సింహన్ని తినేసింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. ప్రపంచ పురుషుల దినోత్సవం నేడు.అంటే రెండు రోజుల ముందు ఆ ఘటన చోటు చేసుకుంది. జూలో మగ సింహం ఆడ సింహాన్ని తన పంజాతో కొట్టి చంపింది. ఆ పంజా తగిలిన కొద్ది సేపటికే ఆడ సింహం జోహరి మృతి చెందింది. ఆ సంఘటనపై జూ అధికారులు శంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. తన 35 ఏళ్లుగా జూలో విధులు నిర్వర్తిస్తున్నానని అయితే మగ సింహం ఆడ సింహాన్ని ఇలా కొట్టి చంపడం ఇదే తొలిసారిగా చూస్తున్నానని డల్లాస్ జూలో జంతువుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు వెనీ క్రమర్ వెల్లడించారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు మగ సింహలు, మూడు ఆడ సింహాలు ఎన్నో ఏళ్లుగా కలసి మెలసి జీవిస్తున్నాయని ఆయన తెలిపారు. అయితే ఏ రోజున అవి ఘర్షణ పడినట్లు తాను చూడలేదని చెప్పారు. అయితే మగ సింహం ఆడ సింహాన్ని కొట్టి చంపడంతో తాను షాక్కు గురయ్యానట్లు జూలో జంతువులను చూసేందుకు వచ్చిన మైఖేల్ హెన్స్షా తెలిపారు. కాగా ఇరు సింహాల మధ్య ఘర్షణ ఎందుకు చోటు చేసుకుందనేది తమకు అంతుబట్టని అంశంగా మారిందని జూ అధికారులు వెల్లడించారు. ఆ సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో మగ సింహల నుంచి ఆడ సింహాలను జూలోని మరో ప్రదేశానికి తరలించినట్లు తెలిపారు. మగ సింహం తన పంజా విసిరి ఆడ సింహాన్ని చంపడంతో జూలో వచ్చే వారి సంఖ్య మరింతగా పెరిగింది. |