Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through November 09, 2011 * JC naa? < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5903
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 2:36 pm:    Edit Post Delete Post View Post/Check IP

ఇటువైపు నుంచి కాకుంటే అటువైపు నుంచి నరుక్కురావాలని వెనకటికో పెద్దమనిషి సలహా ఇచ్చాడట. ప్రస్తుతం ఇదే సూత్రాన్ని రాయలసీమకు చెందిన ఓ మాజీ మంత్రి తు.చ తప్పకుండా పాటించేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ్ముడికి లోక్‌సభ సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న సదరు కాంగ్రెస్ నేత.. పార్టీ తరఫున తమ్ముడికి సీటు వస్తే సరేసరి.. లేకుంటే ప్రతిపక్ష టీడీపీ నుంచైనా పోటీ చేయించాలని చూస్తున్నారట. ఈ ఆరాటం వెనుక ఓ కారణమూ ఉందట.. అదే ఇంటిపోరు. ‘నియోజకవర్గంలో అన్నీ చూసుకొనేది నేను. ఎన్నికల్లో పోటీచేసి గెలిచి అధికారం చెలాయించేది నువ్వు. ఎప్పుడూ ఇంతేనా? నాకొక్కసారీ చాన్సు ఇవ్వవా?’ అని ఇటీవల కాలంలో తమ్ముడు ఎర్రజెండా ఎగురవేశాడట! ఈ బాధ తట్టుకోలేకే తమ్ముడి అల్లుడిని టీడీపీలోకి పంపించిన ఆ నేత.. రానున్న ఎన్నికల్లో ఆయనతో అసెంబ్లీకి పోటీ చేయించేందుకు నియోజకవర్గాన్నీ సిద్ధం చేయించారు. అల్లుడికి సీటు ఇప్పించే ఏర్పాట్లు చేసినా తమ్ముడు శాంతిస్తేగా.. తాను ఈసారి కచ్చితంగా పోటీచేసి తీరుతానంటూ భీష్మించేశాడు. దీంతో కాంగ్రెస్ ఎంపీ టికెట్టు కోసం ఆ మాజీ మంత్రి నానా తంటాలు పడుతున్నారు. ఒకవేళ పార్టీ టికెట్ రాకుంటే తమ్ముడు తన సీటుకే ఎసరుపెడతారన్న ఉద్దేశంతో టీడీపీ వైపూ దృష్టి పెట్టారు. అందుకే ఆ నేత కాంగ్రెస్‌లో ఉంటూనే.. కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారట!

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration