Kingchoudary
Bewarse Legend Username: Kingchoudary
Post Number: 80417 Registered: 03-2004 Posted From: 130.138.227.10
Rating: N/A Votes: 0 | Posted on Monday, November 26, 2012 - 5:46 am: | |
జగన్ ఫాలోయర్స్ జఫాలే తెలంగాణ పాలిట బాణామతి.. షర్మిల జైల్లో పడ్డ కొడుకు కోసం ఓట్లడుక్కునే సంస్కృతి కాదు మాది: దేశపతి శ్రీనివాస్ సూర్యాపేట సభలో రచయిత దేశపతి శ్రీనివాస్ తన మాటలతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. సభలో ఆయన ప్రతి ఒక్కరిపై మాటల తూటాలను పేల్చారు. పాటలు, కథల రూపంలో, వ్యంగం.. హాస్యంతో నేతలను విమర్శిస్తూ.. సభకు హాజరైన వారిని ఉత్సాహపరిచారు. ఆయన మాటల్లోనే.. - నా కొడుకు జైల్లో పడ్డాడు. నా దుఃఖం చూడండంటూ వస్తోంది విజయమ్మ. అమ్మా చూడండి. కొడుకును కొంగున కట్టుకుని వీపునకు చుట్టుకుని యుద్ధం చేసిన ఆరుట్ల కమలమ్మల సంస్కృతి తెలంగాణది. గానీ, జైల్లో పడ్డ కొడుకు కోసం ఓట్లు అడుక్కునే విజయమ్మల సంస్కృతి కాదు మాది. - విజయమ్మను చూస్తే నాకొకటి గుర్తుకొస్తోంది. 'కరుణామయుడు' సినిమాలో క్రీస్తును శిలువ వేస్తే.. ఆ శిలువను మోసుకుని పోతూ ఉంటాడు. ఆయన వెంట నడిచే ప్రజలందరూ.. అయ్యో దైవస్వరూపుడైన ఆయనకెంత కష్టమంటూ ఏడుస్తుంటారు. అప్పుడు ఏసు 'నాకోసం ఏడ్వకండి. మీకోసం, మీ పిల్లల కోసం ఏడ్వండి' అంటాడు. కానీ, విజయమ్మ.. 'నా కోసం, లక్షకోట్లు దిగమింగి జైల్లో కూర్చుని అధికారం కోసం పావులు కదుపుతున్న జగన్ కోసం ఏడ్వండి' అని చెబుతోంది. - జగన్ జైల్లోకి పోతూ.. దేశం కోసం ఏదో చేసినట్లు రెండు వేళ్లూ చూపించాడు. అదేంటో నాకర్థం కాలేదు. ఇదే విషయాన్ని ఓ రాయలసీమ పెద్ద మనిషిని అడిగా? ఆయన చెప్పిందేమంటే.. 'తిన్నది లక్షకోట్లు కాదు. రెండు లక్షల కోట్లు తిన్నానని జగన్ చెబుతున్నాడు' అని. - మొన్న సూర్యాపేటకు వచ్చాను. ఇక్కడొకాయన వైసీపీలో చేరాడంటే.. ఆయనను తూర్పారబడదామని వచ్చాను. అప్పుడో పిల్లాడు 'ఆయన గురించి ఏం మాట్లాడతావు. ఆయనొక జఫా అని అన్నాడు. జఫా అంటే జగన్ ఫాలోయర్స్ అని ఆ పిల్లోడే చెప్పాడు. ఇప్పటి నుంచి జగన్ పార్టీలో చేరినవారందరినీ మనం ఏమని పిలవాలి..? జఫా అని. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ చెప్పాలి. - నేను జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిల చెబుతోంది. నీవు బాణానివి కాదు. సీమాంధ్ర నాయకులు చేతబడి చేసిన బాణామతివి నీవు మాకు. మా పాలిట చేతబడివి. - రెండు లక్షల కోట్ల రూపాయలు వెనుకేసుకుని.. మనకు రూ.200 పింఛను ఇస్తే.. అబ్బో అంటూ సంబుర పడుతున్నాం. మొన్న ఒకాయన ఒక కథ చెప్పాడు. హైదరాబాద్ అతను సూర్యాపేటకు బయల్దేరాడు. జేబులో రూ.1000 ఉన్నాయి. బస్టాండ్లో ఒక ఆంధ్రాయన పరిచయం అయ్యాడు. మాటల్లోకి దింపి తెలంగాణ ఆయన జేబులో రూ.1000 కొట్టేశాడు. తీరా బస్సెక్కి జేబు చూసుకునే సరికే పైసలు లేవు. అయ్యో ఇప్పడెలా అని బాధపడడం మొదలెట్టాడు. అప్పుడు.. అంతకు ముందు పైసలు కొట్టేసిన ఆంధ్ర అతను వచ్చి రూ.200 సాయం చేశాడు. నువ్వు దేవుడివి.. నీది దేవుడి రాజ్యం.. అని తెలంగాణ అతను దండం పెట్టాడు. నీ వల్లే సూర్యాపేటకు పోతున్నా.. నా కొడుకుకు బిడ్డ పుడితే నీ పేరే పెట్టుకుంటా అన్నాడు. ఇంతకీ ఆ జేబు కొట్టింది.. ఎవరు? అంటూ దేశపతి ప్రశ్నించారు .... |