Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through December 18, 2011 * SVR < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 3406
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:57 am:    Edit Post Delete Post View Post/Check IP


Sachinfan:


nijaneki, chiken nu assalu patichu koru sasin annay, maa daggara chiken pizza anteene thella mokamesukuni choostharu, adhokati vuntadha ani...CLIPART--biggrin
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 3405
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:56 am:    Edit Post Delete Post View Post/Check IP


Sachinfan:


eey, salami sufer vutnadhi nijamga, try seyy( US loo peproni antaru anukunta)...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Celebrity Bewarse
Username: Sachinfan

Post Number: 27598
Registered: 10-2010
Posted From: 96.231.164.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:53 am:    Edit Post Delete Post View Post/Check IP


Seefeld:


nenu kodi tappa inkoti tinanu ga.. migatha vati gurinchi naku telavadu.. chicken marshala emantha goppa dish kadu daada..nenu voorke gillanu anthe..CLIPART--a140
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Celebrity Bewarse
Username: Naaistam

Post Number: 36728
Registered: 07-2005
Posted From: 116.202.104.191

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:50 am:    Edit Post Delete Post View Post/Check IP

naa fav gongura mutton mestini in srikanya restaurent
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 3404
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:49 am:    Edit Post Delete Post View Post/Check IP


Sachinfan:

manchi restaurant ki ellinattu leru ite


kaadhu, machi vaatike country places looki velli orginal ham(with out chemicals, kg 500eur avuddata kontee)attanti dishes thinti...nijamga neeu cheppinavi akunda veerevi dhekaru italy lo...posh restarent ku pothe nuvvu sppinaveanna mixilu dorakachu...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Celebrity Bewarse
Username: Sachinfan

Post Number: 27597
Registered: 10-2010
Posted From: 96.231.164.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:47 am:    Edit Post Delete Post View Post/Check IP

manchi restaurant ki ellinattu leru ite CLIPART--a140
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 3403
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:47 am:    Edit Post Delete Post View Post/Check IP


Sachinfan:


itantivi italy loo dorkav, ittanti bokodia mixi lu pattichkoor. Italy lo dorikevi pastas,lasagnias manchi quality ham and salamis , cheeses...MOVIEART--bemmi.sarle
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Celebrity Bewarse
Username: Sachinfan

Post Number: 27593
Registered: 10-2010
Posted From: 96.231.164.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:44 am:    Edit Post Delete Post View Post/Check IP

http://www.olivegarden.com/menu/dinner/Chicken-Marsala/522880-1651/
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Celebrity Bewarse
Username: Sachinfan

Post Number: 27592
Registered: 10-2010
Posted From: 96.231.164.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:43 am:    Edit Post Delete Post View Post/Check IP

italy paruvu teesesav kada daada..CLIPART--asdf
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 3402
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:43 am:    Edit Post Delete Post View Post/Check IP


Sachinfan:


maarshaala antee...mashala squre,cuve...eetiMOVIEART--avataram
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Celebrity Bewarse
Username: Sachinfan

Post Number: 27590
Registered: 10-2010
Posted From: 96.231.164.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:42 am:    Edit Post Delete Post View Post/Check IP

rendu pizza mukkalu.. chicken maarshaala..olive garden nunchi...MOVIEART--eat
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 3401
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:41 am:    Edit Post Delete Post View Post/Check IP


Sachinfan:


lite ga sunil gani lekka oo rendu idlily thagginchava...MOVIEART--bemmi.aggipulla
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Celebrity Bewarse
Username: Sachinfan

Post Number: 27587
Registered: 10-2010
Posted From: 96.231.164.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:39 am:    Edit Post Delete Post View Post/Check IP

adem ledu... ipati daka pani sesi dobbichukunna.. ipuud aakalestante ala ala lisght ga..CLIPART--biggrin
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 3400
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:38 am:    Edit Post Delete Post View Post/Check IP

sunday kabatti thaggichavaMOVIEART--bemmi.angry
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Celebrity Bewarse
Username: Sachinfan

Post Number: 27585
Registered: 10-2010
Posted From: 96.231.164.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:37 am:    Edit Post Delete Post View Post/Check IP

anni screenlu ettukunte fuselu egiripotai emo daada..CLIPART--a140
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 3399
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:34 am:    Edit Post Delete Post View Post/Check IP


Sachinfan:


eeti 5th screen aa...MOVIEART--lakalaka
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Celebrity Bewarse
Username: Sachinfan

Post Number: 27583
Registered: 10-2010
Posted From: 96.231.164.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:32 am:    Edit Post Delete Post View Post/Check IP


Seefeld:


daaada..MOVIEART--banthi
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 3398
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 3:31 am:    Edit Post Delete Post View Post/Check IP

CLIPART--band2
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Celebrity Bewarse
Username: Naaistam

Post Number: 36702
Registered: 07-2005
Posted From: 116.202.104.191

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 12:51 am:    Edit Post Delete Post View Post/Check IP

antha chadavataniki chaala kastapadalsi vachindi....nice article :-)

SVR MOVIEART--bemmi.dance
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fedex
Yavvanam Kaatesina Bewarse
Username: Fedex

Post Number: 6040
Registered: 01-2010
Posted From: 72.223.76.171

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 12:48 am:    Edit Post Delete Post View Post/Check IP


Shawarma:

keema koora vandutunna




na pavourite...njoy seyyi. nest week set seyyali nen bhi :-)
Most people vote against somebody rather than for somebody.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Shawarma
Pilla Bewarse
Username: Shawarma

Post Number: 421
Registered: 12-2011
Posted From: 183.82.191.175

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 12:38 am:    Edit Post Delete Post View Post/Check IP


Fedex:

emi naidu gaaru,,,,enti sangathulu?




keema koora vandutunna MOVIEART--bemmi6
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fedex
Yavvanam Kaatesina Bewarse
Username: Fedex

Post Number: 6039
Registered: 01-2010
Posted From: 72.223.76.171

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 12:34 am:    Edit Post Delete Post View Post/Check IP


Shawarma:

reddy garu




emi naidu gaaru,,,,enti sangathulu?
Most people vote against somebody rather than for somebody.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fedex
Yavvanam Kaatesina Bewarse
Username: Fedex

Post Number: 6038
Registered: 01-2010
Posted From: 72.223.76.171

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 12:34 am:    Edit Post Delete Post View Post/Check IP


Musicfan:

ledu, eppudu standing ae, no sitting




ohh no drinking aaa?? fultu shariff annattu :-)
Most people vote against somebody rather than for somebody.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fedex
Yavvanam Kaatesina Bewarse
Username: Fedex

Post Number: 6037
Registered: 01-2010
Posted From: 72.223.76.171

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 12:32 am:    Edit Post Delete Post View Post/Check IP


Sachinfan:




ni files nalugu sarlu download sette kaani HJSplit join avvaledhu. sivaraakhariki join ayyaka ippudu zip file unzip avvatledhiii :-(:-(:-(
Most people vote against somebody rather than for somebody.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 38514
Registered: 05-2004
Posted From: 68.42.138.62

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 12:26 am:    Edit Post Delete Post View Post/Check IP


Fedex:

weekend sitting gaani esara?




ledu, eppudu standing ae, no sitting

inadke oka b'day party ki velli vacham, nidra vachenta varaku browing,
nair baddi center
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sachinfan
Celebrity Bewarse
Username: Sachinfan

Post Number: 27580
Registered: 10-2010
Posted From: 96.231.164.32

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 12:24 am:    Edit Post Delete Post View Post/Check IP

Piggu gaaru... MOVIEART--bwalk
gaali puraanam...sollu ki ankitham CLIPART--smoke
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Shawarma
Pilla Bewarse
Username: Shawarma

Post Number: 419
Registered: 12-2011
Posted From: 183.82.191.175

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 12:22 am:    Edit Post Delete Post View Post/Check IP


Fedex:




reddy garu MOVIEART--bemmi.etakaram
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fedex
Yavvanam Kaatesina Bewarse
Username: Fedex

Post Number: 6036
Registered: 01-2010
Posted From: 72.223.76.171

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, December 18, 2011 - 12:20 am:    Edit Post Delete Post View Post/Check IP


Musicfan:




Rao garu, enti inka,,,weekend sitting gaani esara?
Most people vote against somebody rather than for somebody.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Musicfan
Celebrity Bewarse
Username: Musicfan

Post Number: 38513
Registered: 05-2004
Posted From: 68.42.138.62

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, December 17, 2011 - 11:48 pm:    Edit Post Delete Post View Post/Check IP


Fanno1:




nice article fanno1 mama.
nair baddi center
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Ravanabrahma
Mudiripoyina Bewarse
Username: Ravanabrahma

Post Number: 18362
Registered: 06-2004
Posted From: 98.151.191.253

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, December 17, 2011 - 4:40 pm:    Edit Post Delete Post View Post/Check IP

bagindiba article :-)
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 6018
Registered: 03-2004
Posted From: 24.163.58.247

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, December 17, 2011 - 4:21 pm:    Edit Post Delete Post View Post/Check IP

మీసం మెలేసి, కనుబొమలు ముడేస్తే యస్వీఆర్ ముందు అంతా బలాదూర్.
భోజరాజు... రాజరాజు... ఏ వేషం కట్టినా యశస్వీయార్ అనే కితాబు ష్యూర్.
‘బానిసలకింత అహంకారమా’ అంటూ ఈసడిస్తే ఆ నటనకు అంతా బానిసలు.
కౌరవులను కట్టగట్టి చుట్టబెట్టకున్న నా ప్రతిభ ఏల...
అంటే హైహై నాయకా అంటూ జయజయధ్వానాలు.
ఆ యశస్వీరంగారావు జీవితచరిత్రే ఈవారం బయోగ్రఫీ.


అగ్గిపెట్టుందా?
ఉంది.
ఉంటే సరిపోదు. సిగరెట్ ఉండాలి.
ఉంది.
ఏది పడితే అది సిగరెట్ ఐపోదు. బర్కిలీ ఉండాలి.
బర్కిలీనా?! బర్కిలీలో ఏముంది?
ఉన్నదంతా అందులోనే! ఉన్నవారంతా అందులోనే.
ఏముంది? ఎవరెవరు ఉన్నారు?
దమ్ముంది. ధీమా ఉంది. డోంట్ కేర్ ఉంది. కంసుడు, కీచకుడు, రావణుడు, దుర్యోధనుడు, నరకాసురుడు... ఇంకా... సున్నం రంగడు ఉన్నాడు.
దమ్ము, ధీమా సరే! ఈ కంసుడు, కీచకుడు అండ్ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చారు?
ఎక్కడి నుండో రారు. నోట్లో బర్కిలీ పెట్టుకోచాలు. రింగరింగ రింగరింగ రింగ రింగారే అంటూ పుట్టుకొచ్చేస్తారు.
రియల్లీ! ఏమిటి గ్యారెంటీ?
సిగరెట్లకీ, యస్వీరంగారావుకీ గ్యారెంటీలు, వారెంటీలు, ఎక్స్‌పైరీ డేట్‌లు ఉంటాయా?
యస్వీరంగారావా?! మధ్యలో ఆయన ఎందుకు వచ్చారు?
ఎందుకంటే - యస్వీఆర్ లేకుండా మనకు కంసుడు లేడు. కీచకుడు లేడు....
ఆగాగు... గుర్తొచ్చింది..... బర్కిలీ సిగరెట్ కూడా లేదు! అవునా?!

********

చలనచిత్రరంగపు ఎన్నిక - బర్కిలీ!
విశ్వనట చక్రవర్తి యస్వీరంగారావు మాంచి స్వింగ్‌లో ఉన్నప్పుడు, రింగులు రింగులుగా సినిమా రీళ్లను వదులుతున్నప్పుడు... పత్రికల్లో వచ్చిన కమర్షియల్ యాడ్ ఇది!
‘‘బర్క్‌లీ త్రాగడం నాకు మహదానందదాయకం. దానిలో ఉండే పొగాకు కమ్మని రుచి కలిగి, సాఫీగా ధారాళమైన పొగ వస్తుంది’’ - యస్వీఆర్!
ప్రకటన కింద ఆయన ఫొటో ఉంటుంది. భుజం మీద షాల్, నల్లటి కళ్లద్దాలు, నోట్లో సిగరెట్. ఏమి రాజసం!
‘కమ్మని రుచి, ధారాళమైన పొగ’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రకటన పూర్తవుతుంది.
పొగ తాగుతున్నది (తాగుతున్నట్లు కనిపిస్తున్నది) యస్వీఆర్ ఒక్కడే కదా! టోటల్‌గా చలనచిత్రరంగపు ఎన్నిక అంటారేమిటి సిగరెట్ కంపెనీవాళ్లు.
సింపుల్ ఆన్సర్. అప్పట్లో చలనచిత్ర రంగం అంటే యస్వీరంగారావే! హోల్ మొత్తం ఆయనే. హీరోలకు లేని క్రేజ్, ఇమేజ్ ఆయనకు ఉండేవి. ఆయన లేని సినిమా... ప్రయారిటీలో ఓ పక్కన పడి ఉండేది. అందుకే బర్క్‌లీ ఆయన వెంట పడింది. ఆనాటి యూత్‌కి జర్క్‌లిచ్చింది.
కుర్రకుంకల సంగతి తెలిసిందే! ఏఎన్నార్‌లా ఇన్‌షర్ట్ చేసుకుని, నెక్ దగ్గర బటన్ పెట్టుకుని బుద్ధిమంతుడిలా కనిపించడంలో వారికి కిక్ ఉండదు. కత్తులరత్తయ్యలానో, రౌడీ రంగడిలానో రెండు తిట్టి, నాలుగు పొడిపించుకోవాలి. అప్పుడే మజా!
యస్వీఆర్ తెలుగుతెరపై పెద్ద అడిక్షన్. అందుకే ఈ స్టోరీ ఇలా దట్టంగా, ధారాళంగా బిగిన్ అయింది!

********

నిజానికి సామర్ల వెంకట రంగారావు (యస్వీఆర్) బయోగ్రఫీని గంగారత్నమ్మ ఒడిలోంచి ప్రారంభించాలి. అక్కడ కాదు అనుకుంటే బడిలోంచి మొదలుపెట్టాలి. ఒడి, బడి... రెండూ ఉన్నది మద్రాసులోనే కాబట్టి, ముందుముందు కథ... వెనకా ముందూ అవుతున్నప్పుడు అటువైపు వెళ్లొచ్చు. ముందైతే - ఏలూరుకి, జెంషెడ్‌పూర్‌కి వెళ్లాలి. ‘యంగ్ రంగడు’ వేషాల కోసం మీసాలు తడుముకున్న రంగస్థలాలవి.

ఉంటున్నది మద్రాసులో కదా. యస్వీఆర్‌కి ఏలూరులో ఏం పని? ఏలూరుకు ముందు.. యస్వీఆర్ ఆ బెల్టులో ఊళ్లనీ చదివేశాడు! మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి. అయ్యాక ఇంటర్ కోసం వైజాగ్ వెళ్లాడు. డిగ్రీ కోసం కాకినాడ వెళ్లాడు. చుట్టాలకు ఆశ్చర్యం! మద్రాసులో నాయనమ్మ దగ్గర ఉన్నప్పుడు అక్షరం మెతుకును ముట్టనివాడు ఇప్పుడేమిటీ పుస్తకాలను పురుగులా తినేస్తున్నాడని!! ఇంటర్‌లో మిసెస్ ఎ.వి.యన్. కాలేజీలో మొత్తం నలభై ఐదుమంది పరీక్షకు అటెండ్ అయితే, పాసయింది యస్వీఆర్ ఒక్కడే. అది రెండో ఆశ్చర్యం. బంధుమిత్రులు, సన్నిహితులు సకుటుంబ సమేతంగా ఇంత ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడానికి కారణం... యస్వీఆర్ ఎప్పటికైనా మధ్యలోనే పుస్తకాలు మూసి, నాటకాల ట్రూపుల్లో కలిసిపోతాడని అనుకోవడం! ఆ అనుకోవడానికి చిన్న బ్యాక్‌గ్రౌండ్ ఉంది.

మద్రాసు హిందూ స్కూల్లో... ఫస్ట్ టైమ్ స్టేజీ ఎక్కాడు యస్వీఆర్. వయసు పదిహేను. వేసింది చిన్న వేషం. మాంత్రికుడి అసిస్టెంట్ క్యారెక్టర్. షో అయ్యాక హెడ్‌మాస్టర్ వచ్చి ‘‘ఒరే రంగా... నువ్వు నువ్వేరా’’ అన్నారు. ఫ్రెండ్స్ వచ్చి మెచ్చుకోళ్లతో పిడిగుద్దులు గుద్దారు. యస్వీఆర్‌కు మతిపోయింది. ఈ మాత్రానికేనా! అనుకున్నాడు. పెద్ద పాత్ర వేస్తే, ఇంకా బాగా చేస్తే! అదీ మొదలు. స్కూల్లో నాటకం పడిందంటే ఈ మూలో, ఆ మూలో యస్వీఆర్ నటన పండిందనే. స్టేజి దిగి రాగానే అంతా వచ్చి చుట్టూ పోగయ్యేవారు. అప్పుడర్థమయింది యస్వీఆర్‌కి... తను వెళ్లవలసిన దారేదో!

అప్పటికే ఆ దారిలో ఉద్దండులు ఉన్నారు. బళ్లారి రాఘవాచార్యులు, స్థానం నరసింహారావు, పారుపల్లి సుబ్బారావు, డి.వి.సుబ్బారావు, డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు! వారిని ఫాలో అవుతున్న పిండాలూ ఉన్నాయి. యస్వీఆర్‌ది ఇంకా అండ దశే. ఓసారి ఊళ్లో ఆంధ్రనాటక కళాపరిషత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్లి ఉద్దండుల యాక్షన్ చూసి, ఆ యాక్షన్‌కు వచ్చిన చప్పట్ల రియాక్షన్ చూసి - ఆ రాత్రి నిద్రపోలేదు యస్వీఆర్. తర్వాత కొన్ని రోజుల వరకూ నిద్రపోదలచుకోలేదు. స్టేజి ఆర్టిస్టయి జనాన్ని మెప్పించాలని కలలు గన్నాడు.

కలల్ని నిజం చేసేందుకు ఇంట్లో ఆల్రెడీ అలాంటి కలల్నే నిజం చేసుకున్నవారెవరైనా ఉండిఉంటే పెద్దగా కష్టపడే పని ఉండదు. వాళ్లే మనకోసం కలల్ని కని, వాటిని పొదిగి, ప్రాణం పోసి పెడతారు. ఈ అదృష్టం చాలామందికి ఉండదు. యస్వీఆర్‌కీ లేదు. కానీ అతడిప్పుడు తక్షణం చెయ్యవలసిన పని... కలలు కనడం ఆపి కాలేజీకి వెళ్లడం! వెళ్తున్నాడు కానీ నాటకాలు చూస్తున్నాడు. వెళ్తున్నాడు కానీ ఇంగ్లీషు సినిమాలు చూస్తున్నాడు. తను చూసిన మొదటి సినిమాలు యస్వీఆర్‌కు బాగా గుర్తు. తెలుగులో లవకుశ, హిందీలో అఛూత్‌కన్య, తమిళంలో అంబికాపతి. ఏ నటుడినీ, ఏ థియేటర్‌నీ, ఏ భాషనూ వదిలిపెట్టలేదు యస్వీఆర్. హిందీలో శాంతారామ్, బెంగాలీలో దేవకీబోస్ ఆ వయసుకు అతడికి నచ్చిన డెరైక్టర్లు.

********

యస్వీఆర్ చదువు గురించి అందరికన్నా ఎక్కువ బెంగపడింది నాయనమ్మ గంగారత్నమ్మ! తన ఒడిలో పెంకు విడిచిన పసిగుడ్డు ఏ డాక్టరో, ఇంజినీరో అయితే చూసి మురిపెం తీరా మెటికలు విరుచుకోవాలని ఆమె ఆరాటం. యస్వీఆర్ జన్మనక్షత్రం అశ్విని. ఆ నక్షత్రంలో పుట్టినవారు స్వశక్తితో ఎదిగి వంశానికి పేరుప్రతిష్టలు తెస్తారని విన్న సంగతే కానీ, తన మనవడు నాటకాల ద్వారా తెచ్చే గౌరవాన్ని ఆమె కోరుకోలేదు. యస్వీఆర్ తండ్రి కోటేశ్వరనాయుడు ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్. తాత కోటయ్య నాయుడు డాక్టర్. నూజివీడు ఆసుపత్రిలో పేరున్న సర్జన్. మేనమామ బడేటి వెంకటరామయ్య పొలిటికల్ లీడర్ కమ్ లాయర్. ఇంతమంది మహామహులున్న కుటుంబం ఒక నటుడిని తమ మధ్యలోకి రానిస్తుందా? వంశాంకురాన్ని తమ చేతుల్లోంచి జారనిస్తుందా?
యస్వీఆర్ పుట్టింది నూజివీడులో. తండ్రికి ఉదయానికో బదిలీ, సాయంత్రానికో బదిలీ! ఆ బదిలీల వల్ల యస్వీఆర్ బాల్యం కూడా నూజివీడు నుంచి మద్రాసు బదిలీ అయింది. నాయనమ్మ దగ్గర సెటిల్ అయింది. కొన్నేళ్ల తర్వాత విధి ఈ నాయనమ్మను, మనవడినీ మద్రాసు నుంచి ఏలూరు బదిలీ చేసింది. రంగారావు మేనమామ (నాగరత్నమ్మ అల్లుడు) బడేటి వెంకటరామయ్య చనిపోయాక, కూతురుకు కొన్నాళ్లు తోడుగా ఉండడం కోసం మనవడిని తీసుకుని ఏలూరు చేరారు నాగరత్నమ్మ.

యస్వీఆర్ ఏలూరులో నాయనమ్మ దగ్గర కుదురుగా కూర్చున్నది తక్కువ. నాటకాల కొంగు పట్టుకుని తిరిగింది ఎక్కువ.
కాకినాడలో ‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్’ అని ఓ నాటకాల కంపెనీ ఉంది. అందులో చేరి.. ఊర్లు, టూర్లు తిరిగాడు యస్వీఆర్. అప్పటికి అతడి వయసు ఇరవై రెండు. మనిషి రివటలా ఉండేవాడు. మొహం లేతగా ఉండేది. దానికి లేనిపోని గాంభీర్యం అంటి ఉండేది. పాత్రలు దొరకాలి కదా. అందుకే ఆ పెట్టుడు క్రౌర్యాలు, కరకుదనాలు!
క్లబ్బు మెంబర్‌గా ఉన్నప్పుడు యస్వీఆర్‌కి రేలంగి పరిచయ భాగ్యం కలిగింది. అక్కడే అంజలీ దేవీ, అక్కడే బి.ఎ.సుబ్బారావు, అక్కడే ఆదినారాయణరావు ఎదురై.. నాలుగు మాటలు చెప్పారు. నటనపై ఉత్సాహం కలిగించారు. వాక్చాతుర్యం ఉంటే మనిషి ఎక్కడైనా నెగ్గుకురాగలని యస్వీఆర్ తెలుసుకున్నాడు. వేషాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఏదీ లేనప్పుడు ఏదో ఒకదానితో అడ్జెస్ట్ అయిపోవడం జీవితంలో ఒక ఫిలాసఫీ. యస్వీఆర్ ఆ ఫిలాసఫీకి తన పీకను అప్పజెప్పలేదు. చేయాలనుకున్న పాత్రనే చేశాడు. ఇష్టం లేని పాత్రను ‘చెయ్యను’అని చెప్పడం నేర్చుకున్నాడు.
కాకినాడలో ఉన్నప్పుడు యస్వీఆర్ ... ‘పీష్వా నారాయణరావు’ అనే నాటకంలో ఏరికోరి పండు ముదుసలి పాత్రను చేశాడు. రెండుపదులు దాటిన ఒక యువకుడు అరవై ఏళ్ల పాత్రను టేకప్ చెయ్యడం, మెప్పించడం అప్పుడొక వండర్! పెద్దపెద్ద వాళ్లు కీర్తించారు. మంచి భవిష్యత్తు ఉందని దీవించారు. షేక్‌స్పియర్ నాటకాల్లోని పాత్రల్నయితే ఉన్నవి ఉన్నట్లు పుస్తకాల్లోంచి, స్టేజి మీదకు దింపేసేవాడు యస్వీఆర్.
కానీ ఏం లాభం? ఇంత టాలెంట్ కూడా కుటుంబ సభ్యుల్ని మెప్పించలేకపోయింది. నాటకాలకు వారిని ఒప్పించలేకపోయింది. ఒక్కపైసా ఇప్పించలేకపోయింది!

********

బియ్యస్సీ అయ్యాక యస్వీఆర్ ముందున్న ఆప్షన్ యమ్మెస్సీ.
చదువా? నాటకాలా? చదువుతూ నాటకాలా? నాటకాలు వేస్తూ చదువా?
‘ఇవే వీ వద్దు. హాయిగా ఉద్యోగం చెయ్యండి’’ అన్నాడు చొలెనర్ అనే ఫైర్ ఆఫీసర్! ఆయన యస్వీఆర్ అభిమాని. యస్వీఆర్ నటన చూసి, విగ్రహం చూసి ఫ్లాట్ అయిన మనిషి. ఆయన వైపు ఆసక్తిగా చూశాడు యస్వీఆర్.
‘‘మీ గురించి తెలుసుకున్నాను. మీలో ఫైర్ ఉంది. ఫైర్ ఆఫీసర్‌కి కావలసినవన్నీ ఉన్నాయి. చదువు, హైట్, ఫిజిక్. మా డిపార్ట్‌మెంట్‌లో చేరడం మంచి ఐడియా. కాదంటారా?’’ అన్నాడు చొలెనర్.
ఆలోచనలో పడ్డాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ యస్వీఆర్. ఉద్యోగంలో చేరితే యమ్మెస్సీ ఉండదు. ఉద్యోగం వద్దనుకుంటే యమ్మెస్సీ ఉన్నా, సంపాదన సున్నా కావచ్చు. పైగా ఇప్పుడొస్తున్నది ప్రభుత్వ ఉద్యోగం. ఏజ్ బార్ అయ్యాక ఎంత చదువుండీ, ఫిజిక్ ఉండీ వేస్ట్. చేతిలో ఉద్యోగం ఉంటే ఎన్ని యమ్మెస్సీలైనా చదువుకోవచ్చు. ఎన్ని వేషాలైనా వెయ్యొచ్చు.
ఫైర్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లై చేశాడు యస్వీఆర్. కొన్నాళ్లకే మద్రాసు నుంచి పిలుపు. వెంటనే ట్రైనింగ్‌కి రమ్మని!
మూడు నెలల తర్వాత - యస్వీఆర్ ఫైర్ ఆఫీసర్! మొదట బందరులో పోస్టింగ్. ఆ తర్వాత విజయనగరానికి ట్రాన్స్‌ఫర్. అక్కడ నిద్రలేచాడు యస్వీఆర్ లోని నటుడు! టెన్ టు ఫైవ్ మంటల్లోంచి తనను బయటికి లాగమని హాహాకారాలు చేస్తున్నాడు ఆ నటుడు!
ఫైర్ ఆఫీసర్‌కి ఎంత పని ఉంటుంది? ఎంతసేపని ఉంటుంది? ఆఫీస్‌లో ఉండి చేసేది లేదు. రెండుమూడు నాటకాలు చేసుకునో, చూసుకునో వచ్చేందుకూ లేదు!
తపనని ఆర్పలేని ఫైరింజన్ అయిపోయింది ఉద్యోగం.
సరిగ్గా ఆ టైమ్‌లో - బయటి నుంచి మరో ఫైరింజన్ చప్పుడు వినిపించింది యస్వీఆర్‌కు! అది అతడి కోసమే వచ్చింది. అతడి లోపలి మంటల్ని ఆర్పడానికే వచ్చింది.

‘వరూధుని’ సినిమాలో ప్రవరాఖ్యుడి వేషం వెయ్యాలి. కుదురుతుందా అని కాలింగ్ బెల్!
ఎందుకు కుదరదూ అంటూ ఉద్యోగంలోంచి ధడేల్మని కిందికి దూకాడు యస్వీఆర్. వరూధిని సినిమా తీయబోతున్నది యస్వీఆర్ బంధువు రామానందం. గ్యారెంటీ ఆఫర్. వేషానికి వచ్చే రెమ్యునరేషన్ నెలకు రెండు వందల యాభై రూపాయలు. చాలు అన్నాడు. చలో సేలం అన్నాడు. షూటింగ్ సేలంలో.
మనసు హ్యాపీగా ఉంది. సొంతగూటికి చేరుకున్నట్లుగా ఉంది. ఫైర్ ఆఫీసర్ ఉద్యోగం తప్ప లోకంలో ఏ పనైనా చెయ్యగలనన్నంత దూకుడుగా ఉన్నాడు.
కానీ తను వెయ్యబోతున్న పాత్రలోనూ ఫైర్ ఉందన్న సంగతిని యస్వీఆర్ మర్చిపోయాడు! గుర్తొచ్చేసరికి హతాశుడయ్యాడు. వరూధిని ఫైర్ రాజేస్తుంటుంది. మనవాడు దానిని ఆర్పుకుంటూ ఉండాలి. అదంతా అల్లసాని పెద్దన రొమాన్స్. ఒంటిని దహించి వేసే సెల్యులాయిడ్ సెడ్యూజింగ్. మనుచరిత్రలో ముఖ్యమైన పాయింట్లు తీసుకుని దాసరి తిలకం (వరూధుని) అనే పిల్లని యస్వీఆర్ మీదకి పిడుగులా వదిలారు రామానందం!

నాటకాలలో స్త్రీ పాత్రలను కూడా పురుషులే వేస్తారు. ఇక్కడ నేరుగా ఒక స్త్రీతో కలిసి చెయ్యడానికి యస్వీఆర్ గడగడలాడాడు. చెమటలు పట్టాయి. తొలిచిత్రంతోనే ఇంత పెద్ద పరీక్షా!
షూటింగ్ పూర్తయింది. యస్వీఆర్ పరీక్ష నెగ్గాడు. సినిమా ఫట్ అంది.
‘వరూధిని’ హిట్ అయి ఉంటే హీరోగా యస్వీఆర్ ఒక వెలుగు వెలిగేవాడా? ఏమో!
ఇంతకీ వరూధినిలో దెబ్బకొట్టిందేమిటి? యస్వీఆర్ ఫేసా? హీరోగా అతడికి ఫేస్‌వాల్యూ లేదా? ‘అవును, కాదు’ అని అతడి కెరీర్ తేల్చిచెప్పలేదు. యస్వీఆర్ రెండొందలకు పైగా చిత్రాలలో నటించారు. చాలావాటిల్లో అతడు హీరో కాదు.
అయితే - హీరోగా చేయకుండా, హీరోలను బీట్ చేసేంత పేరును వెనకేసుకున్న నటుడు యస్వీరంగారావు.

********

వరూధుని యస్వీఆర్‌ను ఎంతగా ప్రయత్నించి మీదకు లాక్కుందో, ఒక్క ఫెయిల్యూర్‌తో యస్వీఆర్‌కు అంతగా దూరం జరిగారు దర్శకనిర్మాతలు.
ఆఫర్‌లు లేవు. తిన్నావా అని అడిగినవారు లేదు. ఉన్నావా అని ఒళ్లు తాకి పరామర్శించినవారు లేరు. ఆ సమయంలో... లీలావతి గనుక తన జీవితంలోకి రాకుంటే, యస్వీఆర్ పూర్తిగా నిస్పృహలోకి వెళ్లిపోయేవారు. లీలావతి ఆయన మేనమామ కూతురు. జెంషెడ్‌పూర్‌లో ఉద్యోగం రాగానే అల్లుడికి పిల్లనిచ్చారు అత్తగారు.
టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ యస్వీఆర్. బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అక్కడి ఆంధ్రా అసోసియేషన్‌కు కర్ణుడు, దుర్వాసుడు వగైరా పాత్రలు వేసిపెడుతున్నాడు.
లైఫ్ పర్వాలేదు, నాట్ బ్యాడ్ అని సర్దుకుపోతున్నాడు. అప్పుడు ఆడుకుంది విధి అతడితో అసలైన ఆట. తొలాట, రెండో ఆట, మూడో ఆట, శివరాత్రికి ఒక టిక్కెట్టు మీద ఆడే మూడు ఆటలు... అన్నీ వరసపెట్టి ఆడింది.

స్టార్ట్ ఇమీడియెట్లీ. నీ కోసం ఇక్కడ ‘పల్లెటూరి పిల్ల’ ఎదురుచూస్తోంది - ఒక మధ్యాహ్నం యస్వీఆర్‌కి ఉత్తరం. ఇమీడియెట్‌గా స్టార్ట్ కావడం ఎక్కడికంటే మద్రాస్‌కి. ఎందుకంటే ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో విలన్ వేషం వెయ్యడానికి. ఆ ఉత్తరం వేసింది డెరైక్టర్ బి.ఎ.సుబ్బారావు. మైగాడ్ మళ్లీ సినిమా ఛాన్స్! ఈసారి నిరూపించుకోవాలి అనుకోలేదు యస్వీఆర్. నిలదొక్కుకుంటే బావుండనుకున్నాడు. అప్పటికే అనేకసార్లు నిరూపించుకున్న నటుడు మరి!
ఉద్యోగానికి సెలవుపెట్టి, హోల్డ్ ఆల్ సర్దుకుని బయల్దేరాడు.
‘స్టార్ట్ ఇమీడియెట్లీ’ అని ధవళేశ్వరం నుంచి టెలిగ్రామ్! నాన్నగారు పోయారు రమ్మని!! ఉద్యోగానికి రిజైన్ చేసి, తండ్రి అంత్యక్రియలు జరిపించి, అప్పుడు మద్రాసు వెళ్లారు యస్వీఆర్.
బ్యాడ్ లక్. పల్లెటూరి పిల్లను మరో విలన్ ఎ.వి. సుబ్బారావు ఎగరేసుకుపోయాడు! బాధపడకోయ్ అని ఓదార్చారు బి.ఎ.సుబ్బారావు. అందులోనే చిన్న పాత్ర ఇచ్చారు. యస్వీఆర్ ఆకాశంలోకి చూశాడు. తన చేతి రేఖల్ని చూసుకున్నాడు. నుదిటిరాత కనిపించదు కదా!

విధి అక్కడితో ఆగిపోలేదు. ఎల్వీ ప్రసాద్ ‘ద్రోహి’ అనే సినిమా తీస్తున్నాడు. అక్కడికెళ్లి ట్రై చెయ్ అంది. వెళ్లాడు. ‘‘అరెరె.. ఇంతకు ముందే రాళ్లబండి కుటుంబరావుకు వేషం ఫిక్స్ అయిందే’’ అన్నారు ఎల్వీ.

విధి మళ్లీ ప్రత్యక్షమైంది. మరేం పర్వాలేదు. నటి కృష్ణవేణి ‘మనదేశం’ నిర్మిస్తోంది. మొయ్యడానికి ఇటుకలున్నాయేమో వెళ్లి అడుగు అంది. తీపులెక్కిన కాళ్లను నొక్కుకుంటూ పరుగెత్తాడు యస్వీఆర్. అప్పటికే నాగయ్య, సి.హెచ్.నారాయణరావు, ఎన్టీ రామారావు బుక్కయిపోయారు. ఆ సినిమాకు కూడా ఎల్వీ ప్రసాదే డెరైక్టర్. యస్వీఆర్‌ని గుర్తుపట్టి పోనీలే పాపం అని అందులోనే చిన్నవేషం ఇచ్చారు.

ఈసారి విధి యస్వీఆర్‌ని పుల్లయ్యగారి దగ్గరికి పంపింది. అప్పుడాయన ‘తిరుగుబాటు’ చేస్తున్నారు. అందులో దొరికిందీ చిన్న ముక్కే! ఇక్కడితో విధి ఆట ఆగిపోలేదు. యస్వీఆర్‌ని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పరుగులు పెట్టిస్తూనే ఉంది. యస్వీఆర్ అలసిపోయాడు. ఆ అలసట ఎల్వీ ప్రసాద్‌కి కనిపించింది. తన గురువు హెచ్.ఎం.రెడ్డి ‘నిర్దోషి’ సినిమా తీస్తుంటే వెంటబెట్టుకెళ్లాడు. ఈ పొడగరికి, బలాఢ్యుడికి మంచి రోల్ ఉంటే ఇవ్వండని అడిగాడు. రెడ్డిగారు యస్వీఆర్‌ని కింది నించి పైదాకా చూశారు. విలన్‌గా పనికొస్తాడని అనుకున్నారు. కానీ అప్పటికే ముక్కామల కృష్ణమూర్తి విలన్‌గా బుక్కై ఉన్నారు.

‘‘ఇంకోసారి చూద్దాం. డోంట్ వర్రీ’’ అన్నారు రెడ్డిగారు.
మౌనంగా బయటికి నడిచాడు యస్వీఆర్.
ఆ సాయంత్రం ఒక్కడే చాలాసేపు ఏకాంతంగా ఉండిపోయాడు. ఇంట్లో వాళ్లు, వీధిలో వాళ్లు, స్నేహితులనుకున్నవాళ్లు... ఒక్కొక్కరూ అంతరాత్మ వేషంలో వచ్చి తలా ఒక మాట అని పోతున్నారు.
మనిషివైతే ఇంకోసారి సినిమాల్లో వేషాల కోసం వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకోవు - ఇదీ ఆ మాటల సారాంశం.
మళ్లీ ఏదో ఒక ఉద్యోగంలో చేరి ‘మనిషి’ కావడం యస్వీఆర్‌కి ఇష్టం లేదు. నటుడిగా నిలబడాలి. అదీ కృతనిశ్చయం. మద్రాసులోనే కోరమీసాలతో, చురకత్తి చూపుతో, చేతికర్రతో, ముఖంపై గాటుతో జీవితాన్ని ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యాడు.
యస్వీఆర్ బయోగ్రఫీలో ఇది ఇంటర్వెల్!

*********

కొన్ని జీవితాలను మలుపు తిప్పడానికే కొన్ని సంస్థలు భూమిపూజ జరిపి బోర్డు వేలాడదీస్తాయేమో! నాగిరెడ్డి, చక్రపాణి ‘విజయా ప్రొడక్షన్స్’ పెట్టి, తొలి చిత్రం ‘షావుకారు’ను మొదలుపెట్టినప్పుడు యస్వీఆర్‌కు అందులో ఎంట్రీ దొరికింది. పాత్ర : సున్నపు రంగడు. రికమెండేషన్ : ఎల్.వి.ప్రసాద్.
సినిమా పూర్తయ్యాక - ప్రివ్యూలో తెరమీద నుంచి విజయా అధిపతుల దృష్టిలోకి వచ్చిపడ్డాడు యస్వీఆర్. తర్వాతి చిత్రం ‘పాతాళభైరవి’లో మాంత్రికుడి వేషం ఇచ్చారు. సినిమా విడుదలై ఆంధ్రదేశాన్ని కుదిపేసింది. యస్వీఆర్ ఆరాధ్య మాంత్రికుడయ్యాడు. ఇంటికో యస్వీయార్ తయారై ‘సాహసం సాయరా డింభకా’ అంటున్నాడు! ఆ తర్వాత సినిమాల్లో కూడా యస్వీఆర్ కతలు పడ్డాడు. ‘గూట్లే’ అన్నాడు, ‘డోంగ్రే’ అన్నాడు. ‘బేవకూఫ్’ అన్నాడు. స్కూళ్లలో, కాలేజీల్లో గూట్లేలు, డోంగ్రేలు కామన్ అయ్యాయి!
యస్వీఆర్ దశ తిరిగింది! ఆయన వల్ల తెలుగు సినిమాకు మహర్దశ పట్టింది. 1950ల నుంచి 1970ల వరకు యస్వీఆర్ ఉన్నదే సినిమా. యస్వీఆర్ కొట్టిందే డైలాగ్. ఆయనలా పీల్చిందే సిగరెట్!

*********

మళ్లీ ఈ సిగరెట్ గొడవేమిటి?
యస్వీఆర్ దమ్మున్న నటుడు కదా. అందుకు.
మరి క్లయిమాక్స్ చెప్పలేదు!
యస్వీఆర్ వంటి విశ్వనట చక్రవర్తికి క్లయిమాక్స్ ఏమిటి? కంక్లూజన్ ఏమిటి?
ఓకే దెన్. అగ్గిపెట్టుందా?
ఏంటి! నాకే రివర్సా?!
కాదు. ఒక దమ్ము కొడదామని.
అంతకన్నా మంచి ఐడియా ఉంది!
ఏమిటది?
వెళ్లి.. పాతాళ భైరవో, మాయాబజారో చూడు.

- సాక్షి ఫ్యామిలీ

ఎస్.వి.రంగారావు సుప్రసిద్ధ సినీ నటులు
3 జూలై 1918 - 18 జూలై 1974

పూర్తి పేరు : సామర్ల వెంకట రంగారావు
బిరుదులు : విశ్వ నట చక్రవర్తి, నటసార్వభౌమ
జన్మస్థలం : నూజివీడు
తల్లిదండ్రులు : లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరనాయుడు
సహోదరులు : ముగ్గురు అన్నదమ్ములు,ఎనిమిదిమంది అక్కచెల్లెళ్లు
భార్య : లీలావతి (మేనకోడలు)
వివాహం : 27 డిసెంబర్
సంతానం : అమ్మాయి, అబ్బాయి, అమ్మాయి(విజయ, కోటేశ్వరరావు, ప్రమీల)
సినీరంగ ప్రవేశం : వరూధుని (1946)
పునఃప్రవేశం : షావుకారు (1950)
నటించిన చిత్రాలు : 250 కి పైగా
చివరి చిత్రాలు : చక్రవాకం (1974) యశోదకృష్ణ (1975)
మరణస్థలం : మద్రాసు

వెన్నలాంటి మనసు
వ్యక్తిగతంగా యస్వీరంగారావు సున్నిత హృదయులు. సరదాగా మాట్లాడతారు. చమత్కారం పాళ్లు ఎక్కువ.

ఇష్ట దైవం శివుడు. ప్రతిరోజూ ఉదయం శివ పూజ చేసేవారు.

షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక ిపిల్లలే ఆయన కాలక్షేపం.

మేనల్లుడు ఉదయ్‌ని కూడా ఆయనే పెంచి పెద్దచేశారు.

యస్వీఆర్‌లో పైకి కనిపించని వేదాంతి ఉన్నాడు. స్వామి వివేకానందను యస్వీఆర్ తన గురువుగా భావించారు.

ఇంటి లైబ్రరీలో వివేకానంద, రామకృష్ణ పరమహంస పుస్తకాలు ఎక్కువగా ఉండేవి.

యస్వీఆర్ కొన్ని కవితలు రాశారు! బొమ్మలూ వేశారు!!

పరనిందకు, ఆత్మస్తుతికి ఆయన దూర మంటే దూరం.

వేట అంటే సరదా. కానీ ఒక పులి కళ్లలోని దైన్యం చూశాక వేటను మానేశారని అంటారు.

యస్వీఆర్ దానగుణం కలిగినవారు. ప్రజాహిత సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా విరాళాలు ఇచ్చేవారు.

నటుడిగా మహోన్నత శిఖరాలు అధిరోహించిన యస్వీఆర్‌కి ఎన్నో అవార్డులు వచ్చాయి. అయితే పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ రాలేదు. మరణానంతరం ఇచ్చినా బాగుండేది. అదీ జరగలేదు.

హాలీవుడ్ చిత్రాలలో నటించాలని ఆయన కోరిక. ఆ కోరిక తీరకుండానే అంతిమశ్వాస విడిచారు.

అబ్బాయి కోటేశ్వరరావు 1989లో చనిపోయారు. కూతుళ్లు అమెరికాలో స్థిరపడ్డారు.

నాన్న గురించి చిన్నకూతురు ప్రమీల
నాన్నగారు విలన్ రోల్స్ వెయ్యడం నాకు ఇష్టం ఉండేది కాదు.

మ్యాచ్‌లకు పాస్‌లు వచ్చేవి. బాక్స్‌లో కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్లం.

అన్నయ్యని సినిమాల్లోకి తేవాలనుకున్నారు. కొన్నాళ్లు షూటింగ్ కూడా చేశారు. కానీ ఆగిపోయింది.

‘యశోదకృష్ణ’ పూర్తి చేశాక బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్దామనుకున్నారు. ఈలోపే చనిపోయారు.

నాన్న గురించి పెద్దకూతురు విజయ
నేను కృతులు పాడుతుంటే నాతో పాటు కూనిరాగాలు తీసేవారు.

ఫ్యామిలీ పిక్‌నిక్‌లకు వెళ్లినప్పుడు నాన్న సాంబారు, చికెన్ కర్రీ చేసేవారు.

నాన్నకి ఇంగ్లీష్ సినిమాలంటే ఇష్టం. మమ్మల్నీ తీసుకెళ్లేవారు.

ఫంక్షన్‌లకు శ్రద్ధగా ముస్తాబయ్యేవారు.

ఎస్వీఆర్ నటించిన కొన్ని చిత్రాలు
సాంఘికం : బ్రతుకుతెరువు, బంగారుపాప, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు.

పౌరాణికం : మాయాబజార్, నర్తనశాల, భక్తప్రహ్లాద, పాండవ వనవాసం, సంపూర్ణ రామాయణం, దక్ష యజ్ఞం.

జానపదం : పాతాళభైరవి, భట్టి విక్రమార్క, బాలనాగమ్మ, రాజు-పేద.

చారిత్రకం : అనార్కలి, మహాకవి కాళిదాసు, బొబ్బిలియుద్ధం,

ఎస్వీఆర్ దర్శకత్వం వహించిన చిత్రాలు : బాంధవ్యాలు, చదరంగం

నిర్మాతగా : బాంధవ్యాలు, చదరంగం, నాదీ ఆడజన్మే, సుఖదుఃఖాలు

ఎస్వీఆర్ పోషించిన కొన్ని పాత్రలు : అక్బర్, బాణాసురుడు, బందిపోటు, భీష్ముడు, భోజుడు, దక్షుడు, దుర్యోధనుడు,
ఘటోత్కజుడు, హరిశ్చంద్రుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, కీచకుడు, మాయాసురుడు, నరకాసురుడు, రాజరాజనరేంద్రుడు, రావణుడు, యముడు, మాంత్రికుడు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration