Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through May 31, 2011 * ERRABELLI DADYAKAR < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Respect
Yavvanam Kaatesina Bewarse
Username: Respect

Post Number: 1887
Registered: 05-2006
Posted From: 134.134.139.74

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Sunday, May 29, 2011 - 12:42 pm:    Edit Post Delete Post View Post/Check IP

GOWDA, NAGAM , NOW ERRABELLI GATTIGA TAYARU AYYADU
GOOD SPEECH
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Fanno1
Celebrity Bewarse
Username: Fanno1

Post Number: 5108
Registered: 03-2004
Posted From: 152.14.61.98

Rating: 
Votes: 3 (Vote!)

Posted on Sunday, May 29, 2011 - 12:36 pm:    Edit Post Delete Post View Post/Check IP

తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు వపర్ ఫుల్ ప్రసంగం చేశారు. తెలంగాణ సాధనకోసం తాము చేస్తున్నకృషిని ఆయన గట్టిగా వినిపించారు. ఈ సందర్భంగా ఆయన టిఆర్ఎస్ పై, నాగం జనార్ధనరెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. ఆద్యంతం దయాకరరావు ప్రసంగం ఉత్తేజపూరితంగా సాగింది.తెలంగాణ లో అన్ని పార్టీలు జెండాలను పక్కన బెట్టి ముందుకు వస్తే తాము సిద్దమేనని ఆయన ప్రకటించారు.

జెఎసి నేత కోదండరామ్ కూడా ఏకపక్షంగా మాట్లాడుతున్నారని,కెసిఆర్ మాటలనే ఆయన చెబుతున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ తమ సభలకు అడ్డుపడితే తరిమి కొడతామని దయాకరరావు హెచ్చరించారు. దయాకరరావు ప్రసంగం పూర్తిపాఠం ఈ విదంగా ఉంది.


\"కెసిఆర్ మాటలను నమ్మి జెఎసి వ్యవహరించరాదు. ఇతర ప్రాంతాలవారి మనోభావాలను మేము ఇబ్బంది పెట్టం. మా మనోభావాలను ఎవరూ దెబ్బ తీయవద్దు. మా తెలంగాణలో ఉన్నమనోభావాలను ఎవరూ కించపరచవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ క్యాడరు బలంగా ఉంది. లీడర్లు పోయారు. పదవులకోసం కాని క్యాడరు వెళ్లలేదు.


తెలంగాణ జెండాను ఒక భుజాన, తెలుగుదేశం జెండాను మరో భుజాన వేసుకుని వెళుతున్నాం.మీరు(చంద్రబాబు) పదవులు ఇచ్చినవారే మోసం చేస్తున్నారు. కార్యకర్తలుకాదు. కరీంనగర్ సభ ను చూశారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డువస్తే,ఉరికించి కొట్టాం.విద్యార్ధులు అడ్డు వస్తే దగ్గరికి తీసి చెప్పాలి. కాని టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు వస్తే తరిమి కొట్టండి.జెఎసి వారికి కూడా చెప్పాము ఎన్నిసార్లు చెప్పామో గుర్తు చేసుకోండి. కాంగ్రెస్,టిఆర్ఎస్ అన్ని పార్టీలు ఉన్నాయి. మా పార్టీ నాయకుడు రమణ ఆనాడు చెప్పారు.


అన్ని పార్టీలు జెండాలు పక్కనబెడితే జెఎసి జెండా కింద పనిచేయడానికి సిద్దం అని చెప్పాం. మేం జెండా పెట్టలేదు.కాని బిజెపి,టిఆర్ ఎస్ లు పార్టీ జెండాను వదలలేదు. వారు స్వార్ధం కోసం పనిచేస్తున్నారు. తెలుగుదేశం జెండా పెట్టవద్దంటే కోదండరామ్ ఎలా సమర్ధిస్తారు. తెలుగుదేశం జెండా ను పెట్టుకుని పోరాటం చేస్తాం. మాతో పొరాటం చేయండి, సంవత్సరంలో తెలంగాణ వస్తుంది. కెసిఆర్ ఎన్నిసార్లు అమ్ముడుపోయారు.


పది మది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అమ్ముడు పోయారు. ఆ రోజు కోదండరామ్ ఏమి చేశారు. విద్యార్ధులు ఏమి చేశారు. మొన్న,మొన్న టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మగ్గురు ఎమ్మెల్యేలు అమ్ముడుపోతే వారిని ఎందుకు బహిష్కరించలేదు. నీ గుట్టు బయటపెడుతుందని భయపడుతున్నావు నేను కోదండరామయ్యగారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. టిఆర్ఎస్ వారు అడ్డంపడితే ఏమి చేయాలోచెప్పు.



తెలంగాణ కోసం ఏమి చేయాలో చేయండి . ముప్పై ఐదుమంది ఎమ్మెల్యేలు దేనికైనా సిద్దంగా ఉన్నాం. చంద్రబాబు పూర్తిగా అనుమతి ఇచ్చారు.తెలంగాణ రాష్ట్ర సమితి నేత కెసిఆర్ కుటుంబం ఏమి త్యాగం చేసింది. ఉద్యమం చేస్తే కుటుంబందెబ్బతింటుంది. ఉద్యమం తో ఏమి త్యాగం చేశావు. కొడుకుకు ఎమ్మెల్యే పదవి. సీమ నాయకులను బెదిరిస్తావు.తెల్లవారేసరికి మాటమారుస్తావు. రాత్రికిరాత్రి ఏమి జరుగుతోంది. కొడుకు ఒకపక్కన, అల్లుడు ఒకపక్కన వసూళ్లు చేశారు. నాయకులు ఎవరైనా చనిపోయారా? వారి పిల్లలు చనిపోయారా?


హరీష్ రావు కిరోసిన్ పోసుకుంటే అగ్గిపెట్టె దొరకదు. కాని విద్యార్దులు మాత్రం చచ్చిపోతున్నారు. తమిళనాడులో కరుణానిధి కుటుంబం ఎలా దోచుకుతిందో కెసిఆర్ కుటుంబం కూడా తెలంగాణలో అలా దోచుకుతింది. కెసిఆర్ ను వ్యతిరేకిస్తే తెలంగాణలో ఉండనివ్వరేమోనని భయపడ్డారు. కాని మొన్న కరీంనగర్ లో సభ పెట్టాకఆ భయం పోయింది. కెసిఆర్ పెత్తనం కోసమో, ఆయన దయకోసమో చేస్తే కోదండరామ్ ను కూడా ప్రజలు ఛీకొడతారు.

కోడిగుడ్లు చాటుగా వేస్తారా? రా ఎదురుగా వచ్చి వేయండి . తెలంగాణ వీరుడు ఎదురుగా పోరాడుతారు. తెలంగాణ కోసం పోరాడుదాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడే. అందరం చిత్తశుద్దితో ఉన్నాం. ఒక్కమాటపైనే ఉన్నాం.మేము పది జిల్లాలు తిరుగుతాం. సభలు పెడతాం. పార్టీని కాపాడుకుంటాం.సోనియాగాంధీని కెసిఆర్ ఒక్క మాట అనరు. విద్యార్ధులను చంపింది సోనియాగాంధీ కాదా. ఎప్పుడో ఐదేళ్ల కిందట సోనియాను బజారుకుఈడుస్తానన్నావు. ఎందుకు ఈడవడం లేదు. పార్లమెంటులో సోనియాను ఎందుకు నిలదీయవు. నేను కూడా టిఆర్ఎస్ పై గెలిచి ఆరు నెలలు పార్లమెంటులో ఉన్నా. అప్పుడు చూశా. ఎన్నడూ కెసిఆర్ పార్లమెంటుకే రాలేదు.తెలంగాణ కోసం ఉద్యమించాలి. ఎంతకైనా తెగించాలి.

నాగం ఆగం అయ్యారు.మమ్మల్ని ఆగం చేద్దామని అనుకున్నారు. కాని ఆయన ఆగం అయ్యారు. చంద్రబాబు ఉద్యమం చేయవద్దన్నారా? ఎందుకు అబద్దాలు చెబుతావు.సొంత ఇమేజీ కోసం పోయాడు తప్ప తెలంగాణ కోసం కాదు. ప్రెస్ కాన్పరెన్స్ లు పెట్టి వెళ్లిపోయేవారు.నీకన్నా నేను సీనియర్ ను మంత్రి పదవులు అనుభవించావు. నీకిచ్చినన్ని అవకాశాలు మరెవరికి రాలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి తనకు ఇష్టం లేదని వెళ్లిపోయారు. తప్పు లేదు.కాని నాగం అలాకాకుండా పార్టీని పాడు చేయాలని చూశాడు.నాగం వై.ఎస్.ను విమర్శించాడు. మరి జగన్ ముద్దయ్యాడు.వై.ఎస్. తెలంగాణకు అన్యాయం చేయలేదా?భూములు దోచుకోలేదా?


బాబ్లిపై కెసిఆర్ ఏమి చేయలేదు. కాని చంద్రబాబు బాబ్లి వద్ద రెండు రోజులు ఉపవాసం ఉన్నాడు.ఆంధ్ర,తెలంగాణ ఎమ్మెల్యేలంతా మాతోనే వచ్చి పోరాడారు. జైలుకువెళ్లారు. ఎన్నడైనా కెసిఆర్ కాని, ఆయన పిల్లలుకాని, అల్లుడుకాని, జైలుకు వెళ్లారా ? తెలంగాణ జెండాను, తెలుగుదేశం ెండానుకాపాడుకుందాం,టిఆర్ఎస్ ను తరిమికొడదాం. నాయకుడి ఆశీర్వాదం ఉంది. కెశవ్ వంటి కొంతమంది కొంచెం భిన్నంగా మాట్లాడుతారు.వారు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మన లక్ష్యం తెలుగుదేశాన్ని కాపాడుకోవడం, తెలంగాణను సాధించుకోవడం . జై తెలంగాణ, జై తెలుగుదేశం అంటూ దయాకరరావు తన ప్రసంగాన్ని ముగించారు.

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration