Blazewada
Mudiripoyina Bewarse Username: Blazewada
Post Number: 18938 Registered: 08-2008 Posted From: 111.223.89.209
Rating: N/A Votes: 0 | Posted on Wednesday, October 02, 2013 - 3:17 am: | |
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. నేరచరిత ప్రజాప్రతినిధులకు సంబంధించి కేంద్రం ఆమోదించిన ఆర్డినెన్స్‌పై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ప్రధానికి రాహుల్ వివరణ ఇచ్చినట్టు తెలిసింది. తాను ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశానో చెప్పినట్టు సమాచారం. సెవెన్ రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసానికి వెళ్లిన రాహుల్ అరగంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. ఆర్డినెన్స్‌ను చించి పారేయాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై మన్మోహన్ నొచ్చుకున్నారనే వార్తల నేపథ్యంలో రాహుల్... ప్రధానికి వివరణ ఇచ్చారు. మరోవైపు ప్రధాని మన్మోహన్ సింగ్ కాసేట్లో రాష్ట్రపతిని కలవనున్నారు. ఆర్డినెన్స్‌ను సంహరించాలని రాష్ట్రపతిని ఆయన కోరనున్నారు. ఈ ఉదయం సమావేశమయిన కాంగ్రెస్ కోర్ కమిటీ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని నిర్ణయించింది. దీంతో రాహుల్ మాట నెగ్గినట్టయింది. |