Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through June 30, 2011 * Manas and Pessi < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Naaistam
Bewarse Legend
Username: Naaistam

Post Number: 33510
Registered: 07-2005
Posted From: 115.113.9.11

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Thursday, June 30, 2011 - 12:50 am:    Edit Post Delete Post View Post/Check IP

keka ey naidooo ayuna sare greenpeace samsta naidu daa...ee vishyum naaku teleedu...

nenu asalke member ni...i am proud...and ee vishyum telisaaka I would like to pledge more CLIPART--howdy

thank you sir
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5346
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 29, 2011 - 11:24 pm:    Edit Post Delete Post View Post/Check IP


Sasibabu:




baa atanu ee casette o teledu oorike sardaki vesa. few days back evaro model peru lo naidoo ani vunte teddu padindi kada anduke vesa. naidu ante kamma/kapu/balija/ gavara/ koppula velama evarina kavochhu.

telugodani sambara padadaam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Sasibabu
Mudiripoyina Bewarse
Username: Sasibabu

Post Number: 3673
Registered: 10-2010
Posted From: 160.109.62.97

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 29, 2011 - 11:16 pm:    Edit Post Delete Post View Post/Check IP

maroka casette thedMOVIEART--exactly
Big Fan of Biggest Distributor
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5345
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, June 29, 2011 - 10:45 pm:    Edit Post Delete Post View Post/Check IP

గడ్డకట్టుకుపోయే ఆర్కిటిక్ సముద్రజలాల్లోకి ప్రవేశించే భారీ చమురు రిగ్గులకు ఇప్పుడు ‘పైరేట్ల’ బెడద పట్టుకుంది. ఈ పైరేట్లు వాణిజ్య నౌకలను గడగడలాడించేస్తున్న సోమాలియా పైరేట్లు కారు. 12 దేశాలకు చెందిన ‘గ్రీన్ పైరేట్లు’. ఏప్రిల్ 12 తెల్లవారు జామున స్పీడ్ బోట్లలో 11 మంది ‘గ్రీన్ పైరేట్లు’ ప్రపంచంలోనే భారీ రిగ్గులలో ఒకటైన లీవ్ ఎరిక్‌సన్‌ను చేరి, నిలపమని హెచ్చరించారు. నిరాయుధుల హెచ్చరికలను ఎవరు లెక్క చేస్తారు? పర్వతారోహకుల సాధ నాలతో వారంతా 15 అంతస్తుల రిగ్గు ప్లాట్‌ఫాంపైకి చేరారు. గడ్డకట్టించేసే చలిలో, మంచు తుపానుల్లో 10 రోజులపాటు దానిని అడ్డగించారు.

ఉత్తర ధృవప్రాంతంపై మంచుకప్పు త్వరత్వరగా కరిగిపోతోందని ఫలి తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయన్నది తెలిసిం దే. చమురు రిగ్గింగుతో ఆర్కిటిక్ ప్రాంతానికి పెనుముప్పు ముంచుకొస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరికలను బేఖాతరు చేసి చమురు కంపెనీలు పోటాపోటీగా చమురు తవ్వకాలు సాగిస్తున్నాయి. తాజాగా గ్రీన్‌ల్యాండ్ ఆర్కిటిక్ సాగరంలోని పురాతన మహామంచు ఖండాలను ఛేదిస్తూ నాలుగు చమురు బావులను తవ్విస్తోంది. అందుకోసం రోజుకు 5 లక్షల డాలర్లకు కైరన్ ఎనర్జీ అనే సంస్థ 53 వేల టన్నుల భారీ రిగ్గును అద్దెకు తీసుకుంది.

దీంతో డెన్మార్క్ పోలీసుల రంగప్రవేశంతో ‘గ్రీన్ పైరేట్ల’ గొడవ ఓ పదిరోజుల్లో ముగిసిందనుకునేసరికి... జూన్ 17న వారి నాయకుడు కుమి నాయుడు మరో కార్యకర్తతో కలిసి నిషేధాజ్ఞలను ధిక్కరించి ఆర్కిటిక్‌లో ప్రత్యక్షమై రిగ్గు ప్లాట్‌ఫాం పెకైక్కాడు. తవ్వకం పనిని నిలిపివేయాలంటూ కైరన్ ఎనర్జీకి... వేల సంతకాల వినతిపత్రాన్ని అందజేశాడు. డెన్మార్క్ పోలీసులు యథాతథంగా రంగప్రవేశం చేసి నాయుడును అరెస్టుచేసి కేసులు నమోదు చేశారు. 80 వేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. ఐదు రోజుల జైలు నిర్బం ధం తదుపరి ఆర్కిటిక్ ప్రవేశాన్ని నిషేధిస్తూ విడుదల చేశారు. విడుదలైన మరుక్షణమే, ఇంకా గ్రీన్‌ల్యాండ్‌లో ఉండగానే... నిషేధాలను లెక్కచేసేది లేదని మళ్లీ ఆ రిగ్గుపెకైక్కి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తానని నాయుడు ప్రకటించాడు!

భారతీయ (తెలుగు) సంతతికి చెందిన దక్షిణాఫ్రికా జాతీయుడు కుమి నాయుడు (45) ‘గ్రీన్‌పీస్ ఇంటర్నేషనల్’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్. ‘గ్రీన్‌పీస్’ వాతావరణ మార్పుల పెనువిపత్తులపై పోరాడుతున్న అంతర్జాతీయ స్వచ్ఛంద కార్యకర్తల సంస్థ. ప్రస్తుతం అది ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు తవ్వకాల నిలిపివేత కోసం పోరాడుతోంది. 1989లో ఎక్సాన్ వాల్డెజ్‌కు చెందిన చమురు ట్యాంకరు ప్రమాదం వల్ల ఏర్పడిన చమురు తెట్టు కలిగించిన పర్యావరణ ఉత్పాతం ఇంతవరకు ఉపశమించలేదు. ఆర్కిటిక్ ప్రాంతంలో అలాంటి చమురు తెట్టు ఏర్పడితే దాన్ని తొలగించడం అసాధ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇటీవల మెక్సికో గల్ఫ్‌లో సంభవించిన బీపీ రిగ్గు ప్రమాదంలాంటి విపత్తు ఎదురైతే ఎదుర్కోడానికి కైరన్ ఎనర్జీ వద్ద ఉన్న పథకమేమిటో వెల్లడించాలని ‘గ్రీన్‌పీస్’ డిమాండు చేస్తోంది. అసలు ఎలాంటి కాంటింజెన్సీ పథకమూ లేనేలేదని సవాలు విసురుతోంది. కైరన్ ఎనర్జీ పెదవి విప్పడం లేదు. మైనస్ సున్నా ఉష్ణోగ్రతలతో చేరడానికే కష్టంగా ఉండే ఆర్కిటిక్ సముద్రంలో బీపీ లాంటి ప్రమాదానికి పరిష్కారమే లేదని గ్రీన్‌పీస్ వాదిస్తోంది.

ఇప్పటికే సంభవించిన వాతావరణ మార్పులతో ఆర్కిటిక్ సముద్రం ఎప్పుడు గడ్డకడుతుందో, ఎన్నాళ్లు గడ్డకడుతుందో తెలియని అయోమయంలో ఎస్కిమోల అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఇక చమురు కంపెనీల పుణ్యమాని కుక్కలులాగే స్లెడ్జి బళ్లపై గడ్డకట్టిన సముద్రాలపై వేటాడే ఎస్కిమోలు అంతరించిపోయే రోజు ఇప్పుడిక ఎంతో దూరం లేదు. సున్నితమైన ఆర్కిటిక్ పర్యావరణ వ్యవస్థ మొత్తంగా ప్రపంచ పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తుంది. ఉత్తర ధృవంపై మంచుకప్పు కరిగిపోవడంతో ప్రపంచం ఇప్పటికే ఎన్నడూ ఎరగని ప్రకృతి వైపరీత్యాలకు గురవుతోంది. ఆ కప్పును త్వరగా కరిగించేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా చమురు కంపెనీలు సాగిస్తున్న ఆర్కిటిక్ విధ్వంసాన్ని ఆపడం నాయుడు లాంటి వారివల్ల కాదనే వాదన సబబే కావచ్చు.

పదిహేనేళ్ల ప్రాయం నుంచి శ్వేతజాత్యహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నాయుడికి అరెస్టులు, జైళ్లు, అజ్ఞాతవాసాలు, ప్రవాసజీవితం కొట్టినపిండే. అంతేకాదు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పొలిటికల్ సోషియాలజీ డాక్టరేటు కూడా ఉంది.

‘గ్రీన్‌పీస్’ ఆందోళన ప్రచారానికి మించి సాధించే దేమీ లేదని పెదవి విరుస్తున్న వారే ఎక్కువ. అయితేనేం, నాయుడు మాత్రం... ఆర్కిటిక్‌కు ముంచుకొస్తున్న చమురు ముప్పుపైకి ప్రపంచం దృష్టిని మళ్లించడమే గ్రీన్‌పీస్ లక్ష్యమని, అందులో విజయం సాధిస్తే చాలునని అంటున్నాడు. ప్రజలకు ప్రపంచాన్ని రక్షించుకోగల శక్తి ఉందని గట్టిగా నమ్ముతున్నాడు. నాయుడు నమ్మకం వమ్ముకాలేదు. నెల రోజుల గ్రీన్‌పీస్ ఆందోళన తదుపరి ఓ కొత్త గొంతు వారితో చేరింది. గ్రీన్‌ల్యాండ్‌లో గ్యాస్, చమురు తవ్వకాలు కూడదని ప్రపంచం దానికెందుకు చెప్పడం లేదు? అని నార్వే విదేశాంగ మంత్రి జోనాస్ గార్ స్టోర్ అంతర్జాతీయ సమాజాన్ని ప్రశ్నించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration