Topics Topics Help/Instructions Help Edit Profile Profile Member List Register Paatha Gnyapakaalu - Archives from Old DB  
Search New Posts 1 | 2 | 8 Hours Search New Posts 1 | 3 | 7 Days Search Search Tree View Tree View Latest tweets Live Tweets
Bewarse Talk Discussion Board * Archives - 2011 * Cine Talk - Reviews, Gossips, Insider Info etc. * Archive through May 12, 2011 * We wish a speedy recovery - Talaivar < Previous Next >

Author Message
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Andhramass
Bewarse Legend
Username: Andhramass

Post Number: 45193
Registered: 07-2006
Posted From: 203.26.122.12

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 11, 2011 - 9:13 pm:    Edit Post Delete Post View Post/Check IP

Rajani will be backMOVIEART--rajini
anni dananallo Annadanam Minna lal salam
Top of pagePrevious messageNext messageBottom of page Link to this message

Blazewada
Bewarse Legend
Username: Blazewada

Post Number: 15996
Registered: 08-2008
Posted From: 202.124.30.8

Rating: N/A
Votes: 0 (Vote!)

Posted on Wednesday, May 11, 2011 - 9:10 pm:    Edit Post Delete Post View Post/Check IP

Wishing a speedy recovery for Rajini Kanth CLIPART--flower!!!


చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చంద్రముఖి సెంటిమెంట్ వెంటాడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో నటించినవారు ప్రమాదాలకు గురి కావడంతో ఆయనను చంద్రముఖి సెంటిమెంట్ వెంటాడుతున్నట్లు భావిస్తున్నారు. డీహైడ్రేషన్‌తో రజనీకాంత్ గత నెల 29వ తేదీన ఆస్పత్రిలో చేరి, అదే రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. మళ్లీ ఈ నెల 4వ తేదీన ఆస్పత్రిలో చేరి మంగళవారం డిశ్చార్జీ అయ్యారు. ఈ సమయంలో ఆయన స్వాముల ధ్యాన మందిరానికి ఆశ్రమానికి వెళ్లి గంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత కాళికాంబ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆయన చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లే అవకాశాలున్నట్లు కూడా చెబుతున్నారు. దీంతో రాణా చిత్రానికి తీవ్రమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

కాగా, రాణా చిత్రంలో ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నారు. అరవై ఏళ్ల వయస్సు పైబడిన రజనీకాంత్ రాణా చిత్రంలో ఓ యువకుడి పాత్ర పోషిస్తున్నారు. దానికోసం ఆయన డైట్ చేసినట్లు చెబుతున్నారు. దాదాపు 20 రోజులు డైట్ చేయడంతో అది రజనీ ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. దాదాపు 75 కిలోల బరువు ఉన్న రజనీ డైట్‌తో 15 కిలోల బరువు తగ్గారు. అంతేకాకుండా, ఆల్కహాల్ కూడా మానేశారు. ఇది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. రజనీ ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు చెబుతున్నారు.

ఇదిలా వుంటే, రజనీని మాత్రం సెంటిమెంట్ తీవ్రంగా వేధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రముఖి సినిమాలో నటించడం వల్లనే కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్, నటి సౌందర్య ప్రమాదంలో చనిపోయారనే సెంటిమెంట్ ప్రబలంగా ప్రచారంలో ఉంది. దీని ప్రభావం రజనీకాంత్ మనసుపై పనిచేస్తుందని చెబుతున్నారు. సెంటిమెంట్లను ఎక్కువగా నమ్మే రజనీకాంత్‌కు అదే ఇబ్బందిగా మారిందని అంటున్నారు. అంతేకాకుండా, రాణా చిత్రం కథకు చారిత్రక నేపథ్యం ఉంది. ఈ చిత్రంలో నటిస్తుండడం వల్ల కూడా రజనీకాంత్‌కు కష్టాలు తెచ్చిపెడుతుందని అనేవాళ్లు కూడా ఉన్నారు. దానివల్ల రాణా చిత్రం ముందుకు సాగుతుందా, లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే, స్థిరచిత్తం, దృఢసంకల్పం గల రజనీకాంత్ వాటిని అధిగమిస్తారని అశిస్తున్నారు.


సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యం కారణంగా.. త్వరలో విడుదల కానున్న రాణా చిత్రం చిక్కుల్లో పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. గత కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. రజనీ అనారోగ్యం కారణంగా రాణా ఫిల్మ్ షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం... ఓ వైపు అనారోగ్యం నుంచి రజనీకాంత్ కోలుకుంటున్నప్పటికీ, వైద్యులు అతడిని అమెరికాలోని స్పెషలిస్ట్‌లకు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు వైద్యులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం రజనీకాంత్ త్వరలోనే అమెరికాకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా రాణా షెడ్యూల్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంపై ఫిలిం మేకర్లు 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించినట్లు సమాచారం, ఇప్పుడు వారు రజనీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. సినిమా షూటింగ్ మధ్యలో మరోసారి అతనికి అనారోగ్యం వస్తే పరిస్థితి ఏంటనేది వారి వెంటాడుతున్న ప్రశ్న. తన ఆరోగ్య పరిస్థితిని గమనించిన రజనీకాంత్ కూడా ఈ సినిమా గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

రాణా చిత్రంలో రజనీకాంత్ పాత్ర చాలా శక్తివంతమైనది, ఈ రోల్ చేయాలంటే ఎంతో ఫిజికల్ ఎనర్జీ కావాలి. మరి ఈ పరిణామాల నేపథ్యంలో రాణా చిత్రం తెరకెక్కుతుందో లేదా కాలమే నిర్ణయించాలి. మనం మాత్రం మన సూపర్‌స్టార్ త్వరగా కోలుకోని, అశేష ప్రేక్షక జనాన్ని అలరించాలని ఆ భగవంతుడిని కోరుకుందాం. గెట్ వెల్ సూన్ రజనీకాంత్..!!
A Pat on your Back is few inches away from Kick on your Butt CLIPART--icon_neutral

Topics | Last Hour | Last Day | Last Week | Tree View | Search | Help/Instructions | Program Credits Administration