Esperanza
Mudiripoyina Bewarse Username: Esperanza
Post Number: 23680 Registered: 08-2004 Posted From: 88.114.31.209
Rating: N/A Votes: 0 | Posted on Thursday, July 11, 2013 - 11:52 am: | |
హైదరాబాద్ లేని తెలంగాణావైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు అంటూ సీఎన్ఎన్-ఐబీఎన్ కథనాలు న్యూ ఢిల్లీ, జూలై 11 : హైదరాబాద్ లేకుండా తెలంగాణను విభజించడానికే కాంగ్రెస్ కోర్ కమిటీ మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తున్నదని సీఎన్ఎన్-ఐబీఎన్ గురువారం సాయంత్రం ఒక కథనాన్ని ప్రసారం చేసింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం, లేదా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం వంటి అంశాలు కూడా కాంగ్రెస్ పరిశీలిస్తున్నదని ఈ కథనంలో వివరించారు. తెలంగాణా సమస్యను కాంగ్రెస్ ఎలా పరిష్కరించేదీ ప్రస్తుతానికి ఎవరూ గట్టిగా చెప్పలేకపోతున్నా, ఇరు వర్గాలనుంచీ గట్టిగా ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కోర్ కమిటీ శుక్రవారంనాడు సమావేశమైన అనంతరం ఎటువంటి ప్రకటనా చేయకపోవచ్చునని తెలుస్తున్నది. తెలంగాణావాదులు కోరుతున్నట్టుగా తెలంగాణాను ఇచ్చేస్తే తదనంతరం శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చునని హోం మంత్రి షిండే, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలను ఒకప్పుడు చూసిన గులాం న బీ ఆజాద్ ఆందోళన చెందుతున్నట్టు సీఎన్ఎన్ తమ కథనంలో పేర్కొంది. నక్సలైట్ సమస్య పెరగవచ్చునన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నట్టు ఈ కథనం వివరించింది. ఒకవేళ తెలంగాణ ఇవ్వడానికి కోర్ కమిటీ సానుకూలత వ్యక్తం చేసి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఈ మేరకు తీర్మానం చేయమని కోరుతుందా, లేక దిగ్విజయ్ సింగ్ గురువారం పీటీఐ వార్తాసంస్థకు చెప్పినట్టు ఒకవేళ విభజనకు రాజ్యాంగ సవరణ అవసరమే అయ్యే పక్షంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న అంశంపై కూడా సీఎన్ఎన్ మరో కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనం ప్రకారం ఆగస్టు మూడవ వారం వరకూ పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు వాయిదా పడవచ్చున న్నది ఆ కథనం సారాంశం. space for lease
|