Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through November 09, 2011 * K V Reddy < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Panjaa
Pilla Bewarse
Username: Panjaa

Post Number: 904
Registered: 10-2011
Posted From: 58.165.38.29

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 3:42 am:    Edit Post Delete Post View Post/Check IP


Seefeld:

shakuni char dailogs saana etakaram ga sufer ga vuntaayi...




CSR kummi vadilesadu. aayana gonthu kooda piccha variety ga untadi. dussasanudiki aithe "avunu. ade mana takshana kartavyam" ane dialgo okate vinipistundi cinemalo mostlyCLIPART--lol2
rakkutaa.........It's official!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 1362
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 3:38 am:    Edit Post Delete Post View Post/Check IP


Panjaa:


shakuni char dailogs saana etakaram ga sufer ga vuntaayi...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Pokiriraja
Mudiripoyina Bewarse
Username: Pokiriraja

Post Number: 14657
Registered: 02-2005
Posted From: 125.62.212.148

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 3:35 am:    Edit Post Delete Post View Post/Check IP

Maya Bazaar cameraman Marcus Bartley kee hatsoff, aa tricks elaa chesaaro ippathiki telidu.
NANADAMURI TARAKA RAMUDIKI HANUMANTHUDHINI NENU
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Panjaa
Pilla Bewarse
Username: Panjaa

Post Number: 897
Registered: 10-2011
Posted From: 58.165.38.29

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 3:34 am:    Edit Post Delete Post View Post/Check IP


Codes:

sinnapudu aa magic luu tappute eti nacha ledu.




sasi rekha - lakshamana kumarula madhya comedy iraga mama asalu.
rakkutaa.........It's official!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Codes
Bewarse Legend
Username: Codes

Post Number: 63508
Registered: 05-2006
Posted From: 212.60.115.186

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 3:28 am:    Edit Post Delete Post View Post/Check IP

sinnapudu aa magic luu tappute eti nacha ledu.. ohh sari soodali malli , nachutundi emo..

ekkada ayina manchi printuu vunte pettundri..
I have no budget for other people's faith in humanity.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Panjaa
Pilla Bewarse
Username: Panjaa

Post Number: 895
Registered: 10-2011
Posted From: 58.165.38.29

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 3:27 am:    Edit Post Delete Post View Post/Check IP


Codes:


gurtu aite ledu mama.. adi kooda epudo soosina cinema..




maya bazar favourite kaada?MOVIEART--bemmi.adi

maya bazaar is the best telugu movie ever mama naa varaku.
rakkutaa.........It's official!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Codes
Bewarse Legend
Username: Codes

Post Number: 63507
Registered: 05-2006
Posted From: 212.60.115.186

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 3:23 am:    Edit Post Delete Post View Post/Check IP


Panjaa:

maya bazar director evaro telida




gurtu aite ledu mama.. adi kooda epudo soosina cinema..

naku patha cinemalo moode fav luu.. Missama , gundama katha & kanya sulkam..
I have no budget for other people's faith in humanity.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nalla_baalu
Kurra Bewarse
Username: Nalla_baalu

Post Number: 1718
Registered: 06-2011
Posted From: 24.98.52.220

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 3:21 am:    Edit Post Delete Post View Post/Check IP

five 5 stars unnai ....soothenemoo saanthaad antha article .... i will read now MOVIEART--bemmi.hammayya
Aug 11th weight -- 84 kg \bemmi.muniga icon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Panjaa
Pilla Bewarse
Username: Panjaa

Post Number: 892
Registered: 10-2011
Posted From: 58.165.38.29

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 3:20 am:    Edit Post Delete Post View Post/Check IP


Codes:

ipati daka eeyana evaro teliyadu.





maya bazar director evaro telidaMOVIEART--champesta
rakkutaa.........It's official!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Codes
Bewarse Legend
Username: Codes

Post Number: 63506
Registered: 05-2006
Posted From: 212.60.115.186

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Tuesday, November 08, 2011 - 3:18 am:    Edit Post Delete Post View Post/Check IP

ipati daka eeyana evaro teliyadu.. gr8..
I have no budget for other people's faith in humanity.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Farex
Yavvanam Kaatesina Bewarse
Username: Farex

Post Number: 7062
Registered: 10-2010
Posted From: 151.151.16.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 3:34 pm:    Edit Post Delete Post View Post/Check IP

fan baa, sampesav,,CLIPART--5,,,,MOVIEART--bemmi.whistle

and KV Reddy gaaru MOVIEART--bemmi.prayer MOVIEART--blessme
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Tingari_xx
Celebrity Bewarse
Username: Tingari_xx

Post Number: 42666
Registered: 08-2006
Posted From: 205.157.110.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 3:26 pm:    Edit Post Delete Post View Post/Check IP

f1 ba
too much vundi info,inni rojulu vitalacharya anukunna pathalabhairavi direchan..ntr US trip incident keka
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5908
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 3:19 pm:    Edit Post Delete Post View Post/Check IP


Bestboy:



kubang:


CLIPART--hug1
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5907
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 3:01 pm:    Edit Post Delete Post View Post/Check IP


Nalla_baalu:




http://en.wikipedia.org/wiki/Bommireddy_Narasimha_Reddy
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nalla_baalu
Kurra Bewarse
Username: Nalla_baalu

Post Number: 1680
Registered: 06-2011
Posted From: 24.98.52.220

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 2:51 pm:    Edit Post Delete Post View Post/Check IP


Kubang:


ante athanu cbit chairman annai anduke doubt vachi adigaanu MOVIEART--dv
Aug 11th weight -- 84 kg \bemmi.muniga icon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Pilla Bewarse
Username: Kubang

Post Number: 595
Registered: 09-2011
Posted From: 207.134.107.2

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 2:49 pm:    Edit Post Delete Post View Post/Check IP


Nalla_baalu:

CBIT BN Reddy aa??




MOVIEART--bemmi.etakaram
Devuda, be ready
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Nalla_baalu
Kurra Bewarse
Username: Nalla_baalu

Post Number: 1679
Registered: 06-2011
Posted From: 24.98.52.220

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 2:36 pm:    Edit Post Delete Post View Post/Check IP


Bestboy:

BN reddy


CBIT BN Reddy aa??
Aug 11th weight -- 84 kg \bemmi.muniga icon
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Bestboy
Pilla Bewarse
Username: Bestboy

Post Number: 904
Registered: 03-2005
Posted From: 117.202.142.134

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 2:33 pm:    Edit Post Delete Post View Post/Check IP

Thanks a lot Fanno1...

Anna gaaru..
KVRedddy gaarini BN Reddy ni eppdu marchi poledu..
After becoming CM,immedialtey he went BN reddy house and said , "nenu ee roju CM aayanante aa roju meeru theesina cinemaalavalle."

Those days and those people are different..
Mahaanubhaavulu...
ONE & ONLY OKKAMAGAADU - MAA BAALAYYA
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Kubang
Pilla Bewarse
Username: Kubang

Post Number: 593
Registered: 09-2011
Posted From: 207.134.107.2

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 2:01 pm:    Edit Post Delete Post View Post/Check IP


Fanno1:




Thanks bro.. Excellent post. Mayabazar telugu cinema mahadbhutham, and K V Reddy gaaru all time best director. aayana oka cinema ki expose chesina film, ippudu so called creative and best directors just rendu songs ki saripedatharu
Devuda, be ready
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Pokiri1
Mudiripoyina Bewarse
Username: Pokiri1

Post Number: 18314
Registered: 03-2006
Posted From: 192.35.35.35

Rating: 
Votes: 2 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 12:10 pm:    Edit Post Delete Post View Post/Check IP

Uth President Zmanzi CLIPART--hug1
ara nimashamulo sachevadivi nee address naku endhuku raa
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Farex
Yavvanam Kaatesina Bewarse
Username: Farex

Post Number: 7045
Registered: 10-2010
Posted From: 151.151.16.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 11:43 am:    Edit Post Delete Post View Post/Check IP


Durga:




CLIPART--hug1
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Durga
Celebrity Bewarse
Username: Durga

Post Number: 29955
Registered: 03-2004
Posted From: 207.70.143.185

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 11:39 am:    Edit Post Delete Post View Post/Check IP


Farex:

annai , phone




nest day morn, edo panni padindi, so early ga sleeps aa roju, swarrys gold annai

pone 12 ki ring avvagane anukuna, nuvve ani, kiki, podduna chuste neede
*TARAKA*
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Farex
Yavvanam Kaatesina Bewarse
Username: Farex

Post Number: 7044
Registered: 10-2010
Posted From: 151.151.16.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 11:39 am:    Edit Post Delete Post View Post/Check IP


Fanno1:




parledhu annai,,,,matladudham malli CLIPART--hug1
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5906
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 11:26 am:    Edit Post Delete Post View Post/Check IP


Farex:




annai phone chesav kada Missa ayya. nene chsttaa annai
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Farex
Yavvanam Kaatesina Bewarse
Username: Farex

Post Number: 7040
Registered: 10-2010
Posted From: 151.151.16.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 10:42 am:    Edit Post Delete Post View Post/Check IP

baaaaa MOVIEART--vja.hug
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Pokiri1
Mudiripoyina Bewarse
Username: Pokiri1

Post Number: 18308
Registered: 03-2006
Posted From: 192.35.35.35

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 10:39 am:    Edit Post Delete Post View Post/Check IP

baa MOVIEART--vja.hug
ara nimashamulo sachevadivi nee address naku endhuku raa
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Farex
Yavvanam Kaatesina Bewarse
Username: Farex

Post Number: 7039
Registered: 10-2010
Posted From: 151.151.16.16

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 10:29 am:    Edit Post Delete Post View Post/Check IP


Durga:




annai , phone MOVIEART--bemmi.muddu
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Durga
Celebrity Bewarse
Username: Durga

Post Number: 29954
Registered: 03-2004
Posted From: 207.70.143.185

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, November 07, 2011 - 10:25 am:    Edit Post Delete Post View Post/Check IP

222 much articleCLIPART--band2

tanx fan annai
*TARAKA*
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5905
Registered: 03-2004
Posted From: 24.163.58.247

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 7:48 pm:    Edit Post Delete Post View Post/Check IP


Andhramass:





thanks annai
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Celebrity Bewarse
Username: Andhramass

Post Number: 49644
Registered: 07-2006
Posted From: 203.26.122.12

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 3:54 pm:    Edit Post Delete Post View Post/Check IP

Excellent article

thanks fanno1 for sharing
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Den_haag
Pilla Bewarse
Username: Den_haag

Post Number: 551
Registered: 10-2011
Posted From: 86.83.106.180

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 5:31 am:    Edit Post Delete Post View Post/Check IP

Aa kaalam lo atta vunde vaaru PDodaa....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Seefeld
Kurra Bewarse
Username: Seefeld

Post Number: 1267
Registered: 10-2011
Posted From: 195.149.220.213

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 5:30 am:    Edit Post Delete Post View Post/Check IP

script time lone shot ku entha time avuddi,actors ability,dailog delivery parameters ga pplanning ante...vaammo adi mamoolu talent kadhu... ippudoche vallu cinemayee jeevitham ani seppevvallu pachi buss anukunta...cinema ne jeevitham antee ayanadhi...ala bahtukuthene atta judge cheyyagalaru...vammoo...mamoolut alent kaahdu...
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Den_haag
Pilla Bewarse
Username: Den_haag

Post Number: 550
Registered: 10-2011
Posted From: 86.83.106.180

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, November 06, 2011 - 5:24 am:    Edit Post Delete Post View Post/Check IP

KV reddy gaaru MOVIEART--blessme....
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Mudiripoyina Bewarse
Username: Gaali

Post Number: 23890
Registered: 03-2004
Posted From: 68.200.249.241

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 05, 2011 - 10:55 pm:    Edit Post Delete Post View Post/Check IP

KV Reddy gaarante NTR ki special abhimaanam. Chivari stage lo KV Reddy cinemalu konni (Harischandra, Uma Chandi Gouri Sankarla Katha) flop ayyayi (Vijaya vaarivi). Aa down time lo Vijaya vaallu KV Reddy gaari technicians andarini layoff chesaaru.

Aa bad period lo NTR, KV Reddy ni o rakamga aadukonnaru. Tana Sree Krishna Satya cinema ki aayanni director ga pettukoni athani staff ni kooda employ chesaadu.

KV Reddy ni script vishayam lo NTR anukarinchevaadu. Oka saari script ready ayyake cinema teese vaadu aa script maarche vaadu kaadu.
I love you Sachin!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Mudiripoyina Bewarse
Username: Gaali

Post Number: 23887
Registered: 03-2004
Posted From: 68.200.249.241

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 05, 2011 - 10:26 pm:    Edit Post Delete Post View Post/Check IP


quote:

"'Maya Bazar' of KV Reddy is a lesson in cinematography art," he says. For him 'Donga Ramudu' is a social epic in cinema art.




ANR
I love you Sachin!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Dobbey
Kurra Bewarse
Username: Dobbey

Post Number: 3692
Registered: 03-2011
Posted From: 69.135.175.99

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 05, 2011 - 9:48 pm:    Edit Post Delete Post View Post/Check IP

komatreddy venkat reddy anukunna MOVIEART--bwalk
Health is Happiness
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Simhadri
Pilla Bewarse
Username: Simhadri

Post Number: 333
Registered: 11-2011
Posted From: 183.82.185.51

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 05, 2011 - 9:44 pm:    Edit Post Delete Post View Post/Check IP

reddy garu MOVIEART--blessme CLIPART--clap
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5894
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 05, 2011 - 9:20 pm:    Edit Post Delete Post View Post/Check IP


Gaali:

Awesome brother!




Thanks annai
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Gaali
Mudiripoyina Bewarse
Username: Gaali

Post Number: 23883
Registered: 03-2004
Posted From: 68.200.249.241

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 05, 2011 - 8:50 pm:    Edit Post Delete Post View Post/Check IP

Awesome brother!

Thank you for sharing this.
I love you Sachin!
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5893
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Saturday, November 05, 2011 - 8:45 pm:    Edit Post Delete Post View Post/Check IP

ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున... వీళ్లందరికీ నాన్నంటే గురుభావం.

ముఖ్యంగా ఎన్టీఆర్‌కి నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న తెలుగులో 14 సినిమాలు చేస్తే, 8 సినిమాల్లో ఎన్టీఆరే హీరోగా చేశారు. నాన్న చివరి సినిమా ‘శ్రీకృష్ణ సత్య’ ఆయన తీసిందే. ‘‘వంట్లో బాగుండడం లేదు... డెరైక్షన్ చేసే ఓపిక లేదు’’ అని నాన్న చెబితే, ‘‘మీరలా కూర్చుని డెరైక్షన్ ఇవ్వండి చాలు. అంతా మేం చేసుకుపోతాం’’ అని చెప్పి మరీ చేయించుకున్నారు.

నేను ఎలక్ట్రానిక్స్‌లో ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్తానంటే నాన్న మొదట కొంచెం తటపటాయించారు. ఎన్టీఆర్ మాత్రం చాలా సంతోషపడి ‘‘అమెరికా వెళ్లి చదవడమంటే మామూలు విషయం కాదు. ధైర్యంగా పంపించండి’’ అని చెప్పారు.

ముఖ్యమంత్రి అయ్యాక ఎన్టీఆర్ ఓసారి అమెరికా వచ్చారు. అక్కడి తెలుగు వారందర్నీ కలిశారు. ‘‘ఇక్కడ మా కేవీ రెడ్డిగారి అబ్బాయి ఉంటున్నాడు కనుక్కోండి’’ అని పురమాయించి మరీ మా కంపెనీకి వచ్చారు. నన్ను కౌగిలించుకుని ‘‘మీ నాన్నగారు ఉంటే మిమ్మల్ని ఈ స్థానంలో చూసి చాలా ఆనందించేవారు’’ అన్నారు.
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Yavvanam Kaatesina Bewarse
Username: Fanno1

Post Number: 5892
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: 
Votes: 5 (Vote!)

Posted on Saturday, November 05, 2011 - 8:44 pm:    Edit Post Delete Post View Post/Check IP

ఎవరు ఎంపిక చేసినా తెలుగువారి మొట్టమొదటి ప్రజారంజక చిత్రంగా నిలవగలిగేది ‘మాయాబజార్’ మాత్రమే. దాని దర్శకుడు కేవీరెడ్డి. తెలుగు సినిమాకు ఊపును, సినిమా హీరోకు రూపును ఇచ్చిన చిత్రం ‘పాతాళ భైరవి’. దాని దర్శకుడు కూడా కేవీరెడ్డి అనబడే కదిరి వెంకటరెడ్డి. భక్త పోతన, యోగి వేమన, జగదేకవీరుని కథ, దొంగరాముడు,పెద్ద మనుషులు...

బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే సినిమాలోని అన్ని రంగులనూ ఆయన చూపించారు. సినిమాను అత్యున్నత శిఖరాలకు చేర్చారు. సినిమా కళకు పాఠ్యపుస్తకంగా మిగిలిపోయారు. ప్రపంచ శ్రేణి అత్యుత్తమ దర్శకుడు కేవీరెడ్డికి ఇది శతజయంతి సంవత్సరం.

ఖాదీ పంచెకట్టు... ఫ్రెంచి మీసకట్టు... చేతికి రిస్ట్‌వాచ్... పొట్టి చేతుల చొక్కా... మెడ చుట్టూ తెల్ల తువ్వాలు... లాంగ్‌షాట్‌లో చూసినా క్లోజప్‌లో చూసినా కేవీరెడ్డి ఫక్తు మోతుబరి రైతులాగా అనిపిస్తారు. అదీ నిజమే. తెలుగు సినిమా క్షేత్రంలో ఆయన చేసింది రైతు పనే.

కలుపు మొక్కల్లేని పంట... ఎరువు కోరలు తాకని పంట... అంతా బంగారమే. పండిస్తే ఇలాగే పండించాలి. కళ్లు చెదిరిపోవాలి. మనసు నిండిపోవాలి.

కేవీరెడ్డి పుట్టి వందేళ్లయ్యిందా? గిట్టి ముప్ఫై తొమ్మిదేళ్లవుతుందా? అయితే ఏంటట? ఈ జయంతులూ వర్ధంతులూ నాన్సెన్స్. ట్రెండీగా ఉండాలి బాబూ... అడ్వాన్స్‌డ్‌గా ఆలోచించాలి నాయనా... కంప్యూటర్ జనరేషన్ మెంటాల్టీ ఇలాగే ఉంటుంది. అయితే వాళ్లకు కచ్చితంగా ‘పాతాళ భైరవి’ చూపించాలి. ‘మాయాబజార్’ చూపించాలి. ‘దొంగ రాముడు’ చూపించాలి. ‘జగదేక వీరుని కథ’ చూపించాలి. ఇంకా చాలా సినిమాలు చూపించాలి.

కేవీరెడ్డి ‘పాతాళ భైరవి’ తీసింది 1951లో. నిన్న మొన్న వచ్చిన హ్యారీపోటర్ దీని కాలిగోటికి సరితూగదు. ఒకసారి రీ-రికార్డింగ్ వినండి. డాల్బీ, డీటీఎస్‌లు కూడా జడుసుకుంటాయి.
‘మాయా బజార్’ దగ్గరకు వద్దాం. మనకేదైనా సమాచారం కావలిస్తే టకీమని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసేసి వికీపీడియాలో సెర్చ్ చేస్తున్నాం. మనం చాలా గ్రేట్. ఓకే. మరి కేవీరెడ్డి యాభై నాలుగేళ్ల ముందే మనకు ల్యాప్‌టాప్ చూపించేశారు. అది అల్లాటప్పా ల్యాప్‌టాప్ కాదు. దాని పేరు ప్రియదర్శిని. మన మనసులో ఏముందో ఇట్టే చూపించేస్తుంది. ఆ కాలంలోనే అంత అడ్వాన్‌‌స్డగా ఆలోచించారాయన.

‘జగదేక వీరుని కథ’లో ‘శివ శంకరి’ పాటలో అయిదుగురు ఎన్టీఆర్‌లు కనిపిస్తారు. అప్పటికి కంప్యూటర్ల గురించి తెలియదు. గ్రాఫిక్స్ జిమ్మిక్స్ లేనే లేవు. అయినా సింపుల్‌గా చేసి పారేశారాయన. ఇప్పుడు చెప్పండి కేవీరెడ్డి గ్రేటా? కాదా?
అయితే ఇప్పటికిప్పుడు ఫిలిమ్ నగర్ సెంటర్లో విగ్రహం పెట్టేద్దామంటారా?
నిజం చెప్పమన్నారా? అబద్దం చెప్పమన్నారా?
ఆయన ఉండాల్సింది అక్కడ కాదు. మన గుండెల్లో.

ఖర్చు విషయంలో పిసినారి
కేవీ రెడ్డి ఫొటో ఎలాగూ దర్శకుల సంఘంలో ఉంటుంది. కానీ నిర్మాతల మండలిలో మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఆయన నిర్మాతల దర్శకుడు. నిర్మాత క్షేమం కోరిన దర్శకుడు. ఇంత బడ్జెట్‌లో సినిమా తీస్తానని కమిట్ అయితే రూపాయి కూడా పెరగదంతే. ప్రతి పైసా గీసిగీసి ఖర్చుపెట్టేవారు. అందుకే అంతా పిసినారి అనేవారు. కాదు. డబ్బు విలువ తెలిసిన మనిషాయన.
దుక్కిపాటి మధుసూదనరావు ‘అన్నపూర్ణ పిక్చర్స్’ సంస్థ పెట్టి కేవీరెడ్డితోనే ఓంకారం చుట్టాలనుకున్నారు. ఆయన కోసమే రెండేళ్లు పైనే ఆగారు. ఆగినందుకు ‘దొంగరాముడు’తో మంచి ఫలితమే దక్కింది. ‘అన్నపూర్ణ’కు తిరుగులేని పునాది పడింది.

‘మాయాబజార్’ తలకు మించిన భారం అవుతుందేమోనని ఓ దశలో నాగిరెడ్డి-చక్రపాణి భయపడి ప్రొడక్షన్ ఆపేద్దామన్నారు. కేవీ రెడ్డి వారికి అభయమిచ్చి ‘‘మనం అనుకున్న బడ్జెట్‌పై ఒక్క రూపాయి ఎక్కువైనా ఆ భారం నాదే’’ అని భరోసా ఇచ్చారు. దాంతో నాగిరెడ్డి-చక్రపాణికి ధైర్యం వచ్చింది.

స్టాప్‌వాచీతో ఫుటేజ్
కేవీరెడ్డి దర్శకత్వ ప్రతిభ గురించి పేద్ద రీసెర్చ్ గ్రంథమే రాసిపారేయొచ్చు. కానీ ఆయనలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఇంకొకటుంది. స్క్రిప్ట్. ఆయన దేవుణ్ణి బాగా నమ్ముతారు. అంతకన్నా ఎక్కువగా కథను నమ్ముతారు. బంగారాన్ని శుద్ధి చేయడానికి స్వర్ణకారుడు ఎంతగా శ్రమిస్తాడో అంతకు రెట్టింపు స్క్రిప్ట్ కోసం శ్రమిస్తారాయన.

ఒక్క వేస్ట్ సీన్, ఒక్క వేస్ట్ షాట్ కనబడదు. స్క్రిప్టు పూర్తయ్యాక షాట్ డివిజన్ చేసేవారు. అసిస్టెంట్ డెరైక్టర్‌తో సీన్ చదివించుకుంటూ స్టాప్ వాచ్ పెట్టుకుని పుటేజ్ నోట్ చేయడం కేవీరెడ్డికి అలవాటు.
ఇక్కడో ఉదాహరణ చెప్పాలి. ‘గుణసుందరి కథ’ కోసం ఇలాగే నోట్ చేస్తున్నారు. ఓ చోట అసిస్టెంట్ డెరైక్టర్ రెండు నిమిషాలని టైమ్ చెప్పాడు. దానికి కేవీరెడ్డి ‘‘కాదు, ఇంకో అర నిమిషం పెరుగుతుంది. మహారాజుగా చేసే గోవిందరాజు సుబ్బారావు డైలాగులు తాపీగా చెబుతారు. ఆయన ఉన్న ప్రతి దృశ్యానికీ మనం వేసుకున్న టైమ్‌కి మరికొంత కలుపుకోవాలి’’ అన్నారు.

చాలా మంది తమ స్క్రిప్ట్‌లో ఆ రోజు షూటింగ్‌కి కావలసినవి రాసుకుంటారు, కానీ ప్రాక్టికల్‌గా ఆలోచించరు. కానీ కేవీరెడ్డి మాత్రం అన్నీ క్లియర్‌గా రాసుకుంటారు. ఉదాహరణకు బిందెలో నుంచి చెంబుతో నీళ్లు తీసి యిచ్చే సన్నివేశం ఉంటే... దానికి ఒక బిందె, ఒక చెంబు అని మాత్రం రాసుకొని ఊరుకోకుండా ‘ఒక బిందె, ఆ బిందెలో పట్టే ఒక చెంబు’ అని రాసుకునేవారు.

‘జగదేకవీరుని కథ’ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ‘జలకాలాటలలో’ పాట జనవరిలో తీయాలి. చలికాలం కాబట్టి మూడు పూటలా వేడినీరు సరఫరా చేయాలని ప్రొడక్షన్ వారికి నోట్ పెట్టారు. ఇంత ముందు చూపుతో ఎవరైనా ఆలోచిస్తారంటారా?

ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యిందంటే హరిహర బ్రహ్మాదులొచ్చినా ఒక్క అక్షరం మార్చడానిక్కూడా ఒప్పుకోరాయన. లొకేషన్‌లో అప్పటికప్పుడు డిస్కస్ చేసుకుని సీన్ సృష్టించడాలు కేవీ రెడ్డి కెరీర్‌లోనే లేదు. కెమెరా యాంగిల్స్... ఎడిటింగ్ పని కూడా స్క్రిప్ట్ దశలో డిసైడ్ అయిపోవాల్సిందే.
17 వేల అడుగుల్లో సినిమా తీయాలనుకుంటే, ఫైనల్‌కు వచ్చేసరికి వందో రెండొందల అడుగుల తేడా వచ్చేది కానీ, తీసిన దాంట్లో ‘కట్’ చేస్తూ పోవడం ఆయన చరిత్రలో లేదు. ‘దొంగరాముడు’ను 17 వేల అడుగుల్లో తీస్తానని నిర్మాతకు చెప్పారు. కానీ 17,250 అడుగుల సినిమా తయారైంది.

అందుకు కారణం కూడా ఉంది. హీరో ఏయన్నార్, విలన్ ఆర్.నాగేశ్వరరావు మధ్య మొదట ముష్టి యుద్ధం ప్లాన్ చేశారు. తరువాత రెజ్లింగ్‌గా మార్చడంతో ఈ నిడివి పెరిగింది. అది కూడా నిర్మాత ప్రోద్బలమే. 14 వేల అడుగుల సినిమా కోసం రెండు, మూడు లక్షల నెగిటివ్ ఎక్స్‌పోజ్ చేస్తున్న రోజులివి. వారికి కొంచెం కేవీరెడ్డి వర్కింగ్ స్టయిల్ ఆశ్చర్యంగానూ, వింతగానూ, చాదస్తంగానూ అనిపించొచ్చు.

లొకేషన్‌లో పిన్‌డ్రాప్ సెలైన్‌‌స
స్క్రిప్ట్ విషయంలోనే కాదు, షూటింగ్ లొకేషన్‌లో కూడా కేవీరెడ్డి వర్కింగ్ స్టయిలే డిఫరెంట్. లొకేషన్‌లో పిన్‌డ్రాప్ సెలైన్స్ ఉండాలి. అంతా ఒక చోట కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం, పేకాట ఆడడం... ఇవేవీ ఆయనకు నచ్చవు.

ఓసారి ‘మాయాబజార్’ షూటింగ్‌లో ఎన్టీఆర్, ఏయన్నార్, గుమ్మడితో నాగిరెడ్డి, చక్రపాణి పిచ్చాపాటి మాట్లాడుతూ నవ్వుకుంటుంటే, నిర్మాతలని కూడా చూడకుండా కయ్‌మన్నారు. నాగిరెడ్డి- చక్రపాణిక్కూడా కేవీరెడ్డి డిసిప్లిన్ తెలుసు కాబట్టి మారు మాట్లాడకుండా వెళ్లిపోయారు.

చాలామంది డెరైక్టర్లు యాక్ట్ చేసి చూపిస్తారు. కేవీ అలాక్కాదు. ఆర్టిస్టుల్నే చేయమనేవారు. అందులోంచి బెస్ట్ తీసుకునేవారు. టేక్ తీసుకునేముందు మేకప్, లైటింగ్, కెమేరా పొజిషన్ అన్నీ చెక్ చేసేవారు. టేక్ బాగా వస్తే ‘పాస్’ అనేవారు. ఆయన టైమంటే టైమే. ఒక్క క్షణం ఆలస్యమైనా అగ్గిమీద గుగ్గిలం అయిపోయేవారు. ఎవరైనా ఆలస్యంగా లొకేషన్‌కి వచ్చారా... వాళ్ల పని అయిపోయినట్టే.

ఎన్టీఆర్‌ని కృష్ణుడిగా హిట్ చేశారు

డెరైక్టర్‌కి కమాండింగూ ఉండాలి. విజనూ ఉండాలి. ఏ పాత్రకు ఏ ఆర్టిస్టు నప్పుతాడో తెలియగలగాలి. ‘గుణసుందరి కథ’ తెలుసు కదా! కస్తూరి శివరావు అనే కమెడియన్‌ని హీరోగా పెట్టి తీశారాయన.

‘మాయాబజార్’లో శ్రీకృష్ణుని పాత్రకు ఎన్టీఆర్ ఎంపిక అయితే ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అందులో ఘటోత్కచుడు ఎంత ఇంపార్టెంటో, కృష్ణుడు అంతకన్నా ఇంపార్టెంట్. సినిమా అంతా నడిపించేది కృష్ణుని పాత్రే. ఘటోత్కచునిగా ఎస్వీఆర్‌కు నో ఆప్షన్. మరి కృష్ణుడు? ఎన్టీఆర్‌ను రమ్మన్నారు. నువ్వే కృష్ణుడివన్నారు. యూనిట్ అంతా షాక్. ఎందుకంటే అప్పటికే ఎన్టీఆర్ ‘ఇద్దరు పెళ్లాలు’, ‘సొంత ఊరు’ సినిమాల్లో కృష్ణునిగా కనిపించారు. ఆ రెండూ ఫెయిలే. అసలే సినిమా ఫీల్డ్‌లో సెంటిమెంట్లు ఎక్కువ. ‘మాయబజార్’లో కూడా ఎన్టీఆర్ కృష్ణుని వేషం వేస్తే మటాషే.

ఈ కామెంట్లు ఎన్టీఆర్ చెవిన కూడా పడ్డాయి. దాంతో ఆయనలో బెరుకు. కేవీ రెడ్డికి విషయం అర్థమైంది. అయినా కృష్ణుని వేషానికి ఎన్టీఆర్‌ను సిద్ధం చేశారు. అప్పట్లో కృష్ణుడంటే వీధి భాగవతులు పెట్టే హాఫ్ క్రౌన్, నెమలీకలు కంపల్సరీ. కానీ కేవీరెడ్డి కృష్ణుడు అలా ఉండకూడదని, ఆర్ట్ డెరైక్టర్ గోఖలేని కూచోబెట్టి రకరకాల స్కెచ్‌లేయించి ఫైనల్‌గా బ్రహ్మాండమైన లోహ కిరీటం చేయించి ఎన్టీఆర్ నెత్తిన పెట్టారు. నిజంగా కృష్ణుడే దిగొచ్చినట్టుగా ఫీలయ్యారు యూనిట్ సభ్యులు. ‘మాయాబజార్’ తర్వాత శ్రీకృష్ణుడంటే ఎన్టీఆరే అయిపోయారు.

‘మాయాబజార్’లో రేవతి పాత్ర కోసం ఛాయాదేవిని తీసుకుందామంటే ఆమె లావు గురించి ఒకరిద్దరు సందేహం వెలిబుచ్చారట. దానికి కేవీ రెడ్డి ఏమన్నారో తెలుసా? ‘‘మన కథానాయిక సావిత్రి కొంచెం స్థూలం కదా. ఆమె సన్నగా కనపడాలంటే మరింత స్థూలకాయం గల నటి తల్లిగా ఉండాలి కదా’’.
సినిమా ఎత్తుగడ ఎలా ఉండాలో, ముగింపు ఎలా కుదరాలో, కథ నడక ఎన్ని హొయలు పోవాలో, చిత్రీకరణలో ఎన్ని కళలు కుదరాలో కేవీరెడ్డి చేసి చూపించారు. స్క్రీన్‌ప్లే రహస్యాలు తెలియాలంటే ఆయన సినిమాలు చూస్తే చాలు! ఇప్పటికే చాలామంది తెలియకుండానో, తెలివిగానో ఆయన్నుంచి ప్రేరణ పొందారు.

దేవుడి హుండీలో పడేశారు
ఎక్కడి తాడిపత్రి! ఎక్కడి మద్రాసు!
ఆయన సినిమాల్లాగానే ఆయన జీవితం ఓ లవ్లీ ఎక్స్‌పీరియెన్స్.
కేవీరెడ్డి పుట్టుకే ఓ మిరాకిల్.
తేళ్లమిట్టపల్లె... అనంతపురం జిల్లా తాడిపత్రికి అయిదు మైళ్ల దూరంలోని ఓ కుగ్రామం. కేవీ రెడ్డి సొంత ఊరు అదే.

వాళ్ల నాయన కొండారెడ్డి. ఊరు మొత్తం మీద విద్యావంతుడు. నూటయాభై ఎకరాల భూస్వామి. కొండారెడ్డి భార్య వెంకట రంగమ్మ వెంకటేశ్వరస్వామి భక్తురాలు. దైవచింతన అధికం. ఓసారి ఏదో కడుపులో పుండు వస్తే తాడిపత్రి తీసుకెళ్లి కషాయం ఇప్పించారు. ఆ తర్వాత మళ్లీ ఏదో కడుపులో సమస్య. ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు. పుండు అనుకుంటే పండులాంటి బిడ్డొచ్చాడు.
వాడికి ఏడాది వయసు రాగానే వెంకటరంగమ్మ... చింతల వెంకటరమణస్వామి గుడికి తీసుకెళ్లింది.

బిడ్డను హుండీలో పడేసి ‘‘ఇకపై వీడు నీ బిడ్డ... నీ ఇష్టం ఏం చేసుకుంటావో’’ అని ఊరొచ్చేసింది. ఇంట్లో వాళ్లంతా ఒకటే కంగారు. బిడ్డ ఎక్కడ అంటే హుండీలో వేశానని చెప్పిందావిడ. లబోదిబోమంటూ ఇంట్లోవాళ్లు పరిగెత్తుకుంటూ వెళ్తే బిడ్డ గుళ్లోనే హాయిగా ఉన్నాడు. కుర్రాడికి రెండేళ్ల వయసప్పుడు కొండారెడ్డి పోయారు. దాంతో వెంకట రంగమ్మ ఇంకా దైవచింతనలో కూరుకుపోయింది. దాంతో కేవీరెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాడు మేనమామ.

తండ్రి లేడనే చింత మినహాయిస్తే కేవీరెడ్డి బాల్యమంతా రంగుల హరివిల్లే. నదిలో ఈతలు... చేపలు పట్టడాలు... కొండలు ఎక్కడాలు... తోటలో పళ్ల దొంగతనాలు... శ్మశానంలో ఎముకలతో పరిశోధనలు... రకరకాల మంత్రశక్తుల గురించి ప్రయోగాలు... అయినా చదువులో ముందుండేవాడు కేవీ.
మేథమేటిక్స్‌లో కేవీని కొట్టేవాడే లేడు. కాలిక్యులేటర్ గీలిక్యులేటర్ జాన్తా నహీ. ఏదైనా నోటి లెక్కలే. 15x13 = ఎంత అంటే చిటికెలో చెప్పేస్తాడు. 115x113 = ఎంత అన్నా అదే స్పీడు.

అందుకే లెక్కల్లో ఎప్పుడూ కేవీకి నూటికి నూరు మార్కులు. ఎయిత్ ఫారమ్ చదువుతూ ఎస్సెసెల్సీ వాళ్లకి లెక్కలు చెప్పేవాడు. ఒక్క మేథమేటిక్సే కాదు, పెయింటింగ్‌లోనూ కేవీ సూపర్బ్. తను బోర్డు మీద ఏదైనా రంగుల బొమ్మ వేశాడంటే, నిజంగా పోస్టర్ అంటించినట్టే ఉండేదట. కేవీలో ఇంకా చాలా కళలున్నాయ్. రన్నింగ్ ఫస్ట్... ఫుట్‌బాల్‌లో సూపర్... హాకీలో ఎక్స్‌పర్ట్... కేవీకి చిన్నప్పట్నుంచీ ఓ దోస్తు ఉండేవాడు. పేరు మూలా నారాయణస్వామి. ఒకటే బెంచీ... ఒకటే కంచం... ఒకటే మంచం... అన్న రీతిలో ఉండేవాళ్లు.

ఓ రోజు... తాడిపత్రికి జైన్ మహమ్మదీయ ఎలక్ట్రిక్ బయోస్కోప్ వచ్చింది. దోస్తులిద్దరూ సినిమా చూసొచ్చి ఒకటే కలలు. మనమూ ఇలా సినిమా తీద్దామా అడిగాడు కేవీ. నువ్వు తీస్తానంటే డబ్బు ఖర్చంతా నాదే అని నారాయణస్వామి భరోసా. లొకేషన్ కూడా చూసేసుకున్నారు. తాడిపత్రికి 5 మైళ్ల దూరంలో ఓ లోయ ఉంది. మన సినిమా షూటింగ్ ఇక్కడే చేద్దాం అనుకున్నారు మిత్రులిద్దరూ.

కేవీ ఇప్పుడు డిగ్రీ దశకొచ్చాడు. బీఎస్సీ ఆనర్స్. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజ్. విక్టోరియా హాస్టల్‌లో మకాం. ఇక్కడకొచ్చాక కేవీకి కాళ్లూ చేతులూ కట్టేసినట్టే అనిపించింది. ఇక, శని, ఆది వచ్చాయంటే మూడాటలు చూసేయాల్సిందే. చూసొచ్చాక ఆ సినిమాల్లో తొప్పొప్పుల్ని భలే బేరీజు వేసేసేవాడు కేవీ.

కేవీకి బీఎస్సీ పట్టా చేతికొచ్చింది. ఉద్యోగాల వేట మొదలైంది. నో రెస్పాన్స్. చివరకు టీచర్ ట్రెయినింగ్‌కు వెళ్తే కూడా రిజెక్ట్. ఇప్పుడేం చేయాలి? కేవీ ఫ్రెండు ఏవీవీ కృష్ణారావు కలిశాడు. తనొక ఐడియా చెప్పాడు. 250 రూపాయలు పెట్టుబడి ఉంటే చాలు. కంపెనీ స్టార్ట్. అలా 1936లో ‘ద స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ’ మొదలైంది.

ఓ కారు షెడ్‌లో ‘లేత్’ మెషీన్ పెట్టి స్కూళ్లకు, కాలేజీలకు కావాల్సిన శాస్త్రోపకరణాలు తయారుచేసేవారు. ఇలా ఏడాది గడిచింది. అదే సమయంలో బాల్యమిత్రుడు మూలా నారాయణస్వామి రోహిణీ సంస్థలో భాగస్వామిగా చేరారు. రోహిణీ వాళ్లు ‘గృహలక్ష్మి’ తీస్తున్నారు. కేవీ అక్కడ క్యాషియర్‌గా చేరారు. డబ్బు లెక్కల మీద కన్నా సినిమా మేకింగ్ మీదే మైండ్ ఎక్కువ పెట్టారు.

తర్వాత రోహిణీ నుంచి విడిపోయి మూలా నారాయణస్వామి, బీఎన్ రెడ్డి ప్రభృతులు ‘వాహినీ’ సంస్థ ఏర్పాటు చేశారు. అందులో కేవీక్కూడా వాటా ఇచ్చారు. బీ.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వందేమాతరం, సుమంగళి, దేవత... తీశారు. ఈ మూడింటికీ కేవీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్.
కానీ కేవీ మనసంతా డెరైక్షన్ మీదే. మొత్తానికి మూలా నారాయణస్వామి ప్రోద్బలంతో మెగాఫోన్ పట్టుకునే చాన్సొచ్చింది కేవీకి.

ఓ అపూర్వ ప్రేమకథా చిత్రం తీయాలనేది కేవీ ప్లాన్. తీరా డెరైక్షన్ చాన్స్ వచ్చాక ఆయన ఆలోచన మారిపోయింది. తనకు నచ్చింది చేయాలా? జనం మెచ్చేది చేయాలా? రెండోదే కరెక్ట్ అనుకున్నారు.
అప్పట్లో ప్రేక్షకులు భక్తి చిత్రాలు బాగా ఆదరిస్తుండేవారు. అందుకే ‘భక్త పోతన’ కథ ఎంచుకున్నారాయన. సినిమా పెద్ద హిట్టు.

ఆ తర్వాత ‘యోగి వేమన’.
కళాఖండమన్న పేరే తప్ప కాసులు రాలలేదు. కేవీరెడ్డికి కోపం వచ్చింది. మాస్ మనసులో తిష్ట వేయాలని డిసైడైపోయారు. ‘గుణసుందరి కథ’ అనే జానపదంతో జనంలోకి చొచ్చుకుపోయారు. ఆ తర్వాత ‘పాతాళభైరవి’. మాస్ హీరోకి ఓ గ్రాఫ్, ఓ ఫార్ములా క్రియేటయ్యింది ఆ సినిమాతోనే.

18 పర్వాల్లాంటి సినిమాలు
మహాభారతంలోని పర్వాలు 18, పురాణాలు 18, శక్తి పీఠాలు 18. కేవీ రెడ్డి సినిమాలు... 18.
చారిత్రకం, జానపదం, సాంఘికం, పౌరాణికం... అన్నీ చేశారు. భక్తపోతన... యోగివేమన... గుణసుందరి కథ... పాతాళ భైరవి... పెద్ద మనుషులు... దొంగరాముడు... మాయాబజార్... పెళ్లినాటి ప్రమాణాలు... జగదేకవీరుని కథ... శ్రీకృష్ణార్జున యుద్ధం... సత్యహరిశ్చంద్ర... భాగ్యచక్రం... ఉమాచండీగౌరీశంకరుల కథ... శ్రీకృష్ణ సత్య... అటు కళా తగ్గలేదు. ఇటు కమర్షియాల్టీ మిస్సవలేదు. కేవీరెడ్డి కత్తికి రెండు వైపులా పదునే.

రొమాంటిక్ పర్సన్
కేవీరెడ్డి సినిమాల్లో సాహసాలు బావుంటాయి. పాటలు బావుంటాయి. నేపథ్యమూ అదుర్స్. ఇక రొమాన్స్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ. ఆ రోజుల్లోనే అంత చిక్కటి రొమాన్‌‌సని ఒడిసిపట్టారాయన. పైకి సీరియస్‌గా కనిపిస్తారు కానీ, బేసిగ్గా ఆయన మంచి రొమాంటిక్ పర్సన్. భార్య శేషమ్మ అంటే ప్రాణం పెట్టేసేవారు. ఏజ్ పెరిగేకొద్దీ ఇద్దరి మధ్యనా విపరీతమైన బాండేజ్. ఆకాశంలో వెన్నెల కనపడగానే ఆయనలోంచి రొమాంటిక్ పర్సన్ బైటికొచ్చేసేవాడు. భార్యను మేడమీదికి తీసుకొచ్చి వెన్నెలను దోసిళ్లకొద్దీ తాగినంత పని చేసేవారు.

పొద్దున్నే స్నానం చేసొచ్చాక చక్కగా పంచె కట్టుకుని ఓ పొడవాటి ముక్కాలి పీట మీద కూర్చునేవారు. ఈలోగా శేషమ్మ దువ్వెన తీసుకుని వచ్చేది. ‘పాతాళ భైరవి’లో ఎన్టీఆర్‌లాగా రెండు చేతులూ కట్టుకుని తల వంచుకుని కూర్చునేవారు. ఎంచక్కా శేషమ్మ పాపిట తీసి తల దువ్వేది. ఆ వెంటనే లేచి అద్దం వైపు కూడా చూడకుండా ‘‘ఏమేవ్... వెళ్లొస్తానే’’ అంటూ కారెక్కి వెళ్లిపోయేవారు.

‘శ్రీకృష్ణ సత్య’ టైమ్‌లోనో... దానికన్నా ముందో శేషమ్మకు సుస్తీ చేసింది. పెద్ద డాక్టరుకు చూపిస్తే కేన్సర్ అని తేల్చారు. కేవీ రెడ్డికి గుండె పగిలిన ఫీలింగ్. అసలు మనిషి తెగ ఇదైపోయారు. ఆమెను వదిలిపెట్టి ఇల్లు కూడా దాటాలనిపించేది కాదు. ఇన్నాళ్లూ తన ప్రాణంలో ప్రాణంగా మసిలిన వ్యక్తి తనను వదిలివెళ్లిపోతుందా? దేనికీ భయపడని వ్యక్తి భార్య చావును ఊహించుకుని కదిలిపోయారు. ఆమెకు కేన్సరన్న విషయం ఎవ్వరికీ చెప్పలేదు. తనే కంటికి రెప్పలా చూసుకోసాగారు.

కేవీరెడ్డికి బ్లడ్ ప్రెషర్ ఉంది. బ్లడ్ షుగర్ ఉంది. రెండు వంశపారంపర్యపు జబ్బులే. శేషమ్మ కేన్సర్ సంగతి తెలిశాక తనూ మందులు వాడడం మానేశారు. దాంతో ఆయన మరింత నీరసపడిపోయారు.

1972 సెప్టెంబర్ 15.
కేవీ, శేషమ్మ... కింది బెడ్‌రూమ్‌లో ఉన్నారు. పిల్లలంతా మేడమీద గదిలో పడుకున్నారు.
ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదు. ఏదో గుబులుగా అనిపించింది. భార్యను దగ్గరకు తీసుకుని ‘‘ఇహ నుంచి పిల్లల బాధ్యత నీదే. జాగ్రత్తగా చూసుకో’’ అంటే, ఆవిడ ఆయన నోరు మూసేసి ‘‘ఏంటా... పిచ్చి మాటలూ’’ అంది. కాసేపటికి ఇద్దరూ నిద్రపోయారు.

(సెప్టెంబర్ 16) అర్ధరాత్రి 2 గంటల సమయంలో... కేవీ రెడ్డి గుండె పట్టుకుని అల్లాడుతున్నారు. శేషమ్మకు ఏం చేయాలో పాలుపోలేదు. గభాల్న పిల్లల్ని కేకవేసి కిందికి పిలిచింది. అప్పటికే ఆయన నిశ్చలమైపోయారు. ఓ కొడుకు పరిగెత్తుకుంటూ వెళ్లి వీధి చివరనున్న డాక్టరుని తీసుకొచ్చాడు. అప్పటికే ఆయన ప్రాణం ఈ లోకాన్ని వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయింది.

వెళ్తూ వెళ్తూ భార్య శేషమ్మ వైపు దీనంగా చూసిందా ప్రాణం. భార్యకన్నా తనే ముందు వెళ్లిపోవాలనుకున్నారేమో! అదే జరిగింది. కేవీరెడ్డి పోయిన మూడు నెలలకు శేషమ్మ కూడా కన్నుమూసింది. ఓ ప్రేమకథ అక్కడితో ముగిసిపోయింది.

ముక్తాయింపు : ‘సెవెన్త్ సెన్స్’ సినిమా చూశారు కదా. అందులో మన పూర్వీకుడైన బోధిధర్మ డీఎన్‌ఏని మళ్లీ రీయాక్టివేట్ చేస్తారు. అలా కేవీరెడ్డి డీఎన్‌ఏని కూడా రీయాక్టివేట్ చేస్తే... మళ్లీ కళాఖండాలు పుడతాయేమోనని దురాశ.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration