Happy Days   Independent houses near kukatpally | Apartments in Pragathi Nagar | AndhraVaani.com | Log Out | Topics | Search
Register | Edit Profile

Bewarse TalkArchives - 2007Cine Talk - Reviews, Gossips, Insider Info etc.Archive through November 08, 2007 � Happy Days Previous Next

Author Message
Top of pagePrevious messageNext messageBottom of pageLink to this message

Sam
Yavvanam Kaatesina Bewarse
Username: Sam

Post Number: 3122
Registered: 03-2004
Posted From: 65.114.90.194

Rating:N/A
Votes: 0(Vote!)

Posted on Monday, November 05, 2007 - 1:26 pm:Edit PostDelete PostView Post/Check IP

chaala memories gurthochaayi....

rangu sodaalu, pulla ice lu ....
Top of pagePrevious messageNext messageBottom of pageLink to this message

Schummy
Kurra Bewarse
Username: Schummy

Post Number: 1384
Registered: 09-2004
Posted From: 65.242.68.190

Rating:N/A
Votes: 0(Vote!)

Posted on Monday, November 05, 2007 - 11:00 am:Edit PostDelete PostView Post/Check IP

పుల్ల ఐస్..

చిన్నప్పుడు ఐస్ కొనుక్కు తినాలంటే అదో పండగ. చిన్నప్పుడంటే 1982, 83 ల్లో రెండు, మూడు తరగతులు చదివేప్పటి సంగతి. వేటపాలెంలో ఎట్లాగూ అమ్మా, నాన్నల నియమాల బందిఖానాలో బందీలం కాబట్టి అప్పుడెలాగూ కోరిక తీరదు. ఎండాకాలం సెలవలకు జాగర్లమూడి వెళతాం కదా, అప్పుడిక ఇక “ఐస్ ఫ్రూట్ మాసోత్సవాలు” మొదలు. ఈ మాసోత్సవాలు సుమారు రెండు, రెండున్నర నెల్ల పాటు కొనసాగుతాయి.

మిట్ట మధ్యాహ్నం సైకిల్ క్యారేజ్ మీద చెక్క పెట్టె పెట్టుకుని “సేమ్యా ఐస్ , పాల ఐస్…” అంతూ కేకలు వేస్తూ వస్తాడు మన ఐస్ దేవుడు. పదిపైసల బిళ్ళిస్తే పది నిముషాలసేపు చల్లదనం పంచే మహానుభావుడు. అతను తీసుకొచ్చే పెట్టె గురించి ఇక్కడ కొంచెం చెప్పుకోవాలి.

అదొక థర్మోకోల్ లైనింగ్ ఉండే చెక్క పెట్టె. కొందరి పెట్టెల్లో వేర్వేరు ఖరీదుగల ఐస్ లు పెట్టడానికి వేర్వేరు విభాగాలుంటే, కొందరు అన్నీ ఒకే దాంటో పోసుకొస్తారు. దాన్ని పనికిరాని సైకిల్ ట్యూబ్ తో సైకిల్ వెనుక క్యారేజ్ కి కట్టుకుని వస్తాడు. ఆ పెట్టెలో ఉంటాయి ఐస్ ఫ్రూట్లు. ఆ పెట్టె బయట భాగానికి వస్తే అదో మినీ రంగుల ప్రపంచం. దాని మీద సినీ తారల బొమ్మలు అంటించి ఉండేవి. సినిమా తారలంటే ఎవరని? ఎవరుంటారు ఉంటే ఎన్.టీ.ఆర్. లేదా ఏ.ఎన్.ఆర్. వీళ్ళిద్దర్లో ఎవరో ఒకరి లేదా ఇద్దరి బొమ్మలు ఉండేవి. దినపత్రికలోనో, వార పత్రికలోనో అచ్చేసిన బొమ్మల్ని మైదాతో అతికించుకొచ్చేవా ్ళు.

అసలు పుల్ల ఐస్ కొనాలంటే డబ్బులు కావాలి గదా. డబ్బులు కావాలంటే ఎదో ఒక తాతయ్య ( మాతామహుడో, పితామహుడో. ఇద్దరిదీ అదే ఊరు లెండి, సంగం జాగర్లమూడి.) ఇవ్వాలి. పితామహుడు ఇస్తాడు గానీ ఆయన డబ్బులు ఇస్తే ఆ విషయం ఆ ఇంట్లోనే ఉండే పితాశ్రీకి, మాతాశ్రీకి వెంటనే తెలుస్తుంది, అక్కడ తీసుకున్న డబ్బు వెంటనే ఆయన ఏర్పరచే “వేసంకాలం పొదుపు నిధి” (అది ఇంకో కధ, దాని సంగతి మరో సారి చూద్దాం ). ఎప్పుడన్నా వాళ్ళకళ్ళబడకుండా మాయ చెయ్యగలిగితే చెయ్యడం. అదొక్కటే ఛాన్సు. లేదంటే మాతామహుడు మధ్యాహ్నం గానీ రాత్రి నిద్ర పోయేటప్పుడు గాని వేళ్ళు లాగడం (వేలు విరిగితే అంటే ‘టీక్క్ఖూ మంటే ఒక్కో వేలుకి పది పైసలు ), కాళ్ళు ఒత్తడం చేస్తే చిల్లర ఇస్తాడు. అమ్మ, నాన్న పితామహుడింట్లో ఉంటారు కాబట్టి మనం మతామహుడింట్లో ఉంటాం. ఇక్కడ మనకు ఎదుర్లేదు.

సరే, డబ్బులు దొరికాయి. ఇక ఐస్ కొనాలి. మా ఊళ్ళో రెండు ఐస్ కొట్లు ఉన్నాయి సంగం ఐస్ కొట్టు, ఇంకో దాని పేరు గుర్తు లేదు. సంగంలో అయితే డబ్బులిస్తే వాడు తెచ్చి ఇచ్చిన ఐస్ మనం తీసుకోవాలి. మనం మనకి నచ్చిన రంగు పుల్లైస్ ఎన్నుకునే సౌలభ్యం లేదు. కానీ అక్కడ ఎవరికీ కనపడకుండా కూర్చుని ఐస్ లాగించి వెళ్ళిపోయె అవకాశం ఉంది.

అదే రెండో ఐస్ కొట్టైతే, అది మనకు తెలిసిన వాళ్ళది. ఆ ఫ్రీజర్ బాక్సు పైకి ఎగిరి తొంగి చూసి మనకు నచ్చిన ఐస్ తీసుకునే అవకాశం ఉంది. ఈ ఐస్ కొట్లో మనకు తెలిసిన వాళ్ళు కూర్చుంటూ ఉంటారు. వీళ్ళల్లో ఎవడన్నా చూసి ఇంట్లో చెప్తే, ఇక వీపు విమానం మోతే.. ఊర్లో తిప్పి తిప్పి కొడితే వెయ్యి లోపు ఉంటుందేమో జనాభా.. పైగా అందరూ తరాల తరబడి పాతుకు పోయినవాళ్ళు. నాలో తప్పు చేస్తున్న భావన ఉంది కదా, మనం ఐస్ తింటున్న విషయం ఎవడన్నా ఇంటికి చేరేస్తాడేమో నన్న భయం. ఎలాగో ఐస్ కొని, తినడం ముగిస్తే నాలుక మీద ఆ రంగు పోయే ప్రయత్నాలు చెయ్యాలిక. నాలుక ని ఎక్కువసేపు లాలాజలంతో తడిపెయ్యడమో, నీళ్ళతో నోరు కడుక్కోడమో చెయ్యాలి.

ఒక్కోసారి ఇంట్లోనే మనకి డబ్బులిచ్చి అమ్మో, పిన్నో ఎవరో ఒకరు ఐస్ తెమ్మంటారు. ఒక స్టీల్ గ్లాస్ పట్టుకెళ్ళి అందులో ఐస్ వేసుకుని, వింటిని వదిలిన బాణం మాదిరి పరిగెట్టుకు రావాలి.

ఈ విధంగా ఐస్ పట్ల ప్రేమ కారిపోఉండగా.. మా చిన్న పిన్నికి పెళ్ళి కుదిరింది. కాబోయే బాబాయికి ఐస్ కొట్టు. ఇక పండగే పండగ.

వాళ్ళ పెళ్ళి ఎప్పుడవుతుందా.. మనం ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తామా అని ఒకటే తొందర. మొత్తానికి ఆ తర్వాతి వేసంకాలం సెలవలకి అక్కడే మకాం. సోడాలు కొట్టడం నుంచి, గల్లా పెట్టెలో చిల్లర గల గలలాడించే దాకా అన్ని బాధ్యతలూ నిర్వహించేసి తృప్తి చెందాను.

అంతకు ముందు మనకెంతో ఇష్టమైన బాదం పాలు(సుగంధ పాలు) త్రాగాలంటే ఏదో అద్భుతమే జరగాలి. అది ఒక గ్లాసు రూపాయిన్నరో, రెండో ఉండేది. మన కొట్లో మనకడ్డేముంది? దాహం వేసినా, వేయకపోయినా, బాదాం పాలే.

సోడాల్లో గ్యాస్ పట్టడం కూడా నేర్చుకుందామనుకు ్నాం గానీ, మా బాబాయి ఎప్పుడూ నన్ను ఆ ఛాయలకు కూడా రానీయలేదు.

ఆ షాపు మీదనే కొద్ది కొద్దిగా పైకి వస్తున్న మా బాబాయి గారి కుటుంబం, రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగిన గొడవల్లో పది, పదిహేను సోడాసీసాలు తప్ప మరేమీ మిగలనంతగా కాలి బూడిదైపోయింది.

బూడిదైపోయింది ఐస్ కొట్టే కాదు, ఆయన ఇద్దరు చిన్న పిల్లల భవిష్యత్తు కూడా. ఇప్పుడు ఆయన ఆ ఊరు వదిలి, మరో ఊళ్ళో వేరే వాళ్ళ ఐస్ కొట్లో పని చేస్తున్నాడు.

ఒకసారి సోడా కొడుతుండగా, అది పగిలి, నా కుడి చేతిపై లీలగా మిగిలిన చిన్న గాటు ఆనాటి చల్లని వైభవానికి ఓ తీపి గుర్తు.

http://poolavaana.wordpress.com/
No comments on PK భహు భార్యత్వం