Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 24597 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 | Posted on Sunday, October 06, 2013 - 9:03 am: | |
నర్సీపట్నం : కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లో ఎదిగి, ఇప్పుడు రాష్ట్రానికి, కాపు కులస్తులకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కులం నుంచి వెలివేయాలని నర్సీపట్నం డివిజన్ తూర్పుకాపు సేవా సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. శనివారం నర్సీపట్నంలో తూర్పుకాపు సేవా సమితి స్థానిక సీబీఎం కాంపౌండ్ నుంచి శ్రీకన్య కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించింది. మార్గమధ్యంలో అబీద్ సెంటర్ వద్ద కొద్దిసేపు రాస్తారోకో చేశారు. అనంతరం శ్రీకన్య కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి సోనియాగాంధీ, కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తూర్పుకాపు సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ, చిరంజీవి, బొత్స సత్యనారాయణలు ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయడానికి సహకరించడం ద్వారా రాష్ట్ర ప్రజలకే కాకుండా కాపు కులస్తులకు కూడా తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. ఇద్దరూ తమ పదవులు కాపాడుకోవడానికి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, ప్రజల భవిష్యత్తును కాంగ్రెస్ అధిష్ఠానానికి తాకట్టుపెట్టారని విమర్శించారు. ఇటువంటి వారిని కులం నుంచి బహిష్కరించడమొక్కటే సరైన శిక్ష అన్నారు. మంగలి, చాకలి, పనిమనిషివంటి వారు కూడా వీరి కుటుంబాలకు సహకరించరాదని పిలుపునిచ్చారు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర భవిష్యత్తును అంధకారమయం చేసిన కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ఇక నూకలు చెల్లినట్టేనన్నారు. కాపులను అవసరానికి వాడుకుని వదిలేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. ఈ ర్యాలీలో జడ్‌పీటీసీ మాజీ సభ్యుడు అధికార బలరామమూర్తి, మీసాల సత్యనారాయణ, కొట్ని రామస్వామినాయుడు, ఏవీ రమణయ్య, పీలా వెంకటలక్ష్మి, ఎం.సుబ్బన్నలు ప్రసంగించారు. ఈ ఆందోళనలో గొలుసు నర్సింహమూర్తి, అధికార కన్నారావు, మోపాడ ప్రకాష్, కోనేటి రామకృష్ణ, కొల్లాన నాని, సుంకర కృష్ణ, కాపు కులానికి చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. space for lease
|