Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through September 13, 2011 * Alludi daridram < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5673
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Monday, September 12, 2011 - 9:16 pm:    Edit Post Delete Post View Post/Check IP

పొద్దుగాల నిద్రలేస్తా ఉండగానే కుయ్ కుయ్‌మని పోను మోగింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా పోను చేస్తావుంది అని స్విచ్ నొక్కి హలో అన్నా - అవతలి గొంతు వినగానే నమ్మబుద్ధి కానంత ఆశ్చర్యమేసింది - అవునో కాదో తేల్చు కోటానికి ఇంకొంచెం బిగ్గరగా మాట్లాడబ్బా - వాయిస్ అర్థం కావటల్లేదనేసినా - దాంతో అవతల నుండి నేనత్తమ్మా - సెంద్రబాబు నాయుడ్ని - నేనే మాట్లా డతన్నా అన్నాడు. కాసేపు నా బుర్రంతా గందరగోళ పడిపోయినాది. ఇదేటబ్బా నిప్పుకు, నీరుకు మాదిరి మా ఇద్దరిది జనమ జనమల ఇరోదమే. పోట్లాడుకో వటమే తప్ప మంచిగా మాట్లాడుకొనెరగమే. అట్లాంటిది ఈ పోనేంది అని ఆలోచిత్తానే ఏందల్లుడూ! బాగున్నావా. ఇట్లా పోనుజేసినావేంటి. నాతో ఏమన్నా పనిబడినాదా? అదేందో చెప్పరాదూ అన్నా అనుమానంగానే -

ఏం లేదత్తమ్మా! నేను శానా ఇబ్బందుల్లో తలకిందులా పడిపోయినాను. ఎటు జూసినా ఏందారీ కనబళ్లా - రాత్రి కల్లో మామ కనిపించి మీ అత్తమ్మతో మాట్లాడగూడదా అని కేకలేసినాడు. అందుకే తెల్లారే నీకు పోను చేత్తన్నా. నువ్వు నమ్మవు గానీ నిజంగా కష్టమొస్తే ముందు నువ్వే గుర్తొస్తావత్తమ్మా అన్నాడు నయగారంగా. నేనింకా షాక్ నుండి తేరుకోనే లేదు. అదేందల్లుడూ నీకు నేనెందుకు గుర్తొస్తాను అని అడిగినా -

ఎందుకేంటి నీ దయవల్లనే గాదూ నేను ముక్యెమంత్రి అయ్యింది. సుకంగా శానా ఆస్తులు సంపాదించుకున్నది. ఏంటి మాట్టాడవు. నీ ఆరోగ్గెం బాగున్నదా? ఇంకా ఏందో మాట్టాడతానే ఉండాడు. నేను కలగజేసుకుని బాగానే ఉన్నాములే అల్లుడూ. కానీ ముందు నీకస్టమేంటో చెప్పరాదూ అన్నా -

ఏం లేదత్తమ్మా నాకు బతకటానికే శానా కస్టమైతా ఉంది. నాకొచ్చే ఆదాయమంతా నా కర్చులకే సాలటంలా. బయటికి పోవటానికి కారు గూడా లేకపాయె. పాత అంబాసిడరు కారు తుక్కుతుక్కు మాదిరి అయినాది. అది రిపేరు చేయిద్దామన్నా నా కాడ డబ్బుల్లేవ్. ఇల్లు ఇరవై లచ్చలు పెట్టి కొన్నానా అది కూడా ఇప్పుడే రిపేరుకొచ్చినాది. ఎక్కడ జూసినా పెచ్చులూడిపోయి, కన్నాలు పడి వర్సమొస్తే ఇల్లు నదిలా పారతుండాది. తిండిక్కూడా కటకటైపో తన్నాది. నాకేమో అన్నం సయించదాయె. డ్రైప్రూట్స్ మాత్రమే తింటానా. వాటి రేట్లు జాస్తైయినాయి. నిండా కస్టాల్లో మునిగితేలతావున్నా. మరొక్కపాలి ముక్యెమంతిరినైతే నా బాదలన్ని తీరతాయి అన్నాడు కళ్లనీళ్లు పెట్టుకుంటూ -

అదేందల్లుడూ నువ్వు శానా సంపాయించినావని అందరంటున్నారుగా. మరేంటీ బీద అరుపులు అన్నా -

అయ్యో- వాటి సంగతి ఏం జెప్పేదత్తమ్మా. సింగపూర్లో ఒటేలు కట్టిత్తే అక్కడి మాపియా వాళ్లు రూపు మాపినారు. మలేసియాలో ప్యాట్రీ పెడితే, నీ గవర్మెంట్ పూడ్చినాది. ఇంక ఇక్కడ నీకేం పనబ్బా. నీ ఇండియాకే బొమ్మని తరిమేసారు. వందలెకరాలు కొని బినామీ పేర్లతో పెడితే ఆ బినామీ గాళ్లంతా బూములు మాయేనని అక్కడే తిష్టేసినారు. ఇంత బతుకూ బతికీ ఇంటెనకాల సచ్చినట్టుంది నా పరిత్తితి. ఏం పాలుబోక నువ్వయినా అర్తం చేసుకుంటావని నీతో చెప్పుకుంటున్నా అన్నాడు ఇంకా ఏడుపు గొంతుతో -

అదేందల్లుడూ నీకు నేనెట్టా సాయపడగలను. నేనే ఇబ్బందుల్లో ఉంటిని గందా. మీ మావకట్టిచ్చిన ఇల్లు కూడా మీరే లాక్కుంటిరి. ఇప్పుడు నాకే పైకప్పులేదే. ఇంక నీకు నేనేం చేయగలనబ్బా అన్నా ఆచ్చెర్యంగా. నిజం చెప్పొద్దూ వాని యాక్సన్ జూసి నా కండ్లమ్మట కూడా నీళ్లొచ్చేసినాయి.

నీ మనసెంత దొడ్డదత్తమ్మా. నాకు తెల్సు నువ్వు ఆదుకుంటావని. ఆ రోజు గూడా మా మావ పార్టీ నుండి నన్ను బైటకు తరిమితే మళ్లీ నువ్వే రాజీ కుదిర్చి నేను పైకి రావటానికి తోడుపడ్డావు. అది జనమ జనమలకు మర్సిపోలేను. అయితే నీ రుణం తీర్సుకోలేదని ఎప్పుడూ నా మదిలో బాద ఉండనే ఉంది.

ఏదైనా చేద్దామంటే నా బావమరదులూరుకోరని బయపడ్డా. అదంతా మనసులో పెట్టుకోమాక. ఎంతయినా అల్లుడ్నిగందా అన్నాడు.
అబ్బే అదేంలేదల్లుడూ. నీ మామకు నాకు నువ్వు జేసిన మంచి ఎట్టా మరుస్తాను. ఎప్పటికీ గుర్తుండిపోయే మేలు జేసినావుగందా. సరే అది పోనీలే. ఇప్పుడేం కావాలో సెప్పు మరి -

ఏంలేదత్తమ్మా-నా పార్టీ శానా కస్టాల్లో ఉంది. నా బతుకు సూస్తే ఇట్టాయే. చేతిలో రూపాయి కాసైనా లేదు. అందుకే అత్తమ్మా మా మావ నీకు రాసిచ్చిన మూడెకరాల తోటుందిగా అది నా పేర్న రాసేసావనుకో అదమ్ముకుని పైసలు తెచ్చుకుని పార్టీ యవ్వారాలు నడుపుకుంటా. నేను మళ్లీ ముక్యెమంత్రినయ్యాక ఎమ్మార్ భూముల్లో నీకొక విల్లా కొనిస్తానత్తమ్మా. నీ రుణం ఈ పారి నిజంగా తీర్చుకుంటా. మా మావమీదొట్టు అంటూ ఏందో మాట్టాడతానే ఉన్నాడు -

అప్పటికే నాకు నిండా శక్కెరొచ్చేసి దబ్బున నేల మీదపడిపోయినా. ఆ టయింలో కూడా అమ్మ నా అల్లుడో అనుకుంటూనే పడిపోయినా.

-డా. నందమూరి లక్ష్మీపార్వతి

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration